TRS Party ప్రగతి భవన్‌కు చేరుకున్న కూసుకుంట్ల TS:
మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు కూసుకుంట్లకు ఘన స్వాగతం పలికాయి. దీంతో ప్రగతి భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా ఇతర ముఖ్యనేతలను ప్రభాకర్‌రెడ్డి కలిశారు.తన విజయానికి పాటు పడిన నేతలకు కూసుకుంట్ల కృతజ్ఞతలు తెలపనున్నారు.
2.టీఆర్ఎస్ పేరు మార్పుపై బహిరంగ ప్రకటన:-
తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పేరు మార్పుపై బహిరంగ ప్రకటన విడుదలైంది. భారత్ రాష్ట్ర సమితిగా TRS పేరును మారుస్తున్నామని.. ఎవరికైనా దీనిపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా ఈసీకి తెలపాలని TRS ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో టీఆర్ఎస్ పేరు మార్చేందుకు మరో నెల సమయం పట్టనుంది.
3.EWS రిజర్వేషన్లకుసుప్రీంకోర్టు ఆమోదం
ఈడబ్యూఎస్ రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. చీఫ్ జస్టిస్ లలిత్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది సహా నలుగురు రిజర్వేషన్లను సమర్ధించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఈడబ్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరుస్తోంది.. 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. 103వ రాజ్యాంగ సవరణ చేపట్టింది కేంద్రం. అయితే చెల్లుబాటును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఐదుగురు న్యామూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. గత నెలలో తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం ధర్మాసనం ఇవాళ తీర్పు వెలవరించింది.
4.పొలిటికల్ ఎంట్రీపై గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తలకెక్కారు. పులి ఆకలితో ఉంది.. వేటాడే సమయంలో ఆ పులికి కాంగ్రెస్, బీజేపీ అనే హద్దులేవీ ఉండవు.. దానికి వేటాడటం మాత్రమే తెలుసని మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి అన్న మాటలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.. బళ్లారిలోని ఓ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ మాటలన్నారు..ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్నప్పుడు ఓ బాలుడు పులి వేషంలో ఎదురొచ్చి.. తనని చూసి పులి వచ్చిందంటూ అభిమానంతో పిలిచాడని.. ఇప్పుడా పులి వేటాడటానికి సిద్ధమైందన్నారు గాలి జనార్ధాన్ రెడ్డి.తాను రాజకీయాలకు దూరమై పుష్కర కాలం గడిచిందని, ఎంతమంది విమర్శిస్తున్నా అన్నీ మౌనంగా భరిస్తున్నానని, తనకు బెంగళూరులో విలాసంగా జీవించే అవకాశం ఉన్నా.. బళ్లారి ఒక్కటే తనకు ముఖ్యమన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ తాను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
5.నేటితో తెలంగాణలో ముగియననున్న రాహుల్ భారత్ జోడోయాత్ర.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో తెలంగాణలో ముగియనుంది. ఈ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలో అడుగుపెట్టనుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్‌లో సోమవారం సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనుంది. కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ సభ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం కాంగ్రెస్ భారీగా జనసమీకరణ కూడా చేపట్టింది. భారత్ జోడో గర్జన పేరుతో లక్ష మందితో ఈ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.
6.ఢిల్లీలో తెలంగాణ గవర్నర్ తమిళిసై..ఈ రోజ సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
7.ప్రమాదకర వైరస్ తయారీకి పాక్, చైనా కుట్ర?
చైనాలో పుట్టి ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టైంలో ఆ దేశానికి చెందిన మరో వార్త ఆందోళన కలిగిస్తోంది. చైనా మన దాయాది పాకిస్తాన్‌తో కలిసి ఓ ప్రమాదకర వైరస్‌ను సృష్టించి బయోవెపన్ తయారీకి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. కరోనా లీక్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వుహాన్ ల్యాబ్ ఆధ్వర్యంలో పాక్ సైన్యం రావల్పిండిలో రహస్యంగా ఈ పరిశోధనలు చేస్తున్నట్లు సమాచారం.
8.స్కూల్లో కత్తి పట్టుకుని తిరిగిన హెడ్ మాస్టర్..ఎందుకంటే?
అస్సాం సిల్చార్ ప్రాంతంలోని ఓ పాఠశాల హెడ్ మాస్టర్ స్కూల్లో కలకలం సృష్టించాడు. కత్తి పట్టుకుని వరండాలో తిరుగుతూ హల్చల్ చేశాడు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరలైంది. ధృతిమేధా దాస్ అనే ఈ వ్యక్తి గత 11 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడని.. స్కూలుకు తోటి టీచర్ల హాజరు సరిగ్గా లేకపోవడంతో వారిని హెచ్చరించేందుకు ఇలా కత్తి పట్టుకుని తిరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
9.అన్ని ఫార్మెట్ల నుంచి క్రికెటర్ సస్పెండ్
ఆస్ట్రేలియాలో యువతిపై అత్యాచారం కేసులో అరెస్టైన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకకు అక్కడి స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించింది. గుణతిలక తరఫున ఆయన లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయమూర్తి నిరాకరించగా, పైకోర్టులో దాఖలు చేస్తామని లాయర్ బదులిచ్చారు. అటు గుణతిలకను అన్ని ఫార్మెట్ల క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.