డీజే టిల్లు తో బొమ్మరిల్లు 2.. సీన్ అంతా రివర్స్ కదా..!

Tillu 3 : టిల్లూ 3 కథను బయటపెట్టిన సిద్ధూ

అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి అలా విలన్ ఛాన్స్ లు అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుతో తన రేంజ్ ఏంటన్నది చూపించాడు. సైలెంట్ గా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఓ రేంజ్ లో ఖుషి అయ్యేలా చేసింది డీజే టిల్లు. ఈ సినిమా తర్వాత సిద్ధు జొన్నలగడ్డకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దానితో పాటు వరుస అవకాశాలు కూడా వస్తున్నాయి.

డీజే టిల్లు సినిమా సీక్వల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఆ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా డీజే టిల్లు కన్నా ఎక్కువ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అంటున్నారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాను మల్లిక్ రాం డైరెక్ట్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే సిద్ధు జొన్నలగడ్డతో బొమ్మరిల్లు భాస్కర్ ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. భాస్కర్ అనగానే ఆయన తీసిన బొమ్మరిల్లు గుర్తొస్తుంది. ఒకవేళ బొమ్మరిల్లు 2 అని సిద్ధుతో చేస్తే మాత్రం సీన్ అంతా రివర్స్ అవుతుందని చెప్పొచ్చు. బొమ్మరిల్లు 2 సినిమా సిద్ధు జొన్నలగడ్డ చేస్తే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. ఇదే కాదు మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh