బాలీవుడ్ హీరోయిన్ పై రానా కామెంట్స్.. బాటిల్ విసిరేసి మరీ..!

Rana Comments on Bollywood Heroine Duquer Salmaan movie Event

దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కింగ్ ఆఫ్ కోత. ఈ నెల 24న రిలీజ్ అవుతున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లుగా రానా, నానిలు వచ్చారు. అంతకుముందే నాని మాట్లాడుతూ దుల్కర్ సల్మాన్ నిజమైన పాన్ ఇండియా యాక్టర్ అని షాక్ ఇచ్చాడు. అతని కోసం ఇతర భాషల డైరెక్టర్స్ కూడా కథలు రాస్తున్నారని చెప్పాడు నాని.

నాని తర్వాత మాట్లాడిన రానా దుల్కర్ ఎంత మంచోడు అన్నది చెప్పాడు. దుల్కర్ ఒక సినిమా టైం లో బాలీవుడ్ హీరోయిన్ ఎన్ని టేకులు తీసుకున్నా ఎండలో అలానే నిలబడ్డాడని. ఆమె షాట్ రెడీ అయినా వాళ్ల హస్బండ్ తో ఫోన్ లో మాట్లాడుతుందని అలా చాలా టేకులు అవుతున్నా దుల్కర్ ఎండలోనే ఉన్నాడని. వర్క్ మీద అతనికి ఉన్న కమిట్మెంట్ అలాంటిదని అన్నారు రానా. ఆ హీరోయిన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని ఆమె పేరు ప్రస్తావించడం కరెక్ట్ కాదని.. కాని ఆ టైం లో నాకే కోపం వచ్చి వాటర్ బాటిల్ విసిరేసానని అన్నారు రానా.

ఇంతకీ రానా చెప్పిన ఆ హీరోయిన్ ఎవరని ఆరా తీస్తే బాలీవుడ్ హీరోయిన్ సోనం కపూర్ అని తెలుస్తుంది. దుల్కర్ తో ది జోయా ఫ్యాక్టర్ సినిమా చేశారు. 2019లో వచ్చిన ఈ సినిమా టైం లో ఒక ఇన్సిడెంట్ గురించి రానా కింగ్ ఆఫ్ కోత సినిమా ఈవెంట్ లో ప్రస్తావించారు. ఓ స్టార్ తనయుడిగా కాకుండా తన సొంత టాలెంట్ తో మెప్పిస్తూ వస్తున్నారు దుల్కర్ సల్మాన్. తెలుగులో మహానటి, సీతారామం తో హిట్లు కొట్టిన దుల్కర్ ఈసారి కింగ్ ఆఫ్ కోత సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh