మంచు వారింట్లో మొదలైన పెళ్లి సందడి

manchu manoj to marry mounika reddy

మంచు వారింట్లో మొదలైన పెళ్లి సందడి

మనోజ్   మొ దటి భార్య ప్రణతి రెడ్డితో విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లికి రెడీ అయ్యారని విన్నాం. మంచు మనోజ్ గత కొన్ని రోజులగా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈయన ఇపుడు సెకండ్ మ్యారేజ్‌కు రెడీ సిద్దం అయ్యారు. మంచు ఫ్యామిలీ అంతా కూడా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో పెళ్లి పనులు మొదలయ్యాయి.  మనోజ్ పెళ్లి వేడుకలను  గణపతి, మహా మంత్ర పూజతో ప్రారంభించారు. నిన్న మెహందీ కార్యక్రమం ఘనంగా జరిగింది. నేడు సంగీత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంచు కుటుంబానికి చెందిన సన్నిహితులు పాల్గొనబోతున్నట్టు సమాచారం హీరో మంచు మనోజ్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాడు. దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డిని పెళ్లాడబోతున్నాడు. భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలువినిపడుతున్నాయి.

ఈ పెళ్లి వేడుక మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ నివాసంలో పెళ్లి వేడుక జరగనుంది. పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  మార్చి 3వ తేదీన వీరి వివాహం జరగనుంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరి తొలి వైవాహిక జీవితాలు అంత సాఫీగా సాగలేదు. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వీరి కొత్త జీవితం సంతోషకరంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే మంచు వారి ఇంటికి పెద్ద కోడలు వెరోనికా తో పాటు మంచు మనోజ్ మొదటి భార్యతో పాటు కాబోయే భార్య మౌనిక అందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. మంచు మనోజ్‌తో పాటు భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండవ వివాహమే కావడం విశేషం. భూమా మౌనిక రెడ్డితో ఎప్పటినుంచో క్లోజ్ గా ఉంటున్న మనోజ్ ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోబోతుండటం హాట్ టాపిక్ అయింది. గతంలో మౌనిక రెడ్డి మొదటి వివాహానికి కూడా మంచు మనోజ్ హాజరయ్యారనే ప్రచారం జరిగింది. తన భార్య ప్రణతి రెడ్డితో ఎప్పుడైతే డివోర్స్ తీసుకున్నారో అప్పటినుంచి మంచు మనోజ్ వార్తలు నిత్యం ఏదో ఒక రూపంలో దర్శనమిస్తున్నాయి. మంచు ఫ్యామిలీ ఎక్కడికి వెళ్లినా ఇదే విషయంపై ఆరా దీస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh