Kantara ఎన్టీఆర్ తో కాంతారా హీరో సినిమా.

Kantara ఎన్టీఆర్ తో కాంతారా హీరో సినిమా.

తాజాగా కన్నడనాట తెరకెక్కి అద్భుత విజయం అందుకుని దూసుకెళ్తున్న కాంతారా మూవీ ఇటు తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో సైతం అదరగొడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ సొంతం చేసుకున్న కాంతారా మూవీ ఇంకా బాక్సాఫీస్ వద్ద తన దూకుడుని కొనసాగిస్తూనే ఉంది. డివైన్ బ్లాక్ బస్టర్ అయిన కాంతారా లో హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించారు రిషబ్ శెట్టి. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరాగందూర్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ఈ మూవీ చూసి హీరో ఎన్టీఆర్ తనను ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు హీరో రిషబ్ శెట్టి. కాగా వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా రూపుదిద్దుకోనుంది అనే వార్తలు పలు మీడియా మాధ్యమాల్లో ఇటీవల ప్రచారం అయ్యాయి. అయితే వాటి పై నేడు ఒక ఇంటర్వ్యూ లో భాగంగా క్లారిటీ ఇచ్చారు రిషబ్ శెట్టి. నిజానికి తనకు కూడా ఎన్టీఆర్ వంటి స్టార్ యాక్టర్ తో వర్క్ చేయాలని ఉంటుందని, కానీ ప్రస్తుతానికైతే తనకు అటువంటి ఆలోచన లేదని అన్నారు.

అలానే తాను ఏదైనా స్టోరీ రాసుకున్న తరువాతనే దానికి సరిపోయే నటీనటుల్ని ఎంపిక చేసుకుంటానని, అదే తన అలవాటని ఆయన అన్నారు. మరి రాబోయే రోజుల్లో అయినా ఎన్టీఆర్ తో రిషబ్ మూవీ చేస్తారో లేదో తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

అవుట్ పుట్ అదిరిపోయిందిగా.

టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా పిచ్చ హ్యాపీగా ఉన్న స్టార్ హీరో ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఒక్క నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులే.. అభిమానులు అందరికీ ఉంటారు కానీ బాలయ్యకి మాత్రం భక్తులు ఉంటారు.. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు, టాక్ షో, ఇప్పుడు కొత్తగా బ్రాండ్ అంబాసిడర్.. అందులోనూ ‘అఖండ’ తో కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడం, ఫస్ట్ టైమ్ వంద కోట్ల మార్క్ టచ్ చేయడం, పాండమిక్ తర్వాత తండోపతండాలుగా ప్రేక్షకాభిమాలు వచ్చేలా చేసి, థియేటర్లు జాతరను తలపించేలా చేయడం..

సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్నివ్వడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. ఇప్పటివరకు తెలియక బాలయ్య గురించి మరోలా అనుకున్న వారు కూడా ఇప్పుడాయన వ్యక్తిత్వానికి ఫిదా అవుతున్నారు.. మీకు మీరే సాటి అంటూ సలాం చేస్తున్నారు.. బయట ఫ్యాన్స్, ఆడియన్స్ సంగతే ఇలా ఉంటే.. ఇక ఇండస్ట్రీలోని దర్శకుల్లో కూడా చాలామంది బాలయ్య అభిమానులు ఉన్నారు.. వారిలో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఇప్పుడు నటసింహాన్ని ‘వీర సింహా రెడ్డి’ గా చూపించబోతున్నారు..

బాలయ్య షో లో ‘సమరసింహా రెడ్డి’ సినిమా రిలీజ్ రోజు టికెట్ల కోసం జరిగిన గొడవ కారణంగా ఒక రోజంతా పోలీస్ స్టేషన్‌లో ఉన్నానని చెప్పారు గోపిచంద్.. ఆ మాట చాలదా ఆయన ఎంత పెద్ద బాలయ్య అభిమానో చెప్పడానికి.. తన ఫేవరెట్ యాక్టర్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు బహుశా ఆయన పొందిన ఆనందం, అనుభూతి ఇంకెవరూ పొంది ఉండరు.. ‘‘చిన్నప్పుడు చొక్కాలు చించుకుని ఒక్కసారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయణ్ణి డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో.బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా లైఫ్ టైమ్ అచీవ్‌‌మెంట్ కంటే లైఫ్ టైమ్ రెస్పాన్సిబులిటీగా భావిస్తూ..

జై బాలయ్య’’ అంటూ ‘వీర సింహా రెడ్డి’ ఓపెనింగ్ రోజు గోపిచంద్ చేసిన పోస్టుతో బాలయ్య అభిమానులు సినిమా సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు.. టైటిల్ అనౌన్స్‌మెంట్ రోజు.. ‘‘ఒక బాలయ్య అభిమానిగా సినిమా తీశా.. ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉన్నా కానీ ఇప్పుడు రిలీజ్ చేసినా సినిమా సూపర్ హిట్ అవుతుంది’’ అని కొండారెడ్డి బురుజు సాక్షిగా చెప్పి నందమూరి అభిమానుల అంచనాలను ఆకాశామంత ఎత్తుకి తీసుకెళ్లిపోయారు.

ఆదిపురుష్ తేడా కొట్టేసిందా…ప్రభాస్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనం.

యంగ్‌రెబ‌ల్ స్ట‌ర్ ప్ర‌భాస్‌కు బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత హిట్ లేదు. సాహో అంచ‌నాలు అందుకోలేదు. రాధేశ్యామ్ డిజాస్ట‌ర్‌. బాహుబ‌లి సినిమాతో వ‌చ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కాపాడుకునేందుకు భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తున్నాడే త‌ప్పా స‌రైన క‌థా బ‌లంతో పాటు ఇండియ‌న్ సినిమా అభిమానుల‌ను అల‌రించి త‌న మార్కెట్ స్టాండ‌ప్ చేసుకునే సినిమాలు అయితే చేయ‌ట్లేదు.ఇక రాధేశ్యామ్ రిజ‌ల్ట్ ప్ర‌భాస్‌ను మ‌రీ డిజ‌ప్పాయింట్ చేసింది. ఇక ఇప్పుడు ప్ర‌భాస్ వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు.

ఇందులో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రాజెక్ట్ కే – స్పిరిట్ – స‌లార్ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ముందుగా రిలీజ్‌కు లైన్లో ఉన్న ఆదిపురుష్‌ను వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.అయితే ఆదిపురుష్ ఇప్పుడు సంక్రాంతికి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. సంక్రాంతికి బాల‌య్య‌, చిరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఆదిపురుష్‌ను స‌మ్మ‌ర్‌కు అనుకున్నారు. ఇప్పుడు చూస్తే స‌మ్మ‌ర్‌కు కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వ‌డం సందేహ‌మే అంటున్నారు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌, టీజ‌ర్ వీడియోలు చూస్తే అస‌లు ప్ర‌భాస్ అభిమానుల‌కే ఈ సినిమాపై న‌మ్మ‌కం పోయింది. అందుకే ఈ సినిమాకు ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జ‌ర‌గ‌డం లేదు.స‌లార్‌, ప్రాజెక్ట్ కేపై ఉన్న బ‌జ్ ఆదిపురుష్‌పై అస్స‌లు లేదు. పైగా గ్రాఫిక్స్ అస్స‌లు బాగోలేద‌ని.. హైదరాబాద్ అమీర్‌పేట‌లో యానిమేష‌న్ స్టైల్లో ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ సినిమాను ఇప్పుడు పూర్తిగా మార్చ‌క‌పోతే ప్ర‌భాస్ ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్ ప‌డ‌డంతో పాటు మ‌నోడి ఇమేజ్ కూడా పూర్తిగా పోతుంద‌న్న టాక్ వ‌చ్చేసింది.

ఆదిపురుష్ కూడా ప్లాప్ అయితే ప్ర‌భాస్ మార్కెట్ పూర్తిగా ప‌డిపోతుంది.అందుకే ఇప్పుడు ఆదిపురుష్‌కు చాలా వ‌ర‌కు రీ షూట్లు చేస్తున్నార‌ట‌. ఇంకా చెప్పాలంటే ఆదిపురుష్‌ను ప‌క్క‌న పెట్టేసి స‌లార్‌ను ముందు రిలీజ్ చేయాల‌ని కూడా ప్ర‌భాస్ అనుకుంటున్నాడ‌ట‌. అంటే ప్ర‌భాస్‌కే ఈ సినిమాపై న‌మ్మ‌కం లేద‌ని కూడా టాక్ వస్తోంది. మ‌రి ఆదిపురుష్ ఎప్పుడు వ‌స్తుందో ? ఏంటో చూడాలి.

వాల్తేరు వీరయ్య” లో అవార్డ్ విన్నింగ్ నటుడు.!

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు బాబీ తో చేస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా ఇప్పుడు ఈ చిత్రం నుంచి మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అయితే అందించారు.

ఈ చిత్రంలో ప్రముఖ వెర్సటైల్ నటుడు బాబీ సింహా అయితే నటిస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసారు.సోలొమాన్ సీజర్ గా పరిచయం చేస్తూ తనపై ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని అయితే రిలీజ్ చేశారు. మరి తన బర్త్ డే కానుకగా మేకర్స్ అయితే ఈ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ని అందించారు. మరి మెగాస్టార్ సినిమాలో ఈ అవార్డ్ విన్నింగ్ నటుడు ఎలాంటి పాత్రలో నటిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh