అల్లు స్టూడియోస్ లో NTR… ఏంటి కథ?
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా తన నెక్స్ట్ చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేయబోతున్న రెండో చిత్రం కాగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా RRR లాంటి భారీ హిట్ తర్వాత రావడం అలాగే ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా కూడా దీనిపై భారీ అంచనాలు సెట్టయ్యాయి.
మరి ఎందుకో కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అభిమానులకి చాలా నిరీక్షణ తప్పడం లేదు. షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉండగా ఇప్పటికీ కూడా అలా హోల్డ్ లోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై మరింత ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. షూటింగ్ కి ఇంకా సమయం ఉండగా మేకర్స్ అయితే రీసెంట్ గా స్టార్ట్ అయినటువంటి అల్లు స్టూడియోస్ లో ఎన్టీఆర్ సినిమా సెట్ వర్క్స్ స్టార్ట్ అయ్యినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి దీనిపై అయితే మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
బాలయ్యతో భయపెట్టే మూవీ? అదిరిందయ్యా.. దానయ్య.
నందమూరి బాలకృష్ణ మొదటిసారి అన్ స్టాపబుల్ అనే టాక్ షో తో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో మొదలు కాబోయే ఈ టాక్ షో రెండవ సీజన్ కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే మరోవైపు నందమూరి బాలకృష్ణ మరో రెండు సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 17వ సినిమా షూటింగ్ ను బాలయ్య పూర్తి చేస్తున్నాడు. అలాగే అనిల్ రావుపూడి దర్శకత్వంలో కూడా మరొక మాస్ కమర్షియల్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఈ రెండు ప్రాజెక్టులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బాలకృష్ణ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. అయితే మరో ప్రాజెక్టు కూడా చర్చలలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక యువ దర్శకుడు చెప్పిన థ్రిల్లింగ్ కథ బాగా నచ్చడంతో మరికొంత డెవలప్ కూడా చేయాలని బాలయ్య బాబు సూచనలు ఇచ్చారట. అతనితో ఇదివరకే బాలయ్య బాబు అన్ స్టాపబుల్ ప్రోమో కూడా చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇటీవల విడుదలైన ప్రోమో ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అ! సినిమాతో దర్శకుడిగా పరిచయమైన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రోమోలను డిజైన్ చేశాడు.
అతను కల్కి అలాగే జాంబిరెడ్డి సినిమాలతో కూడా దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జా తోనే హనుమాన్ అనే ఫ్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవల అన్ స్టాపబుల్ ప్రోమోలను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ బాలయ్య బాబుతో ఏర్పడిన పరిచయంతో తన దగ్గర ఉన్న కథలను కొన్ని చెప్పాడట.ఇక అందులో థ్రిల్లింగ్ గా అనిపించే ఒక కాన్సెప్ట్ బాలయ్యకు బాగా నచ్చిందట. అందులో ఆడియన్స్ భయపెట్టే సన్నివేశాలు కూడా హైలెట్ అవుతాయట. ఇంతవరకు నందమూరి బాలకృష్ణ అలాంటి జానర్ లో సినిమాలు చేయలేదు. అయితే సినిమా కథ నచ్చడంతో బాలయ్య మరికొంత డెవలప్ చేయాలని కూడా దర్శకుడికి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్టు ఓకే అయితే డివివి.దానయ్య నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కూతురితో మహేశ్ సూపర్ ప్లాన్..
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే బడా స్టార్లుగా ఎదిగిపోయి హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేశ్ బాబు ఒకడు. బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన అతడు.. దాదాపు రెండు దశాబ్దాలుగా స్టామినాను చూపిస్తూ దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇక, తాజాగా మహేశ్ బాబు తన కూతురు సితారను సినిమాల్లోకి పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. దీనికి కారణం అతడు కొరటాల శివతో చేసిన ‘భరత్ అనే నేను’ నుంచి వరుసగా ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకోవడమే. ఇలా హ్యాట్రిక్‌ను కూడా అందుకున్న ఈ స్టార్ హీరో.. అలాగే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి తనకు తానే సాటి అనిపించుకున్నాడు.
వరుస విజయాలతో కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు.. త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. ఇదంతా అదిరిపోయేలా వచ్చిందని తెలుస్తోంది.
ఇక, తల్లి ఇందిరా దేవి మరణంతో మహేశ్ బాబు తన సినిమా షూటింగ్‌కు కాస్త విరామం ప్రకటించినట్లు టాక్ వినిపిస్తోంది.సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటికే తన కొడుకు గౌతమ్‌ను చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే ‘సర్కారు వారి పాట’ కోసం తన కూతురు సితార ఘట్టమనేనితో ఓ ప్రమోషనల్ సాంగ్‌ను కూడా చేయించాడు. ఇక, ఇప్పుడు ఈ చిన్నారిని మహేశ్ బాబు ఏకంగా సినిమాల్లోకి తీసుకు రాబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారానే తన కూతురు సితార ఘట్టమనేనిని సినీ రంగానికి పరిచయం చేయబోతున్నాడని తాజాగా తెలిసింది. దీనికోసం ఇప్పటికే ఈ చిన్నారికి యాక్టింగ్, డ్యాన్స్‌లో శిక్షణ కూడా ఇప్పిస్తున్నాడని అంటున్నారు.
ఆమె ఎంట్రీని సర్‌ప్రైజింగ్‌గా ప్లాన్ చేశారని టాక్.
త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఓ పాట పాత్ర హైలైట్ కాబోతుందట. ఆమెను కాపాడేందుకు హీరో ప్రయత్నాలు చేస్తుంటాడట. ఇప్పడీ పాత్రలోనే సితార కనిపించబోతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, మహేశ్ – సితార మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని చోట్ల ఫన్నీగా, కొన్ని చోట్ల ఎమోషనల్‌గా ఉంటాయని సమాచారం.