Tiger nageswar rao: టైగర్ గర్జన.. గూస్ బంప్స్ టీజర్..!

Raviteja Tiger Nageswara Rao Fast Glimpse

Tiger nageswar rao: టైగర్ గర్జన.. గూస్ బంప్స్ టీజర్..!

 

Tiger nageswar rao : మాస్ మహరాజా రవితేజ హీరోగా నూతన దర్శకుడు వంశీ కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వర రావు. ఈ సినిమా స్టువర్టుపురం దొంగ రాష్ట్ర నేతలను, పోలీసులను గడగడలాడించిన గజ దొంగ నాగేశ్వర రావు కథతో తెరకెక్కుతుంది. రవితేజ టైటిల్ తోల్ పోశిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింస్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో సినిమాపై అంచనాలు పెంచేలా టైగర్ ఎలివేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా రవితేజ మాస్ లుక్ మాస్ రాజా ఫ్యాన్స్ అందరికీ సూపర్ ఫీస్ట్ అందించేలా ఉంది.

టైగర్ నాగేశ్వర రావు సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నరు. ఈ సినిమాలో రవితేజ అదరగొట్టేయడం పక్కా అని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. సినిమాలో మురళి శర్మ, అనుపం ఖేర్ లాంటి నటీనటులు కూడా చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ తో మాస్ రాజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దసరాకి టైగర్ గర్జన ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.

రవితేజ కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న ఈ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో మాస్ రాజా స్టామినా నేషనల్ లెవెల్ లో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. టైగర్ నాగేశ్వర రావు అవుట్ పుట్ మీద కూడా రవితేజ సూపర్ హ్యాపీగా ఉన్నారని తెలుస్తుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh