NTR కొత్త కారుకు ఎన్టీఆర్ పేరు….బ్రాండ్ కే బాబు మన భీం

NTR కొత్త కారుకు ఎన్టీఆర్ పేరు ….బ్రాండ్ కే బాబు మన భీం…

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల అధ్యక్షుడు ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు, స‌ర్‌ప్రైజ్‌ చేసే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. లేటెస్టుగా ట్విట్టర్‌లో ఆయన ఒక పోల్ పెట్టారు. అందులో రెండు పేర్లు ఉన్నాయి. తన కొత్త కారుకు ఒక పేరును సూచించామని అడిగారు. అందులో మెజారిటీ ప్రేక్షకులు ఎన్టీఆర్ పేరుకు ఓటు వేశారు.

అసలు, కారు ఏంటి? ఎన్టీఆర్ పేరు ఏంటి? విషయం ఏంటంటే ..మహీంద్రా కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అందులోనూ స్కార్పియో చాలా మంది ఫేవరెట్ కార్. ఇరవై ఏళ్ళ క్రితం ఈ కారును లాంచ్ చేశారు. ఇప్పుడు స్కార్పియోలో థర్డ్ జనరేషన్ కార్ వచ్చింది. అదే ‘స్కార్పియో ఎన్’. ఈ కారు శుక్రవారం ఆనంద్ మహీంద్రా చేతికి వచ్చింది. తన కారుకు పేరు పెట్టమని ట్విట్టర్‌లో నెటిజన్లను అడిగారు.ఆనంద్ మహీంద్రా కారుకు చాలా మంది చాలా పేర్లు సూచించారు.

అందులో రెండు పేర్లను ఆయన ఫైనలైజ్ చేశారు. ఒకటి… భీమ్! రెండు… బిచ్చు (అంటే తేలు అని అర్థం. స్కార్పియోకి హిందీ మీనింగ్). ఈ రెండు పేర్లలో ఒక పేరును ఫైనల్ చేయమని ట్విట్టర్ పోల్ పెట్టారు. మెజారిటీ ప్రేక్షకులు భీమ్ పేరుకు ఓటు వేశారు. ఆ పేరు ఫైనలైజ్ కావడం జస్ట్ ఫార్మాలిటీ అని చెప్పవచ్చు. పోల్ ఎండ్ అయిన తర్వాత భీమ్ పేరుకు ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.ఇప్పుడు భీమ్ అంటే ప్రేక్షకులకు మాత్రమే కాదు, ప్రజలకూ గుర్తు వచ్చేది యంగ్ టైగర్ ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటన తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు, ఉత్తరాది ప్రజలను సైతం ఆకట్టుకుంది. అందుకు ఉదాహరణ… ఆనంద్ మహీంద్రా కారుకు చాలా మంది భీమ్ పేరును సూచించడం! నందమూరి తారక రామారావు జూనియర్ పేరు మాత్రమే కాదు… సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు కూడా బ్రాండ్ అవుతోంది.

 

ఫ్యాన్స్‌కు బాలయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్..జై బాలయ్య అనేలా.

చాలా కాలం పాటు విజయాలు లేకపోయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆయనకు గత ఏడాది వచ్చిన ‘అఖండ’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ వచ్చింది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ఉత్సాహంతోనే బాలయ్య తన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు.

ఇలా ఇప్పటికే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ‘జై బాలయ్య’ (పరిశీలనలో ఉన్న టైటిల్) అనే సినిమాను చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.గోపీచంద్ – బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచే ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ కంప్లీట్ చేసేసింది. ఈ క్రమంలోనే ఇటీవలే టర్కీలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ రొమాంటిక్ సాంగ్‌ను సైతం షూట్ చేశారు. ఇలా ఇప్పటి వరకూ దాదాపు 80 శాతం పైగా టాకీ పార్టును పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య అభిమానులకు కిక్కిచ్చే ఓ న్యూస్..క్రేజీ కాంబినేషన్ కావడంతో పాటు ఇప్పటికే విడుదలైన టీజర్ వల్ల ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను ఈ వారంలోనే విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన కూడా నేడో, రేపో రాబోతుందని తెలిసింది. ఇది నిజంగా బాలయ్య ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజింగ్ ట్రీటే అని చెప్పాలి.

 

శంకర్‌కు ట్విస్ట్ ఇచ్చిన లీక్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా (RC15) రూపొందుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు… బాలీవుడ్ బ్యూటీ, తెలుగులో ‘భరత్ అనే నేను’, వినయ విధేయ రామ’ చిత్రాలు చేసిన కియారా అడ్వాణీ . మరొకరు. తెలుగమ్మాయి అంజలి . ఇద్దరిలో ఎవరి క్యారెక్టర్ ఏమిటి? అనేది లీక్స్ వల్ల ఆడియన్స్‌కు తెలిసింది. రామ్ చరణ్ చేత ఈ సినిమాలో శంకర్ డ్యూయల్ రోల్ చేయిస్తున్నారు.

అందులో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రోల్ కమల్ హాసన్ ‘భారతీయుడు’లో ఓల్డ్ క్యారెక్టర్‌ను పోలి ఉంటుంది. ఆల్రెడీ సైకిల్ తొక్కే చరణ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు మరికొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. అవి చూస్తే. RC15లో చరణ్ భార్యగా అంజలి నటిస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది.

వాళ్ళిద్దరి ఫ్యామిలీ ఫోటో లీక్ అయ్యింది. అందులో ఓ బాబు కూడా ఉన్నాడు. రామ్ చరణ్, అంజలి జంటగా నటిస్తుండగా. ఆ జంటకు జన్మించిన బాబు యంగ్ రామ్ చరణ్ అన్నమాట.యంగ్ రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ కావడం, ప్రభుత్వ అధికారి అయిన తర్వాత అతను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వంటివి కథగా తెలుస్తోంది. మరో హీరోయిన్ కియారా అడ్వాణీ కూడా ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ఆమెకు, చరణ్‌కు మధ్య రొమాంటిక్ ట్రాక్ మెచ్యూర్డ్‌గా ఉంటుందట.శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, ‘వెన్నెల’ కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై ‘దిల్‌’ రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని రోజులు తాత్కాలికంగా షూటింగులు నిలిపివేయడం, శంకర్ ‘భారతీయుడు 2’ షూటింగ్ కోసం వెళ్లడం వల్ల అనుకున్న విధంగా సినిమా షూటింగ్ జరగడం లేదు. తొలుత ఆర్ట్ డైరెక్టర్స్ మౌనిక, రామకృష్ణ. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్ రవీంద్రర్ సినిమా నుంచి వాకౌట్ చేయడం కూడా షూటింగ్ ఆలస్యం కావడానికి ఓ కారణమని ఓ గుసగుస వినిపిస్తోంది.

మహేష్ తో మహేంద్ర సింగ్ ధోని.

ఇప్పుడు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత మహేష్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తో సినిమా చేస్తున్నారు. ఇలా పాన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు నెక్స్ట్ సినిమాలతో భారీ లైనప్ సెట్ చేసుకున్న మహేష్ రానున్న రోజుల్లో మరింత స్థాయిలోకి వెళ్లనుండడం అందరికీ ఇప్పుడు నుంచే తెలుస్తుంది.

మరి ఇది ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ క్రేజీ బజ్ అయితే తెలుస్తుంది. రీసెంట్ గా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని సినిమాల్లోకి తన ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో దిగనున్నట్టుగా టాక్ బయటకి వచ్చింది. మరి అందులో భాగంగా అయితే ధోని నిర్మాణంలో పలువురు సౌత్ స్టార్ హీరోలతో చేసే యోచన ఉందని. మరి ఇందులో భాగంగా అయితే మన టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉందట.

మరి మన తెలుగు నుంచి మహేష్ కాగా తమిళ్ లో దళపతి విజయ్ అలాగే కన్నడ నుంచి కూడా స్టార్స్ తో అయితే ధోని ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమాలు ఉంటాయట. మరి ఇది గాని నిజం అయితే మహేష్ ధోని మ్యూచువల్ ఫ్యాన్స్ లో సెలెబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పొచ్చు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh