19 ఏళ్ల తర్వాత మహేష్ తో ఆమె..!

Actress Sharing Screen with Mahesh after 19 Years

సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కలిసి 11 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రం స్టైల్ లో సినిమా ఉంటున్నా మహేష్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు సినిమాలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కాస్టింగ్ గురించి మొదటి నుంచి కొంత కన్ ఫ్యూజన్ ఉన్న విషయం తెలిసిందే. హీరోయిన్స్ ఒకరు ఎగ్జిట్ అవడం మరొకరు ఎంటర్ అవడం.. ఇలా గుంటూరు కారం మీద వచ్చిన వార్తలు మరే సినిమా మీద రాలేదు.

ఇదిలాఉంటే లేటెస్ట్ గా మహేష్ గుంటూరు కారం సినిమాలో అతనితో 19 ఏళ్ల తర్వాత ఒక నటి స్క్రీన్ షేర్ చేసుకుంటుందని తెలుస్తుంది. మహేష్ నటించిన నాని సినిమాలో నటించిన రమ్యకృష్ణ ఆ తర్వాత ఆయన సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకోలేదు. ఆమెకు తగిన పాత్రలు రాలేదో లేక మరే కారణమో తెలియదు కానీ మహేష్ సినిమాల్లో రమ్యకృష్ణ కనిపించలేదు. అయితే ఆఫ్టర్ 19 ఇయర్స్ మహేష్ గుంటూరు కారం లో రమ్యకృష్ణ నటిస్తున్నారు.

అసలే త్రివిక్రం సినిమాల్లో ఒకప్పటి హీరోయిన్స్ కి మంచి పాత్రలు ఇచ్చి సినిమాలో వారిని హైలెట్ చేస్తాడు. ఈ సినిమాలో అది రమ్యకృష్ణ అయితే మాత్రం సినిమాకు చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అలా ఎందుకు అంటే అంత గొప్ప బాహుబలి సినిమాలో కూడా రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రతో ఒక ఊపు ఒప్పేసింది రమ్యకృష్ణ. సో గుంటూరు కారం లో కరెక్ట్ పాత్ర పడితే మాత్రం రమ్యకృష్ణ తన సత్తా చాటే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక గుంటూరు కారం రిలీజ్ డేట్ పై కూడా మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ 2024 సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేసినా ఆ టైం కి వస్తుందా రాదా అన్న డౌట్ మాత్రం ఉంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh