ఏపీలో తాజా సర్వే వల్ల పార్టీలలో మొదలైన కలవరం

ఏపీలో తాజా సర్వే వల్ల పార్టీలలో మొదలైన  కలవరం

ఆంద్ర లో  ఎన్నికల ఇంకా  సంవత్సరం వుండగా అప్పుడే  ఎన్నికలవాతావరణం మొదలైంది. పార్టీలు ముందస్తుగానే ఎన్నికలకు సిద్దామవుతున్నాయి,  అలాగే  నేతల పార్టీ జంపింగ్స్ మొదలయ్యాయి పొత్తుల వ్యవహారం అనధికారికంగా ఖరారవుతున్నాయి. ఇదే సమయంలో పార్టీలు అభ్యర్ధుల ఎంపిక  కోసం కసతర్తు వేగవంతం చేసాయి. సర్వే సంస్థలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దాని పైన సర్వేలు మొదలు పెట్టాయి. టీడీపీ – జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్నా. అధికారంగా ఖరారు  అవ్వలేదు వైసీపీ తిరిగి అధికారం తమదేనని ధీమగా ఉంది. టీడీపీ – జనసన కలిస్తే గెలుపు గ్యారంటీ అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఒక ప్రముఖ సర్వే సంస్థ ఏపీలో తాజా పరిస్థితులపై అధ్యయనం చేసింది. సర్వే నిర్వహించింది  గెలుపు దక్కేదెవరికో అందులో తేల్చింది.

ఏపీలో టీడీపీ- జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తుoది . ఈ రెండు పార్టీలు కలిస్తే అధికారం ఖాయమనే ప్రచారంలో అమరావతి కేంద్రంగా ఓ ప్రముఖ సర్వే సంస్థ తాజాగా ప్రజానాడి తెలుసుకొనే ప్రయత్నం చేసింది. అందులో అనూహ్య అంచనాలను వెల్లడిచింది టీడీపీ – జనసేన పొత్తు ఉంటే ఎన్ని సీట్లు వస్తాయి. వైసీపీకి దక్కే సీట్లెన్నిఅదే విధంగా పొత్తు లేకపోతే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తయనే అంచనాలు బయట పెట్టింది.  సీట్లతో పాటుగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అధికార పార్టీల నేతల వివరాలను బహిర్గతం చేసింది 2019ఎన్నికల నాటికి ఇప్పటికీ పార్లమెంట్ సీట్ల వారీగా ఏ పార్టీ ఏ స్థితిలో ఉందనే విషయాలను సర్వేలో తేల్చింది. మూడు రాజధానుల వివాదం వల్ల మూడు ప్రాంతాల్లో పార్టీల పైన ప్రభావం పడనున్నట్లు తెలిస్తుంది.  ఆ పరిధిలోని సీట్లలో గెలుపు   ఓటములను విశ్లేషించింది.  ఈ సర్వేలో రాయలసీమలో వైసీపీ బలం స్వల్పంగా మినహా ఎక్కడా చెక్కు చెదరలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఈ సర్వేలో టీడీపీ – జనసేన పొత్తు తో ఎన్నికల బరిలో దిగినా పొత్తు లేకపోయినా వైసీపీదే విజయమని సర్వే సంస్థ గణాంకాలతో సహా తేల్చింది. టీడీపీ -జనసేన పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీకి 100 నుంచి 110 స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వే సంస్థ తేల్చింది. టీడీపీ 45 నుంచి 55 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. జనసేన 6 సీట్ల వరకు గెలిచే ఛాన్స్ ఉందని లెక్కలు వెల్లడించింది. ఒక వేళ టీడీపీ – జనసేన పొత్తు లేకుండా వేర్వేరుగా పోటీ చేస్తే అధికార వైసీపీకి 118 స్థానాల నుంచి 130 వరకు గెలిచే అవకాశం ఉందని సర్వేలో తేల్చింది.

అసలు పొత్తు ఉన్నాలేకపోయినా టీడీపీకి దక్కే సీట్లలో పెద్ద తేడా లేదనేది సర్వే సంస్థ వెల్లడించిన అంచనాల్లో స్పష్టం అవుతోంది. పొత్తు లేకుండా బరిలోకి దిగితే టీడీపీకి 39-46 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, జనసేనకు మూడు నుంచి 5 సీట్ల వరకు దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తేల్చింది.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh