దసరాకి దిల్ రాజు ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Dil Raju Master Plan Dasara Releases

దసరా వచ్చింది అంటే సినిమాల పండుగ షురూ అయినట్టే. ఈ దసరాకి కూడా తెలుగు తెలుగు స్టార్ సినిమాలు ఒక డబ్బింగ్ సినిమా వస్తున్నాయి. దసరా బరిలో బాలయ్య బాబు భగవంత్ కేసరి వస్తుంది. ఈ సినిమాను అనీల్ రావిపుడి డైరెక్ట్ చేయగా షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్ నిర్మించారు. ఇక ఈ సినిమా తో పాటుగా రవితేజ టైగర్ నాగేశ్వ రావు కూడా దసరాకి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ రెండిటితో పాటుగా కోలీవుడ్ హీరో విజయ్ లియో కూడా దసరా బరిలో దిగుతుంది. విక్రం హిట్ తో కెరీర్ పీక్స్ లో ఉన్న లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న లియో మీద కూడా భారీ హోప్స్ ఉన్నాయి.

అయితే దసరాకి రిలీజ్ అయ్యే ఈ 3 సినిమాల్లో బాలకృష్ణ భగవంత్ కేసరి, విజయ్ లియో రెండు సినిమాల నైజాం రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. లియో టోటల్ ఏపీ, తెలంగాణా సితార కొనేయగా వారి నుంచి నైజాం వరకు దిల్ రాజు తీసుకున్నాడు. భగవంత్ కేసరి నైజాం రైట్స్ కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. సో దసరాకి డబుల్ ధమాకాగా దిల్ రాజు రెండు సినిమాలతో వస్తున్నారు. నిర్మాతగానే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు ప్లాన్స్ ఇలానే ఉంటాయని చెప్పొచ్చు.

నిర్మాతగా ఈమధ్య తన స్ట్రాటజీ మార్చిన దిల్ రాజు ఓ పక్క వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తూనే మరోపక్క లో బడ్జెట్ సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతో దిల్ రాజు మళ్లీ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు. ఈమధ్యనే నిర్మాతల మండలి అధ్యక్షిడిగా ఎన్నికైన దిల్ రాజు నిర్మాతలందరికీ మంచి జరిగేలా కార్యచరణలు చేయాలని చూస్తున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh