ఖుషి ట్రైలర్.. ఆ సినిమాతో పోలుస్తున్నారే..!

Vijay Devarakonda Samantha Khushi Trailer Like as maniratnam Sakhi

విజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్స్ లో శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఖుషి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేషబ్ అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 1న రిలీజ్ ప్లాన్ చేసిన ఖుషి సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన ఎవరైనా సరే మణిరత్నం చేసిన సఖి సినిమాతో దీన్ని పోల్చి మాట్లాడుకుంటున్నారు.

విప్లవ్, ఆరాధ్య ఇద్దరు ప్రేమించుకుంటారు.. ఆ తర్వాత పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటారు. అయితే లవ్ లో ఉన్నప్పుడు ఉన్న వారి మధ్య కెమిస్ట్రీ ఆఫ్టర్ మ్యారేజ్ అంతగా బాగుండదు. ఇదే కథతో ఖుషి వస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ భార్యా భర్తల మధ్య వచ్చే గొడవలతోనే ఈ సినిమా వస్తుంది.

శివ నిర్వాణ డైరెక్షన్ టాలెంట్ అందరికీ తెలిసిందే. విజయ్, సమంతల జోడీ కూడా బాగానే అనిపిస్తుంది. అయితే వచ్చిన చిక్కల్లా ఈ సినిమాను మణిరత్నం సఖితో పోల్చడమే.. మరి శివ మార్క్ ఎంటర్టైనర్ గా విజయ్, సమంతల జోడీతో వస్తున్న ఖుషి వర్క్ అవుట్ అవుతుందా.. హిట్ కోసం తపిస్తున్న రౌడీ హీరో ఆశ ఫలిస్తుందా.. ట్రైలర్ లో చూపించిన దాని కన్నా సినిమాలో శివ ఇంకేమి చెబుతాడు.. అవి ఆడియన్స్ ని మెప్పిస్తాయా అన్నది సెప్టెంబర్ 1న తెలుస్తుంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh