వచ్చే నెలలో విశాఖకు షిఫ్ట్ అవ్వనున్న సీఎం జగన్

Jagan may shift to Vizag

AP: వచ్చే నెలలో విశాఖకు షిఫ్ట్ అవ్వనున్న సీఎం జగన్

ఏపీ రాష్ట్ర పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని చెబుతున్న ఏపీ సీఎం జగన్ విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అన్నీ కుదిరితే మార్చి 22 ముఖ్యమంత్రి గృహప్రవేశం చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.

అలాగే ఉగాది రోజున విశాఖలో తన కార్యాలయం ఏర్పాటుచేయాలని భావించినా కొన్ని కారణాలతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈనెల 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో సీఎం బిజీగా ఉంటారంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

ఉగాది రోజు విశాఖలో సీఎం కార్యాలయం ప్రారంభించాలంటే అధికారులు అక్కడ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకే అసెంబ్లీ ముగిసిన తర్వాత ఏప్రిల్ మొదటివారంలో విశాఖకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు సీఎం జగన్‌. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కూడా విశాఖ రాజధాని అంశాన్ని ప్రస్తావించారు సీఎం. త్వరలోనే తాను విశాఖ నుంచి పాలన చేస్తానని చెప్పారు. దీనికి తగ్గట్లుగానే సీఎం క్యాంపు కార్యాలయం కోసం విశాఖలో ఇప్పటికే పోర్ట్ గెస్ట్ హౌస్‌ని సిద్ధం చేస్తున్నారు.

సోమ, మంగళ వారాల్లో విశాఖ నుంచి సీఎం పాలన సాగిస్తారని మొదట్లో చెప్పుకొచ్చారు. బుధవారం పల్లె నిద్ర కార్యక్రమాంలో సీఎం పాల్గొంటారన్నది ముందుగా అనుకున్న షెడ్యూల్. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు విశాఖలో జీ-20 సదస్సు రెండూ నెలాఖరుకు ముగుస్తాయి. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి పాలన ప్రారంభించేలా సీఎం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కార్యాలయంతో పాటు ఆయనకు అనుబంధంగా ఉండే జీఏడీ కూడా విశాఖ తరలివెళ్తుందని సమాచారం.మొత్తంగా ఏప్రిల్ నుంచి విశాఖ రాజధానిగా పాలనకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది జగన్‌ ప్రభుత్వం.

ఇది కూడా చదవండి :

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh