Nandamuri యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ వాటిపై దృష్టి పెట్టారా?

Nandamuri యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ వాటిపై దృష్టి పెట్టారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో షూటింగ్ లకు దూరంగా ఉండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అప్ డేట్ రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఎన్టీఆర్30 సెట్స్ పైకి వెళ్లక ముందే తారక్ ఒక నేషనల్ బ్రాండ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.త్వరలో ఈ బ్రాండ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

తారక్ ప్రస్తుతం ఈ యాడ్ కు సంబంధించిన షూట్ లో పాల్గొంటున్నారని తారక్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ యాడ్ కోసం తారక్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఈ మధ్య కాలంలో యాడ్స్ కు దూరంగా ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ వాటిపై దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది.ఈ యాడ్ లో తారక్ స్లిమ్ లుక్ లోనే కనిపించనున్నారు.

ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న తారక్ తన రేంజ్ ను పెంచే యాడ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తారక్ యాడ్స్ లో నటించడం ద్వారా ఇతర భాషల ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యే ఛాన్స్ అయితే ఉంది. తారక్ రాబోయే రోజుల్లో మరిన్ని యాడ్స్ లో సైతం నటించే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.తారక్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తుండగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కొత్త ప్రాజెక్ట్ లు తెరకెక్కనున్నాయి. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తారక్ తో సినిమాలను భారీ లెవెల్ లోనే ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంపై ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

 

హమ్మయ్య ముహూర్తం ఖరారు.

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్‌లో కొమరం భీమ్ పాత్రలో ఒదిగిపోయి.. తన నటనతో మైమరిపించారు. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా నెట్‌ఫ్లిక్స్ పుణ్యమా అని.. ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్‌లో గుర్తింపును తెచ్చుకుంటోంది. ఇక అది అలా ఉంటే ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు.ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ఇంకా తన సినిమాను మొదలు పెట్టలేదు. ఎన్టీఆర్ 30 సినిమా స్క్రిప్ట్ ఓ కొలిక్కి వస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా కావడంతో స్క్రిప్ట్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఒక పట్టాన స్క్రిప్ట్ విషయంలో డెసిషన్ తీసుకోవడం లేదు. మామూలుగానే కొరటాల శివ స్క్రిప్ట్ తయారీకి చాలా టైమ్ తీసుకుంటారు. తానే ఒంటరిగా కూర్చుని స్క్రిప్ట్ తయారు చేసుకుంటారు తప్ప మందీ మార్బలం వుండదు. సినిమా మేకింగ్ అంతా కూడా ముందే పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు. అందుకే చాలా టైమ్ పడుతుంది. దీనికి ఈసారి ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా చేయడం అన్న వత్తిడి అదనం. అందుకే అంతా టైమ్ పడుతోంది. టైమ్ తీసుకుంటున్నారు.

ఇప్పటికి జాన్వి కపూర్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసారు. ఇక ఫైనల్ గా అయితే ఫ్యాన్స్ లో ఉన్న అనుమానాలు క్లియర్ చేస్తూ మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ని ఇచ్చారు. దర్శకుడు కొరటాల అలాగే రత్నవేలు మరియు సాబు సిరిల్ లు కలిసి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఈ పనులన్నీ శరవేగంగా కంప్లీట్ అవుతున్నట్టు అయితే తెలిపారు. మొత్తానికి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఓ పెద్ద డౌట్ క్లియర్ అయింది అని చెప్పొచ్చు.ఇక పక్కా షెడ్యూళ్లు వేసుకోవాలి.

అలా వేయాలి అంటే పాన్ ఇండియా సినిమా కోసం ఫిక్స్ చేసిన కాంబినేషన్ ల డేట్ లు అన్నీ కుదరాలి. పైగా వన్స్ స్టార్ట్ అయ్యాక రెండు మూడు రోజులు చేసి ఆపడం లాంటి వ్యవహారాలు కొరటాలకు నప్పవు.అందుకే వీలయినంత లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నారు. అలా చేయడం కోసం అనువైన టైమ్ ను వెదుకుతున్నారని ఫిబ్రవరి నుంచి షూట్ వుంటుందని తెలుస్తోంది. ఈ లోగా ముహుర్తాల లాంటివి వుండొచ్చు.

త‌మ‌న్నా కోరిక బాల‌య్య తీరుస్తారా??

కొన్నిసార్లు హీరోలు, హీరోయిన్లు తమకు వచ్చిన మంచి అవకాశాలను మిస్‌ చేసుకుంటారు. రెమ్యూనరేషన్ కారణంగానో లేదా ఇతర సినిమా షూటింగులతో బిజీగా ఉండటంవల్ల మంచి ఛాన్సులు మిస్ చేసుకుని ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇప్పుడు అలాగే బాధపడుతోందట. మూడున్నర పదుల వయసుకు వచ్చిన తమన్నా ఇప్పటికీ లైవ్ లోనే ఉంది.

ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు తమన్నా మంచి ఆప్షన్ గా మారిపోయింది. విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు తమన్నాకు వరుస‌ పెట్టి అవకాశాలు ఇస్తున్నారు.వెంకటేష్ పక్కన ఇప్పటికే ఎఫ్2 – ఎఫ్3 సినిమాల్లో తమన్నా జోడి కట్టింది. తమన్నా – వెంకీ జోడి ఆన్ స్క్రీన్ రొమన్స్ అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఎప్పటినుంచో తాకు కోరిక ఉందని చెబుతూ వస్తున్న తమన్న సైరా సినిమాలో జోడి కట్టేసింది.

అయితే ఆ సినిమాలో త‌మ‌న్నాది రెండో హీరోయిన్ రోల్‌. ఇక ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళాశంకర్ సినిమాలోని చిరుకు జోడిగా నటిస్తోంది. ఇక యువరత్న నందమూరి బాలకృష్ణ పక్కన నటించే గోల్డెన్ ఛాన్సును తమన్నా గతంలో వదులుకుంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన‌ అఖండ సినిమాలో హీరోయిన్‌గా ముందు తమన్నానే సంప్రదించారు. అయితే అప్పుడు తమన్నా ఇతర సినిమా షూటింగులతో బిజీగా ఉంది. అఖండలో నటించేందుకు ఆమె ఒప్పుకోలేదు. అయితే అఖండ సూపర్ డూపర్ హిట్ అయింది. తమన్నా వదులుకున్న లక్కీ ఛాన్స్ ప్రగ్యా జైస్వాల్ కొట్టేసింది. నిజంగా తమన్నా అఖండ సినిమా చేసి ఉంటే ఆమె క్రేజ్ ఎక్కడో ఉండేది. కచ్చితంగా ఈ ముదురు వయసులో అది తమన్నాకు హెల్ప్ అయ్యి ఉండేది.

సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు సినిమాలో నటించిన నటీనటులు అందరికీ మంచి పేరు రావడంతో… ఇప్పుడు తమన్నా మంచి ఛాన్స్ వదులుకొని తప్పు చేశానని బాధపడుతోందట. మరోసారి బాలయ్యతో ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోకూడదని తమన్నా ఫిక్స్ అయిపోయిందట. ఇక గతంలోనూ తమన్నా సవ్యసాచి – స్పైడర్ – శివ‌మ్‌ సినిమాలలో నటించింది. మ‌రి మ‌ళ్లీ త‌మ‌న్నాకు బాల‌య్య ఛాన్స్ ఇస్తాడో ? లేదో కాల‌మే నిర్ణ‌యిస్తుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh