సాత్విక్‌ రాసిన సూసైడ్‌ నోట్ లో ఏముంది

Satwik suicide note

హైదరాబాద్ నార్సింగిలో శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. తాజాగా ఈ కేసులో సాత్విక్‌ సూసైడ్‌ లేఖ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు తను అనుభవించిన బాధను సాత్విక్‌ లేఖలో రాసుకొచ్చాడు. ప్రిన్సిపల్‌, కాలేజీ ఇంచార్జ్‌, లెక్చరర్‌ పెట్టే టార్చర్‌ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అమ్మానాన్న నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్ధేశం నాకు లేదు. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్‌, నరేష్‌ వేధింపులను తట్టుకోలేకపోయాను. వీరు నలుగురు నాతోపాటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు.

అసలు వీరి వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సారీ అమ్మా నేను పడిన టార్చర్‌ ఇంకొకరికి  రాకూడదని కోరుకుంటున్నా. నన్ను వేధించిన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలి. అమ్మా నాన్న లవ్‌ యూ, మిస్‌ యూ ఫ్రెండ్స్‌’ అంటూ సాత్విక్‌ తన సూసైడ్‌ నోట్‌లో రాశాడు. కాగా, నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థి సాత్విక్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్‌ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh