వైరల్ గా మారిన నాని బర్త్ డే సెలబ్రేషన్స్ కాక్‌టేల్ పార్టీలో ఫోటోలు
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని బర్త్ డే సెలబ్రేషన్స్ ఒక రేంజ్‌లో జరిగాయి. తన వైఫ్ అంజలి, ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ హీరో బర్త్ డే సెలబ్రేషన్స్‌ని చాలా హత్త హాసంగా జరుపుకున్నారు. రో ఫ్యామిలీ ఫ్రెండ్ ఈ కాక్‌టేల్ పార్టీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. హీరో తన బర్త్ డేని ఆయన అర్ధాంగి, ఆమె స్నేహితుల మధ్య జరుపుకున్నాడు. ఇప్పుడు ఈఫోటోలే నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి బర్త్ డే సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు చెబుతూనే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది కిరణ్మయి మడుపు. ఈఫోటోల్లో మన హీరో నాని కూడా నలుగురు ఆడవాళ్లతో కలిసి ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో చిల్ అయ్యాడు.
ఈసందర్భంగా నాని బర్త్ డే సెలబ్రేషన్‌లో కాక్ టేల్ పార్టీ ఫోటోలు షేర్ చేసిన కిరణ్మయి. హీరోకి బర్త్ డే విషెస్ చెప్పింది. అలాగే అద్భుతమైన వ్యక్తి వయసు మరో ఏడాది పెరిగి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అతడ్ని ఒక వైన్ బాటిల్‌లో ఉంచి సెల్లార్‌లో బంధించామని కామెంట్స్ పోస్ట్ చేసింది. అమ్మాయిల మధ్య నాని పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. కొందరు విషెస్ చెబుతుంటే మరికొందరు సినిమా రిలీజ్‌కు ముందే దసరా పండుగ చేసుకుంటున్నావా భయ్యా అంటున్నారు మరి కొందరు. ఈఫోటోల్లో నాని వైఫ్‌తో పాటు మిగిలిన ముగ్గురు ఆడవాళ్లు మోడ్రన్ డ్రెస్సుల్లో తెగ ఎంజాయ్ చేశారు. మందు గ్లాసులు, కూల్ వెదర్‌లో మూన్ లైట్ ఆస్వాదిస్తూ సెల్లార్‌లో పార్టీ చేసుకున్నారు పార్టీ ఒక్కటే కాదు పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ నానిని తెగ ఎంటర్‌టైన్ చేసినట్లుగా ఈఫోటోలు చూస్తుంటే అర్ధమవుతోంది.
హీరో బర్త్ డే పార్టీలో నాని సతీమణి కూడా బాగా ఎంజాయ్ చేసింది. హ్యాపీ బర్త్ డే నాని గారు అంటూ కొందరు, వెరీ గ్రేట్ పార్టీ అంటూ ఇంకొందరు కామెంట్స్ పోస్ట్ చేస్తే మీ పార్టీలో, ఫోటోల్లో మృణాల్ ఠాకూర్ ఉండే బాగుండేదని మరో నెటిజన్ ఆశపడుతూ కామెంట్‌ని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం హీరో నాని ఓ మాస్ క్యారెక్టర్‌లో దసరా సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్షన్‌తో కూడిన తెలంగాణ బ్రాక్ డ్రాప్‌లో వస్తున్న ఈసినిమా ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాయి. సినిమా కూడా హిట్ అవడం ఖాయమని నాని ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు.
ఇది కూడ చదవండి :
- టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
- కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ సుదీర్ఘ సమావేశం