ఏప్రిల్ 13 న 71 వేల అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ

pm Narendra modi:ఏప్రిల్ 13 న 71 వేల అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు  ఈ నెల 13న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన ఉద్యోగులకు 71,000 నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ పంపిణీ చేస్తారని, ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

రోజ్గార్ మేళాలో భాగంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రధాని హామీని నెరవేర్చే దిశగా ఇది ఒక ముందడుగు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

రోజ్గార్ మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని, యువతకు వారి సాధికారత, జాతీయ అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్థవంతమైన అవకాశాలను అందిస్తుందని భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇన్స్పెక్టర్ వంటి వివిధ పోస్టుల్లో చేరతారు.

సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, టీచర్, లైబ్రేరియన్, నర్సు, ప్రొబేషనరీ ఆఫీసర్లు, పీఏ, ఎంటీఎస్.

రోజ్‌గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధాని మోదీ యొక్క నిబద్ధత నెరవేర్చే దిశగా ఒక అడుగని పేర్కొన్నారు. రోజ్‌గార్ మేళా మరింత ఉపాధి కల్పనలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని మరియు యువతకు వారి సాధికారత మరియు జాతీయ అభివృద్ధిలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి అర్ధవంతమైన అవకాశాలను అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు.

కర్మయోగి ప్రారంభ్ మాడ్యూల్‌ నుండి కొత్తగా చేరిన అధికారుల పొందిన అనుభవాన్ని కూడా ఈ రోజ్‌గార్ కార్యక్రమంలో పంచుకుంటారని తెలిపారు. కర్మయోగి మాడ్యూల్ అనేది వివిధ ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా నియమితులైన వారందరికీ ఆన్‌లైన్ ఓరియంటేషన్ కోర్సు ద్వారా శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది.

 

Leave a Reply