3వ డాన్ అతనేనా..? గూస్ బంప్స్ న్యూస్..!

Ranveer singh in Don 3 Movie Bollywood

బాలీవుడ్ లో డాన్ సీరీస్ లకు సూపర్ క్రేజ్ ఉందని తెలిసిందే. మొదటి డాన్ సినిమా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేయగా డాన్ 2 లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించారు. ఇప్పుడు డాన్ 3 కి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్స్ లో డాన్ 3 లో నటించేది ఎవరు అన్న ఎగ్జైట్ మెంట్ మొదలైంది. అయితే డాన్ 3 పై జరుగుతున్న ఈ డిస్కషన్స్ కి ఆన్సర్ ఇస్తూ డాన్ 3 హీరో ఎవరన్నది హింట్ ఇచ్చారు మేకర్స్. బాలీవుడ్ సినిమాల్లో డాన్ ప్రాంచైజీలకు సూపర్ డిమాండ్ ఉంది. మొదటి డాన్ సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్ 1978 లో చేశారు.

చంద్ర బరోత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఇక ఆ తర్వాత 28 ఏళ్ల గ్యాప్ తో డాన్ అంటూ షారుఖ్ ఖాన్ సినిమా వచ్చింది. 2006 లో ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో షారుఖ్ సరసన కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా హీరోయిన్స్ గా నటించారు. ఇక ఇప్పుడు ఫర్హాన్ అక్తర్ డాన్ 3 ని తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు.

ఈసారి డాన్ 3 లో రణ్ వీర్ సింగ్ ని హీరోగా ఫిక్స్ చేశారు మేకర్స్. డాన్ ఫ్రాంచైజ్ లో అమితాబ్, షారుఖ్ తర్వాత ఆ లక్కీ ఛాన్స్ అందుకున్నాడు రణ్ వీర్ సింగ్. స్వతహాగా తన టాలెంట్ చూపిస్తూ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న రణ్ వీర్ సింగ్ తన సినిమాలతో బీ టౌన్ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. డాన్ 3 లాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో రణ్ వీర్ సింగ్ నటించడం ఆ సినిమా వల్ల అతనికి అతని వల్ల ఆ సినిమాకు డబుల్ ప్రాఫిట్స్ అని చెప్పొచ్చు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh