NTR Mother జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి షాలిని గురించి కొత్త న్యూస్ బ‌య‌ట‌కొచ్చిందే.

NTR Mother జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి షాలిని గురించి కొత్త న్యూస్ బ‌య‌ట‌కొచ్చిందే..

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి షాలిని గురించి పెద్ద‌గా వివ‌రాలేం బ‌య‌ట‌కు రావు. ఆమె హ‌రికృష్ణ‌కు రెండో భార్య‌గా మాత్ర‌మే చాలా మందికి తెలుసు. అస‌లు షాలిని హ‌రికృష్ణ జీవితంలోకి ఎలా ? వ‌చ్చింద‌న్న‌ది కాస్త ఆస‌క్తిక‌ర‌మే. తాజాగా షాలిని గురించి క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ కాంతారా సినిమా హీరో, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి చెప్పిన విష‌యంతో ఆమె గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.షాలినిది క‌ర్నాట‌క‌లోని విద్వాంసుల కుటుంబం. ఆమెకు శాస్త్రీయ సంగీతం బాగా వ‌చ్చు.

ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ త‌న కుటుంబంలో ఉన్న మ‌న‌వ‌రాళ్లు, మ‌న‌వ‌ళ్ల‌కు సంగీతం నేర్పించాల‌ని డిసైడ్ అయ్యారు. అలా షాలిని ఎన్టీఆర్ కుటుంబంలోకి పిల్ల‌ల‌కు సంగీతంలో శిక్ష‌ణ ఇవ్వ‌డానికి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌తి రోజు ఆమె డ్యూటీ పూర్త‌య్యాక హ‌రికృష్ణే స్వ‌యంగా ఆమెను కారులో స్వ‌యంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటివ‌ద్ద దిగ‌బెట్టేవారు.ఈ క్ర‌మంలోనే ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌కు దారితీసింది. అలా ఆమె హ‌రికృష్ణ‌కు రెండో భార్య అయ్యింది. ఆమె అంత గొప్పింటి కోడ‌లు అయినా… రెండో భార్య కావ‌డంతో ఎప్పుడూ ప‌రిధిమీరి ప్ర‌వ‌ర్తించ‌లేదు..

హ‌ద్దులు దాట‌లేదు. ఎంతో అణుకువ‌తో, సౌమ్యంగా ఉంది. ఈ దంప‌తుల‌కే జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టాడు. ఇక షాలిని ఎప్పుడో కాని బ‌య‌ట క‌న‌ప‌డ‌రు. ఆమె త‌న కొడుకు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తోనే క‌లిసి ఉంటోంది.ఆమె గురించి కాంతారా సినిమా ద‌ర్శ‌కుడు రిషిబ్ శెట్టి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యాన్ని తాజాగా బ‌య‌ట పెట్టారు. ఆమె క‌ర్నాక‌ట‌లోని బృందాపూర్‌కు చెందిన వార‌ట‌. తెలుగులో త‌న ఫేవ‌రెట్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ అని చెప్పిన రిషిబ్‌.. వారి త‌ల్లి షాలిని గారు త‌మ ప్రాంత‌మైన బృందాపూర్‌కు చెందిన వారే అని తెలిపారు.

 

నటసింహం రూట్ మారిందిగా.

నందమూరి బాలకృష్ణ స్పీడు పెంచారు. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమా ఫైనల్‌ స్టేజ్‌లో ఉంది. సూపర్ హిట్ ఓటీటీ షోకు సీక్వెల్‌ రెడీ అవుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో పాటు మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెడుతున్నారు నందమూరి నటసింహం. అది కూడా జెట్‌ స్పీడుతో ఫినిష్ చేసేలా పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్నారు.

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కి చేరుకుంది. మరికొన్ని కీ సీన్స్‌ కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేస్తారు. ఈ లోగా ఆహా కోసం రియాలిటీ షో షూటింగ్ కూడా ప్యారలల్‌గా కంటిన్యూ చేస్తున్నారు.107వ సినిమా రిలీజ్‌ కాకముందే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు ఆ సినిమాను ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన అనిల్‌ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో స్పీడు పెంచారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌లో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ రెడీ చేశారు. అంటే బాలయ్య 108వ సినిమా నెక్ట్స్ ఇయర్‌ సమ్మర్‌కు రిలీజ్ కావటం పక్కా అనమాట. ఇక అటు అన్‌స్టాపబుల్ అంటూ ఆహాలో సెకండ్ సీజన్ షురూ చేశారు. ఫస్ట్ సీజన్‌ ఎంతటి బ్లాక్ బాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఇక తాజా సీజన్ కూడా దుమ్ము లేపేలాగే ఉంది. బాబు గారు, లోకేశ్ ఫస్ట్ ఎపిసోడ్‌కు హైప్ పెంచేశారు. నిజంగా చెప్పాలంటే.. బాలయ్య తన లైఫ్‌లో బెస్ట్ ఫేజ్ ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ కి మారుతి ఊహించని ట్రీట్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పైథాలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతికి వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతోంది. ఇక ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘సలార్’ నాగ్ అశిన్ డైరెక్ట్ చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నాయి. అయితే ఈ మూవీస్ అండర్ ప్రొడక్షన్ లో వుండగానే ప్రభాస్ మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఓ హీరర్ థ్రిల్లర్ ని ప్రభాస్ చేయడానికి రెడీ అవుతున్నారు. మారుతి ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ తనతో సినిమా వద్దని వారిస్తున్నా ప్రభాస్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ భారీ పాన్ ఇండియా మూవీని టి. జి. విశ్వప్రసాద్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది.సోమవారం పూజా కార్యక్రమాలతో సైలెంట్ గా ఈ మూవీని టీమ్ ప్రారంభించబోతోంది.

ఇదిలా వుంటే ఈ ప్రాజెక్ట్ విషయంలో కంగారు పడుతున్న ప్రభాస్ అభిమానులకు ఈ మూవీతో దర్శకుడు మారుతి ఊహించని ట్రీట్ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత వరకు ప్రభాస్ డ్యుయెల్ రోల్ లో కనిపించని విషయం తెలిసిందే. అయితే మారుతి తన సినిమాలో ప్రభాస్ కోసం టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేశాడట.ఈ హారర్ థ్రిల్లర్ స్టోరీలో ప్రభాస్ తొలిసారి తాతగా మనవడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ అభిమానులకు ఊహించని ట్రీట్ గా ఈ మూవీ వుండే అవకాశం వుందని చెబుతున్నారు.

ఇప్పటికే ఈ క్యారెక్టర్స్ కోసం ప్రభాస్ పై లుక్ టెస్ట్ ని నిర్వహించినట్టుగా తెలుస్తోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్నీ మూవీ రెగ్యులర్ షూటింగ్ వారం పాటు సాగనున్నట్టుగా తెలుస్తోంది.ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు క్రేజీ హీరోయిన్ లు నటించబోతున్నారు. ఇప్పటికే ఇద్దరిని మారుతి ఫైనల్ చేశాడు కూడా. అందులో మాలవికా మోహనన్ ఒకరు కాగా మరొకరు నిధి అగర్వాల్ ఒకరు. మరో క్రేజీ లేడీని ఎంపిక చేయాల్సి వుంది. ఫస్ట్ షెడ్యూల్ తరువాత అయినా మూడవ హీరోయిన్ ని ఫైనల్ చేస్తారేమో చూడాలి.

అబ్బా ఎమున్నాడే! మహేష్ బాబు పై సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ లో సాయిపల్లవి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పిట్టి చిన్నదే అయినా కూత ఘనం అన్న మాదిరి వెలిగిపోతుంది. అమ్మడు పట్టిందల్లా బంగారమే అవుతుంది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా? నటిగా మాత్రం నీరాజనాలు అందుకుంటుంది. టాలీవుడ్ ఆ రకమైరన క్రేజ్ ని దక్కించుకున్న ఏకైక బ్యూటీ పల్లవి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇలా రాణించడం వెనుక వ్యక్తిగతంగా తాను తీసుకుంటోన్న జాగ్రత్తలు సొగసిరిని ఆ స్థాయిలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి.

తనలో యాక్టింగ్స్ స్కిల్స్ తో పాటు..డాన్సింగ్ ట్యాలెంట్ అడిషనల్ క్వాలిఫికేషన్ గా కనిపిస్తుంది. శరీరాన్ని విల్లులా వంచే కష్టపడే తత్వం ఎన్నో సాయి పల్లవికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి.తాజాగా ఈ బ్యూటీ పురుషుల అందం గురించి ఓ హీరో ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాలు చేసే క్రమంలో మీ పక్కన నటించే హీరో గురించి అడుగుతారా? అని ప్రశ్నిస్తే..` ఫలానా హీరోతో కలిసి నటించాలన్న ఆలోచనలు నాకు లేవు. కథ బాగుంటే చేస్తా అని .

స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా చేస్తారా? లాంటి మాటలు తనకి నచ్చవు అని. ఏ సినిమా ఒప్పుకున్నా అందులో హీరో గురించి నేను అడగను. వాళ్ల స్టేటస్ గురించి పట్టించుకోను. నేను నటిని. కథ..అందులో పాత్ర నచ్చితే ఏ సినిమా అయిన చేస్తాను. నటిగా నాకు కొన్ని పరిమితులున్నాయి. దానికి లోబడే పనిచేస్తాను. ఇండస్ర్టీలో ఉన్న హీరోలందరిపై గౌరవం ఉంది.అయితే అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఆయన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని స్పష్టం చేసింది.ఇక

మహేష్ స్ర్కీన్ ప్రజెన్స్ అంటే తనకి ఇష్టం అని మగాళ్లు ఇంత అందంగా ఉంటారా? అని తొలిసారి ఆశ్చర్యపోయిన సందర్భం అంది. అలాగే బాలీవుడ్ లో ఇమ్రాన్ ఖాన్ …వీళ్లిద్దరు బాగా ఇష్టమైన నటులు అని చెప్పుకొచ్చింది. `అలాగే నేను యాక్టింమగ్ నేర్చుకోలేదు. ఇంట్లో ఎలా ఉంటానో..తెరపైనా అలాగే ఉంటాను. సాయి పల్లవి నటన బాగుందని అంటుంటే అమ్మకు అర్ధం అవ్వదు.నువ్వెక్కడ? నటించావని అడగుతుంది. డాన్సు కూడా ఎక్కడా నేర్చుకోలేదు. మాధురీ దీక్షిత్ పాత వీడియోలు చూసి ఆస్టెప్పులను ప్రాక్టీస్ చేసే దాన్ని. అయితే చిన్నప్పుడు భరతనాట్యం క్లాసులకు పంపేవారు. నా ముఖం మీద మొటిమలు చూసి హీరోయిన్ గా పనికొస్తానా? అని నాకే డౌట్ ఉండేది. ఎందుకంటే హీరోయిన్లు అంటే ఎంతో అందంగా ఉంటారు.

నేను అంత అందంగా ఉండను అని నాకు తెలుసు. వాళ్లతో పోల్చితే నేను ఎంత అనుకునే దాన్ని. ఆ డౌట్ తోనే ప్రేమమ్ నుంచి మధ్యలోనే తీసేస్తారా? అని దర్శకుడు పుత్రేన్ ని అడిగేదాన్ని. నాపై నాకు నమ్మకం పెంచడానికి ఆయనెంతో కష్టపడ్డారు. ఆసినిమా రిలీజ్ అయి సక్సెస్ అయిన తర్వాత పరిశ్రమలో నాకు చోటు దక్కిందని సంతోష పడ్డాను అని ఇలా తన మనసులో భావాలను మీడియాతో పంచుకుంది ఈ లేడి పవర్ స్టార్.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh