బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ డ్రాప్ మరి రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తాడా ?

allu arjun out from sha rukh khan jawan and ram charn in

బాలీవుడ్ భారీ  ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ డ్రాప్ మరి రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తాడా ?

ప్రస్తుతం  మ‌న టాలీవుడ్ స్టార్స్ రేంజ్ పాన్ ఇండియాను దాటేసింద‌నే చెప్పాలి. ఎందుకంటే మ‌న స్టార్ హీరోల‌తో సినిమాలు చేయ‌టానికి బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. కొందరు సినిమాలు చేస్తుంటే మ‌రికొంద‌రు చ‌ర్చ‌ల్లో ఉన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్స్ కూడా మ‌న మార్కెట్‌పై క‌న్నేశారు. ముఖ్యంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో వారి సినిమాల‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ బాలీవుడ్ మూవీలో అల్లు అర్జున్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నారంటూ ఈ మ‌ధ్య వార్త‌లు చక్కెరలు కొట్టాయి. అయితే ఇప్పుడు వినిపిస్తోన్న టాక్ మేర‌కు ఈ ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ డ్రాప్ అయ్యారు.

ఇంత‌కీ అల్లు అర్జున్ గెస్ట్ రోల్‌ చేస్తారంటూ టాక్ వ‌చ్చిన సినిమా జ‌వాన్‌. అట్లీ ద‌ర్శ‌కత్వం లో  బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇందులో హీరో, ఓ గెస్ట్ రోల్ కోసం అట్లీ ఆ మ‌ధ్య అల్లు అర్జున్‌ని క‌లిసి క‌థ కూడా చెప్పాడు. అయితే ఆయ‌న పుష్ప 2తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల జ‌వాన్ సినిమాలో న‌టించ‌లేనని చెప్పేశార‌ట‌. దీంతో మేక‌ర్స్ ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారంటూ టాక్  వినిపిస్తోంది. బాద్షా షారూఖ్ ఖాన్‌కి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి మ‌ధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. మ‌రి బాద్షా రిక్వెస్ట్‌ను ఆయ‌న యాక్సెప్ట్ చేస్తాడా? లేక రిజెక్ట్ చేస్తాడా? అని చూడాలి.  ఈ మూవీలో న‌య‌న‌తార హీరోయిన్‌  ఈ చిత్రం జూన్ 2న రిలీజ్ అవుతుంది  ప‌ఠాన్‌తో ఈ ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన షారూఖ్ ఖాన్ ఇప్పుడు అదే ఊపును కంటిన్యూ చేయాల‌ని భావిస్తున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆయ‌న శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh