తారక రాముడి కొత్త లుక్ చూశారా.. కిరాక్ ఉందిగా..!

NTR New Look Goes Viral in Social Media Devara Movie

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ఎన్.టి.ఆర్ లుక్ డిక్షన్ అంతా కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా పెద్ద టార్గెట్ తోనే వస్తుందని తెలుస్తుంది. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేశారు.

జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, తారక్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగా పూర్తి అయ్యింది. ఇక లేటెస్ట్ ఆ ఎన్.టి.ఆర్ కొత్త లుక్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. న్యూ స్టైలిష్ లుక్ తో తారక్ అదరగొట్టేశాడు. అది దేవర కోసమా లేదా అన్నది తెలియదు కానీ స్టైలిష్ లుక్ తో తారక రాముడు అదుర్స్ అనిపిస్తున్నాడు.

ఆర్.ఆర్.ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న తారక్ ఇక మీదట తను చేసే సినిమాలతో పాన్ ఇండియాని కాదు పాన్ వరల్డ్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు. దేవరతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్న తారక్ ఆయన అభిమానులు కూడా సినిమాను సెన్సేషనల్ హిట్ చేసేందుకు రెడీగా ఉన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh