బిగ్ బాస్ కోసం తల్లికూతుళ్లు.. క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా..?

BiggBoss Season 7 Surekha Vani and Supritha Lucky Chance

సీరియల్స్ లో నటించి అక్కడ గుర్తింపుతో సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్న నటి సురేఖా వాణి. సీరియల్ డైరెక్టర్ సురేష్ తేజని ప్రేమించి పెళ్లాడిన ఆమెకు సుప్రిత అనే కూతురు ఉంది. సురేష్ తేజ మూడేళ్ల క్రితం మరణించగా సురేష్ వాణి ఒక్కతే తన కూతురు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఈమధ్య సినిమాల్లో కూడా అంతగా కనిపించని సురేఖా వాణి కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

కూతురుతో కలిసి సురేఖా వాణి షేర్ చేస్తున్న ఫోటోలు ఆడియన్స్ కు బాగా రీచ్ అవుతున్నాయి. ఈ సోషల్ మీడియా ఫాలోయింగ్ తోనే సుప్రితను హీరోయిన్ గా చేయాలని చూస్తున్నారు సురేఖా వాణి. అందుకు మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలాఉంటే ఈ తల్లికూతుళ్లు ఇద్దరికి ఉన్న ఫాలోయింగ్ చూసి బిగ్ బాస్ వారు అవకాశం ఇస్తున్నారట.

బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ తల్లికూతుళ్లు ఇద్దరు హౌజ్ మెట్స్ గా వస్తున్నారని టాక్. తమకున్న సోషల్ మీడియా ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకునేందుకు వారికి వచ్చిన ఈ ఆఫర్ కి ఓకే చెప్పారట సురేఖా అండ్ సుప్రిత. బిగ్ బాస్ లాంటి ఫ్లాట్ ఫాం ద్వారా ఈ తల్లికూతుళ్లు ఇద్దరు తమ గ్రాఫ్ మరింత పెంచుకోవాలని చూస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh