Rajamouli : ఆస్కార్‌ బరిలోకి దిగుతున్నాం.

ఆస్కార్‌ బరిలోకి దిగుతున్నాం.. ఇక కాసుకోండి..

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఏడాది జరగనున్న ‘ఆస్కార్‌’ బరిలోకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దిగుతున్నట్లు టీమ్‌ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ట్విటర్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద ఎన్నో రికార్డులతో భారతీయ సినిమా సత్తాని తెలియజేసేలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా సినిమా నచ్చి.. గత కొన్ని నెలలుగా మాపై ప్రేమాభిమానాలు కనబరుస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం.

 

 

ఇప్పుడు ఆస్కార్‌ రేసులో పోటీ పడేందుకు జనరల్‌ కేటగిరిలో మేము అప్లై చేశాం. మీ వల్లే మాకు ఇది సాధ్యమైంది. అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అని టీమ్‌ పేర్కొంది.కొంతకాలం క్రితం ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ వెరైటీ.. ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఉండే అవకాశం ఉందంటూ ఓ కథనం ప్రచురించింది. ఆనాటి నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌లోకి వెళ్లనుందని గట్టిగా ప్రచారం సాగింది.

ఈ క్రమంలోనే గుజరాతీ చిత్రం ‘చెల్లో షో’ను భారతదేశం తరఫున ‘ఆస్కార్‌’ నామినేషన్‌కు పంపుతున్నట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ప్రకటించడంతో సినీ ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ తాజాగా చేసిన ప్రకటనతో అందరూ ఆనందిస్తున్నారు.

తారక్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫిక్షనల్‌ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, తారక్‌.. కొమురం భీమ్‌గా మెప్పించారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు.

రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ.1200 కోట్లు వసూళ్లు రాబట్టింది.

NBK108: టార్గెట్ సెట్ చేసిన అనిల్ రావిపూడి.. బాలయ్య ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ :

టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్ని రంగాల్లోనూ సందడి చేస్తూ హవాను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఆయన ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో చాలా ఏళ్ల పాటు సరైన హిట్ లేక ఇబ్బంది పడిన బాలయ్య..

గత ఏడాది వచ్చిన ‘అఖండ’ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు. ఈ ఉత్సాహంతోనే ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాను దాదాపుగా పూర్తి చేసుకున్నారు.

అఖండ’ తర్వాత ఫుల్ స్పీడ్ పెంచేసిన నటసింహా నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో తన 108వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అందుకు అనుగుణంగానే అప్పుడే అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టేశాడు. అంతేకాదు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్కును దర్శకుడు పూర్తి చేసుకున్నాడని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.బాలయ్య – అనిల్ రావిపూడి కలయికలో రాబోతున్న ఈ సినిమాను నవంబర్ నుంచి ప్రారంభించబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం..

ఈ చిత్రాన్ని కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేసేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడట. అంటే నవంబర్‌లో రెగ్యూలర్ షూట్‌ను మొదలు పెడితే.. జనవరి పూర్తయ్యే సమయానికి టాకీ పార్టును కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట.

అంతేకాదు, వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలని కూడా అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ సినిమా విషయంలో మొత్తం అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఏడాది బాలయ్య రెండు సినిమాలతో వస్తారన్న మాట.

క్రేజీ కాంబోలో రాబోయే ఈ సినిమాకు ‘Bro I Don’t Care’ బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను సరికొత్త పంథాలో రూపొందించబోతున్నారట. ఇక, ఇందులో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను చేస్తున్నారని అంటున్నారు. అలాగే, శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుందని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh