బిగ్ బాస్ 7కి రానా హోస్ట్ చేసే అవకాశం ఉందా?

Rana hosting Bigg Boss7

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 కి రానా హోస్ట్ చేసే అవకాశం ఉందా?

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆసక్తికరమైన రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో విజయవంతంగా ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ షో టీఆర్పీ రేటింగ్స్ రోజురోజుకూ తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ షోకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏ మాత్రంతగ్గలేదు. మంచిదైనా, చెడ్డదైనా షో ఫాలోవర్స్ వెంటనే ఉత్సాహంగా ఉంటారు. ఇండియన్ ఐడల్ సింగర్ రేవంత్ ఈ సీజన్ ట్రోఫీని గెలుచుకోగా, రన్నరప్ శ్రీహాన్ రూ.40 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. విజేత కేవలం రూ.10 లక్షల నగదు బహుమతిని మాత్రమే అందుకున్నాడు, ఇది ఫినాలే ప్రసారం అయినప్పుడు ప్రేక్షకులు మరియు కంటెస్టెంట్లందరికీ షాక్ ఇచ్చింది. ఇక రాబోయే సీజన్ విషయానికి వస్తే గతంలో వరుసగా నాలుగు సీజన్లు, ఓటీటీ ఎక్స్ క్లూజివ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున బిగ్ బాస్ షో నుంచి హోస్ట్ గా తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనికి గల కారణాలు తెలియనప్పటికీ, ఈ షోను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపలేదని

సమాచారం. బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా నందమూరి బాలకృష్ణతో పాటు నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ రియాలిటీ షో రాబోయే తెలుగు సీజన్ గురించి మరో అప్డేట్ వచ్చింది. ప్రతి వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ గురించి లీకులను అరికట్టడంలో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ విఫలమవడంతో ఇప్పుడు వచ్చే సీజన్ కోసం వేదికను మార్చాలని మేకర్స్ డిసైడ్ అవుతున్నారు.

బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ షూటింగ్ హైదరాబాద్ కు దూరంగా ఉన్న పూణేలో జరిగింది. అయితే లాజిస్టిక్ సమస్యల కారణంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ కోసం ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు మేకర్స్. అప్పటి నుంచి అనేక లీకులు వచ్చాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పెద్ద దుమారానికి కారణమవుతుoది. దీనిని  అరికట్టడానికి, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సీజన్ 7 బిగ్ బాస్ తెలుగు ఇంటి కోసం చెన్నైలో సెట్ ను నిర్మించనున్నారు. అయితే ఈ వార్త ఎంత వరకు వాస్తవంమో తెలియాలిసివుంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh