జనసేన పార్టీ కార్యక్రమాలకు గెటప్ మార్చిన పవర్ స్టార్

Power Star changes get-up for Jinasena party programmes

Pawan Kalyan: జనసేన పార్టీ కార్యక్రమాలకు గెటప్ మార్చిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈయన ఆయన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.అటు సినీరంగంలోను ఇటు రాజీకియoలో  జనసేనానిగా సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు గెటప్ మార్చారు. సాధారణంగా జనసేన పార్టీ కార్యక్రమాలకు వైట్ అండ్ వైట్ డ్రెస్‌తో వచ్చే జనసేనాని ఈసారి కథానాయకుడి వేషాదారణలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరుగుతున్న బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.

జనసేన ప్రయాణంలో 10ఏళ్ల ప్రస్థానాన్ని కలిగిన పవన్ కల్యాణ్‌ న్యూ లుక్‌ అందర్ని ఆకట్టుకుంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 27ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆయన ఈ ఆర్మీ గెటప్‌లోనే పార్టీ కార్యక్రమానికి హాజరవడం ప్రత్యేకతను సంతరించుకుంది.ఇప్పుడు ఆ ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల ప్రచార వాహనం వారాహిని డిఫరెంట్‌గా డిజైన్ చేయించి వార్తల్లో నిలిచిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తన ప్రచారం, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డిఫరెంట్ గెటప్‌తో వస్తుండటంపై అటు రాజకీయ, ఇటు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది 27ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు పరిశ్రమకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతుంటే.

ఈయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కోసం ముఖానికి రంగేసుకొని మార్చి  11న కెమెరా ముందుకు వచ్చిన రోజు ఇది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన కెమెరా ముందుకు వచ్చి ఈ రోజుతో 27 యేళ్లు అవుతుంది. ఈ సినిమా అదే సంవత్సరం 11 అక్టోబర్ 1996లో విడుదలైంది. ఈ సినిమాలో సుప్రియా హీరోయిన్‌గా నటించింది. తర్వాత పవన్ కళ్యాణ్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘గోకులంలో సీత’ సినిమా చేసారు. ఈ చిత్రం తమిళంలో హిట్టైన ‘గోకులతై సీతై’ సినిమాకు రీమేక్.  ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది.  పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే నాలుగు రోజుల పాటు గుంటూరు, విజయవాడలో మకాం వేయనున్నారు జనసేన నాయకుడు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh