NTR30 సినిమా ఆలస్యం వెనుక మెగా కుట్ర కోణం ఉందట!

NTR30 సినిమా ఆలస్యం వెనుక మెగా కుట్ర కోణం ఉందట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 వ సినిమా గందరగోళంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ తదుపరి సినిమా పై ప్రభావం పడింది. కొరటాల శివ ఇప్పటికే ఎన్టీఆర్ తో సినిమా మొదలవ్వాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు సినిమా ప్రారంభం అవ్వలేదు.

ఈ ఆలస్యం వెనుక మెగా కాంపౌండ్ కు చెందిన కొందరు ఉన్నారంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో నిజం ఎంత అనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30వ సినిమా ఆలస్యం కి కారణం కొరటాల శివ రెడీ చేసిన స్క్రిప్టు నచ్చకపోవడమే అని దాంట్లో మెగా కాంపౌండ్ కు సంబంధించిన వాళ్ల ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఎన్టీఆర్ సినిమాకు మెగా కాంపౌండ్ కి లింక్ పెట్టి కొందరు చేస్తున్న కామెంట్స్ ఏ మాత్రం సరి కాదు అంటూ వెండి తెర వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఎన్టీఆర్ 30 సినిమా కు సంబంధించి ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది.

ఇప్పటి వరకు సినిమా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయినా కూడా అభిమానులు హీరోయిన్ ఆమె.. సంగీత దర్శకుడు ఇతడు అంటూ రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మరియు రాంచరణ్ మధ్య పోటీ నెలకొంది.ఆ కారణంగానే ఎన్టీఆర్ ఎదగకుండా కొందరు కుట్ర చేసి సినిమా రాకుండా ప్రయత్నిస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు కొందరున్నారు. నందమూరి ఫ్యాన్స్ ఈ విషయం లో ఎక్కువగా ఆలోచిస్తున్నారని.. మెగా కాంపౌండ్ కు చెందిన ఏ ఒక్కరు కూడా ఎన్టీఆర్ సినిమా ఆపేసేందుకు ప్రయత్నించరు అని.. ఆ సినిమా విషయంలో మెగా కాంపౌండ్‌ వారి ఇన్వాల్వ్మెంట్ ఉండదు అంటూ కొందరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

పుష్ప 2 లో అల్లు అర్జున్ పులితో పోరాటం..

అల్లు అర్జున్ పుష్ప రెండో పార్టు షూటింగ్ ఈ నెల చివరి వారం నుండి జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ ముందుగా కొన్ని రోజుల పాటు హైదరాబాద్ లోనే షూటింగ్ చెయ్యాలని ప్లాన్ చేసినట్టుగా కూడా తెలిసింది. అయితే ఈలోపు ఒక బృందం థాయిలాండ్ వెళ్లి అక్కడ ఫారెస్ట్ లో పులితో ఒక పోరాట సన్నివేశం చిత్రీకరించి రానున్నట్టు గా తెలిసింది.

మరి ఈ బృందం లో అల్లు అర్జున్ ఉన్నడా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. అయితే పుష్ప రెండో పార్టు లో ఈ పులితో పోరాట సన్నివేశం హైలైట్ గా వుండబోతోంది అని తాజా సమాచారం. మీకు గుర్తుండే ఉంటుంది, ‘ఆర్ఆర్ఆర్’ లో జూనియర్ ఎన్ఠీఆర్ పులి తో చేసిన పోరాట సన్నివేశం హైలైట్ గా నిలిచింది.

అయితే ఈ పుష్ప లో అంతకన్నా ఇంకా అదిరేటట్టుగా పులితో అల్లు అర్జున్ పోరాట సన్నివేశాలు చిత్రీకరించాలని ఈ ప్రత్యేక బృందాన్ని విదేశాలకు పంపిస్తున్నట్టుగా సమాచారం. వీళ్ళు అక్కడ కొన్ని రోజులు షూటింగ్ చేసి మళ్ళీ ఇండియా వచ్చి, దానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ జత చేసి, అత్యద్భుతంగా ఈ సన్నివేశాన్ని తీసుకురావాలని సుకుమార్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

జక్కన్నపై డాక్యుమెంటరీ రాబోతుందా..?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు యస్‌యస్. రాజమౌళి . ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’ వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తో వరల్డ్ వైడ్‌గా అందరికి చేరువయ్యాడు. శాంతినివాసం అనే సీరియల్‌ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎవరికి అందనంత ఎత్తుకు చేరుకున్నాడు. తాజాగా జక్కన్నకు సంబంధించిన ఓ అప్‌డేట్ నేషనల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే..

రాజమౌళిపై డాక్యుమెంటరీ రాబోతుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో అందుకు సంబంధించిన షూటింగ్‌ను మొదలుపెట్టారని సమాచారం. తన షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికి జక్కన్న కూడా ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోనున్నాడని తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీ షూటింగ్ మరి కొన్ని నెలల పాటు కొనసాగబోతుందట. రాజమౌళి ఫిలిం మేకింగ్ స్టైల్, ఘనతలను ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. రివర్‌ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ ఖన్నా ఈ డాక్యుమెంటరీని నిర్మిస్తున్నాడు.

హీరోలతో సంబంధం లేకుండా దర్శకధీరుడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల ఈ డాక్యుమెంటరీ ఘన విజయం సాధిస్తుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. రాజమౌళి చివరగా ‘ఆర్ఆర్ఆర్’ కు దర్శకత్వం వహించాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. వరల్డ్‌వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీకి విదేశీ ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. అందువల్ల ఈ చిత్రం జనరల్ కేటగీరీలో ఆస్కార్ బరిలోకి దిగింది. రాజమౌళి తన తర్వాతి సినిమాను మహేశ్ బాబుతో తెరకెక్కించనున్నాడు. తన కెరీర్‌లోనే అత్యంత పెద్ద ప్రాజెక్టు ఇదేనని తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో జక్కన్న చెప్పాడు.

సినిమాటైటిల్ ఒకే కానీ.. రిలీజ్ డేట్ చెప్పరేంటీ?

అత్యంత భారీ స్థాయిలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న బాలయ్య 107 మూవీ టైటిల్ ని ఈ నెల 21న మేకర్స్ ప్రకటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం రెండు టైటిల్స్ ప్రచారంలో వున్నాయి. రెడ్డిగారు జై బాలయ్య.. ఈ రెండింటిని కూడా బాయ్య రిజెక్ట్ చేశారట.

అయితే 21న మేకర్స్ ఏ టైటిల్ ని ఖరారు చేస్తారా? అని అంతా ఆరా తీస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో కన్నడ స్టార్ దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ మలయాళ నటి హనీ రోజ్ చంద్రిక రవి లాల్ నటిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ చివకరి దశకు చేరిన ఈ మూవీని ముందు డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే బాలయ్య మాత్రం సంక్రాంతి బరిలో ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారని కూడా ప్రచారం మొదలైంది. కానీ మేకర్స్ మాత్రం ఈ మూవీ రిలీజ్ అప్ డేట్ ని మాత్రం చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తుండటం అనుమానాల్ని రేకెత్తిస్తోంది.సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మెగాస్టార్ 154 వ మూవీ రిలీజ్ కాబోతోంది.

బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సంక్రాంతి రిలీజ్ చేస్తున్నామంటూ ఇప్పటికే ప్రకటించేశారు. ఇదే టైమ్ లో బాలకృష్ణ సినిమా కూడా బరిలోకి దిగేతే చూడాలని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోల సినిమాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నేపథ్యంలో తమ సినిమాలని పోటీకి దింపుకునే వీలు లేదు. ఆ కారణంగానే బాలయ్య సినిమా రిలీజ్ డేట్ ని మైత్రీ వారు ప్రకటించడం లేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh