DHONI BCCI బాస్ సౌరవ్ గంగూలీకి చెక్ పెట్టింది ధోనీనే.

DHONI BCCI బాస్ సౌరవ్ గంగూలీకి చెక్ పెట్టింది ధోనీనే.

బీసీసీఐ అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి సౌరవ్ గంగూలీ తప్పుకోవడం ఏమో గానీ.. సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. బీజేపీ రాజకీయాలకు సౌరవ్ గంగూలీ బలయ్యాడని తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తే.. జై షా వెన్నుపోటు పొడిచాడని దాదా ఫ్యాన్స్ వాపోయారు. చేసుకున్న పాపం ఎక్కడికి పోదని, కర్మ సిద్దాంతం అనుభవించాల్సిందేనని కోహ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. టీమ్ సెలెక్షన్‌లో అతి జోక్యం..

బోర్డులో దాదా గిరి సభ్యులకు నచ్చలేదని, దాంతో రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగేందుకు నిరాకరించారని ప్రముఖ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ పేర్కొంది. తాజాగా సౌరవ్ గంగూలీ పదవి తొలగింపు వెనుక ధోనీ హస్తం కూడా ఉందనే ప్రచారం ఊపందుకుంది.చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ద్వారా గంగూలికి ధోనీ చెక్ పెట్టాడనేది ఆ వార్తల సారాంశం. బీసీసీఐకి అధ్యక్షుడిగా పనిచేసిన ఎన్ శ్రీనివాసన్, సౌరవ్ గంగూలీ పనితనం విషయంలో విమర్శలు గుప్పించారట. అతని స్థానంలో రోజర్ బిన్నీని బీసీసీఐ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని బీసీసీఐ సమావేశంలో గట్టిగా వాదించారట.

సీఎస్‌కే బాస్ ఏం చేసినా దాని వెనక మహేంద్ర సింగ్ ధోనీ ప్రమేయం ఉంటుందనేది చాలా మందికి తెలిసిన విషయమే. ధోనీ సూచనలతో సీఎస్‌కే బాస్ గంగూలీకి వ్యతిరేకంగా మాట్లాడడంట.మరి ధోనీకి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై ఎందుకు ఇంత కక్ష? ఎందుకో అనే విషయం అర్థమవడం లేదు.

బీసీసీఐ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గంగూలీ.. ధోనీకి చెక్ పెట్టాడు. టీమ్ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని చెప్పాడు. దాంతో మరో గత్యంతరం లేక ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోనీకి బీసీసీఐ.. కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ దిశగా ప్రయత్నం కూడా చేయలేదు. ఈ విషయంలో బీసీసీఐ‌పై ధోనీ ఫ్యాన్స్ కూడా ఆగ్రహంగా ఉన్నారు.

 

మైదానంలో నెత్తురు కక్కుతూ లక్ష్యం వైపు పరుగెత్తిన హీరో కథ

click here

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh