ఓటీటీ లోకి విజయ్ వారసుడు

varasudu to stream on amazon

 

 ఓటీటీ లోకి  విజయ్ వారసుడు

కోలీవుడ్‌లోసుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా హవాను చూపిస్తోన్నాడు దళపతి విజయ్. అదే సమయంలో దక్షిణాదిలోని అన్ని భాషల్లో ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతోన్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. ఫలితంగా హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా విజయ్ వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే గత సంక్రాంతికి అతడు ‘వారసుడు’  అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీ ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది  దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం ఇచ్చాడు.
అలాగే తెలుగు, తమిళంలో రూపొందిన ‘వారసుడు’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ముందే ప్రకటించినా. కొన్ని కారణాలతో తెలుగులో  వెర్షన్‌ను జనవరి 14న రిలీజ్ చేశారు. తమిళంలో మాదిరిగానే ఇక్కడ కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఇలా ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ. 300 కోట్లుకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి హవాను చూపిస్తోంది. తెలుగులోనూ ఇది బ్లాక్ బస్టర్ మూవీగా  విజయాన్ని సొంతం చేసుకుంది.

పూర్తి స్థాయి కుటుంబ కథతో తెరకెక్కిన ‘వారుసుడు’ హక్కుల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఏర్పడింది. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ విజయ్ సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇక, ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 22వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే నేటి నుంచి ప్రసారం చేస్తున్నారు. అయితే, ముందుగా ప్రకటించినట్లుగా కాకుండా దీన్ని కన్నడంలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. తద్వారా అక్కడి అభిమానులకు కూడా సర్‌ప్రైజ్‌ను ఇచ్చేశారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh