NTR ఇది ముందే గ్ర‌హించాడా..?

NTR ఇది ముందే గ్ర‌హించాడా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో.. నందమూరి వారసత్వాన్ని పంచుకున్న ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అని చాలా సార్లు నిరూపించుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని నందమూరి బాలకృష్ణ స్వీకరించగా.. ప్రస్తుతం కుర్రాళ్లు, ప్రేక్షకులకు యంగ్ టైగర్ మరో అన్నగారిలా కనిపిస్తున్నారట. అందుకే ఆయన సినిమాలు భారీ విజయాలను సాధిస్తుంటాయి.ఎన్టీఆర్ ఎలా తప్పించుకున్నారంటే..జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు.

అంతేకాకుండా బెస్ట్ యాక్టర్ మేల్ రోల్ ఫర్ ఆస్కార్ నామినేషన్‌లో ఎన్టీఆర్ నిలిచారు. కానీ దీనికి సంబంధించిన వార్తలు వచ్చినా ఆస్కార్ నామినేషన్స్ గురించి ఇప్పటి వరకు సరైన సమాధానం లేకుండా పోయింది.యంగ్ టైగర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించారు. అదేవిధంగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌‌తో ఓ సినిమా కమిట్ అయ్యాడట.. ఆర్ఆర్ఆర్ విజయం సాధించడంతో ఎన్టీఆర్ చాలా ఆనందంగా ఉన్నారు. విజయాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. ఎన్టీఆర్ కథల విషయంలో జాగ్రత్తగా ఉండటం వల్లే విజయాలు ఆయన సొంతం అవుతున్నాయి.అయితే, గతంలో యంగ్ టైగర్ తిరస్కరించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయట.. కథల ఎంపిక విషయంలో ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

సాధారణ కథలను తారక్ ప్రోత్సహించరు. అందులో కంటెంట్ గట్టిగా ఉంటేనే సినిమాకు ఓకే చెబుతారట.. అయితే, గతంలో తారక్ రిజెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. అందులో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీనివాసకళ్యాణం, నా పేరు సూర్య, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మోత్సవం వంటి సినిమాలు ఉన్నాయి. తారక్ కథల పరంగా కాస్త జాగ్రత్తగా ఉండటం వల్లే ఆయన కెరీర్ సాఫీగా సాగుతోందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  అన్ స్టాపబుల్-2 అరాచకం… వేరే లెవెల్…

నటసింహ బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ఆహా అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ షోకి బాలయ్య మాత్రమే న్యాయం చేయగలరు అనిపించింది. తనదైన శైలి చమ్మక్కులు..సెటైర్లు ఆద్యంతం అన్ స్టాపబుల్ ని రక్తి కట్టించాయి. ఓటీటీ వేదికగా సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేయడం ఓటీటీ చరిత్రలోనే ఇదే మొదటి సారి కావడం విశేషం.దానికి బాలయ్య ఇమేజ్ తోడవ్వడంతో ఆహా మైలేజ్ ఒక్కసారిగా పెరిగింది. త్వరలో అన్ స్టాపబుల్ -2 ప్రారంభం కానుంది. దీనిని బాలయ్య నే హోస్ట్ చేస్తున్నారు.

ముందుగా ఈ షోకి గెస్ట్ లుగా ప్రాణ స్నేహితులు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ని తీసుకురావాలనుకున్నారు. వాళ్లిద్దరితో అన్ స్టాపబుల్-2 ని వాళ్లిద్దరితో లాంచ్ చేస్తే నెక్స్ట్ లెవల్లో ఉంటుందని ప్లాన్ చేసారు.ఇంకా సమంత సహా పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ అరవింద్..బాలయ్య అండ్ కో పెద్ద షాక్ ఇచ్చారు. ఏకంగా సీజన్-2 మొదటి ఎపిసోడ్ మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో నే లాంచ్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా అన్ స్టాపబుల్ సెట్ నుంచి చంద్రబాబు..బాలయ్య కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి.

చంద్రబాబుని అల్లు అరవింద్ దగ్గరుండి రిసీవ్ చేసుకోవడం వంటి సన్నివేశాలు అభిమానుల్లో ఆసక్తికరంగా మారాయి. దీంతో బాలయ్య -చంద్రబాబు మధ్య మాటలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎపిసోడ్ మధ్యలో లోకేష్ కూడా ఎంట్రీ ఇస్తారని సమాచారం. అల్లుడితో మామ ఎలా మాట్లాడతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.మొత్తానికి అన్ స్టాపబుల్-2 మొదటి సీజన్ నారా వారి బ్యాచ్ తో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. మరి ఈ ఐడియా ఎవరదన్నది తెలియాలి. బాలయ్యని హోస్ట్ గా లాంచ్ చేయాలన్న ఐడియా మాత్రం అల్లు అరవింద్ దే. బాలయ్యని ఒప్పించడంకోసం నేరుగా అరవింద్ నే రంగంలోకి దిగారు. తాజాగా చంద్రబాబు ఎంట్రీ వెనుక అరవింద్ కీలక పాత్ర పోషించి ఉంటారని మెజార్టీ వర్గం భావిస్తోంది.

ఆదిపురుష్ తో మాకు ఏమి సంబంధం లేదు…

రామాయణ గాథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని ఇప్పుడు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమాతో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా నటించారు. ఎప్పుడో షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషనల్‌ వర్క్‌ను గాంధీ జయంతి రోజున ప్రారంభించారు. రామజన్మభూమిగా ప్రసిద్ధి చెందిన అయోధ్యలో చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. రిలీజ్‌ చేసిన గంటల వ్యవధిలోనే ఈ టీజర్‌ చాలా మందికి రీచ్‌ అయింది. ఇక అప్పటినుంచి దీనిపై మిశ్రమ స్పందన మొదలైంది. ముఖ్యంగా రావణాసురుడి గెటప్‌, హనుమంతుడి గెటప్‌ లపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా తాజాగా స్పందిస్తూ ‘టీజర్‌ చూశాను. అందులో కొన్ని షాట్స్‌ అభ్యంతరకరంగా ఉన్నాయి.

ముఖ్యంగా హనుమంతుడు వేసుకున్న డ్రస్‌ దారుణంగా ఉంది. హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న ఆ సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని దర్శకుడు ఓర రౌత్‌ను హెచ్చరించారు.
రావణుడిగా నటించిన సైఫ్‌ గెటప్‌ పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్‌’ చిత్రంలోని వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ గురించి రకరకాల కామెంట్స్‌ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం తాము పనిచేయలేదనీ ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌ వాలా ఓ ప్రకటన విడుదల చేసింది. చిత్రంలోని సీజీ , ఇతర స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ తాము చేయలేదని స్పష్టం చేసింది.

సినిమాఆ గౌరవంకు రాజమౌళి అర్హుడేనా?

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఒక గొప్ప ఫిల్మ్ మేకర్ అంటూ ఇప్పటికే ఇండియన్ సినీ ప్రేమికులు ఒప్పుకున్నారు. అయన అధ్బుతమైన సినిమాలను క్రియేట్ చేయడంలో ఇండియాలోనే నెంబర్ 1 అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ సమయంలో ఆయన యొక్క గొప్పతనంను విదేశీ గడ్డపై కూడా చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. తాజాగా వరల్డ్స్ బిగ్గెస్ట్ స్క్రీన్ పై స్క్రీనింగ్ అయిన ఈ సినిమా రాజమౌళి స్థాయిని మళ్లీ లోకానికి చాటిచెప్పింది అనడంలో సందేహం లేదు.బియాండ్ ఫెస్ట్ లో భాగంగా లాస్ ఏంజిల్స్ లో జరిగిన సినిమా ప్రదర్శణలో రాజమౌళి పాల్గొన్నారు. సినిమా ఇప్పటికే వరల్డ్ మొత్తం కూడా నెట్ ఫ్లిక్స్ తో పాటు పలు ఓటీటీ ల్లో అందుబాటు లో ఉంది. అయినా కూడా తాజా స్క్రీనింగ్ కోసం పెద్ద ఎత్తున జనాలు హాజరు అయ్యారు. ఒక్క షో తో దాదాపుగా 17 లక్షల వసూళ్లు నమోదు అయ్యాయి.

అంతకు మించి స్క్రీనింగ్ పూర్తి అయిన తర్వాత రాజమౌళికి దక్కిన గౌరవం అద్భుతం.సినిమా పూర్తి అయిన తర్వాత ఆడియన్స్ ను ఉద్దేశించి మాట్లాడేందుకు గాను స్క్రీన్ ముందుకు రాజమౌళి వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు గౌరవం ఇస్తూ.. ఆయన్ని అభినందిస్తూ ప్రతి ఒక్కరు కూడా లేచి నిల్చుని క్లాప్స్ కొట్టారు. ఏ ఒక్క ఇండియన్ దర్శకుడికి కూడా ఇలాంటి ఒక అరుదైన గౌరవం దక్కలేదు అనేది ప్రతి ఒక్కరి మాట.

ఇలాంటి ఘనత దక్కించుకుని కేవలం తెలుుగు సినిమాకు మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాకు గౌరవంను రాజమౌళి సంపాదించి పెట్టాడు.రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లను అల్లూరి మరియు కొమురం భీమ్ పాత్రల్లో చూపించి మెప్పించిన రాజమౌళి ఇలాంటి ఒక అద్భుతం ఆవిష్కరించడం తనకే సాధ్యం అన్నట్లుగా సినిమాను తెరకెక్కించాడు. సినిమాలోని ప్రతి షాట్ కూడా నిజంగానే అద్భుతం అనడంలో సందేహం లేదు. అందుకే ఈ సినిమా క్రియేటర్ అయిన రాజమౌళి విదేశీ గడ్డపై స్టాండింగ్ ఓవేషన్ కి అర్హుడే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh