పఠాన్ పాటకు కొరియన్స్ డాన్స్ – వైరల్ అవుతున్న వీడియో

Korean Dance Group Shakes Pathaan song

పఠాన్ పాటకు కొరియన్స్ డాన్స్ – వైరల్ అవుతున్న వీడియో

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘పఠాన్’ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి ఇటీవలి కాలంలో బిగ్గెస్ట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అలగే ఈ సినిమానే కాకుండా దాని పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఊరుతలూగించాయి.  చార్ట్ బస్టర్ సాంగ్ నుంచి షారుఖ్ హుక్ స్టెప్పులను అభిమానులు రీక్రియేట్ చేస్తున్న వీడియోలు, రీల్స్ ఇప్పటి వరకు చూశాం. కానీ ఇప్పుడు ఓ కొరియన్ డాన్స్ గ్రూప కూడా ఆ పాటను రీక్రియేట్ చేస్తూ చేసిన వీడియొ ఇప్పడు వైరల్ గా నిలిచింది. షేర్ చేసినప్పటి నుండి, ఈ వీడియో ఇంటర్నెట్లో ట్రెండింగ్లో ఉంది, భారతీయ వినియోగదారులు బాలీవుడ్ పాటలో అద్భుతమైన ప్రదర్శన కోసం ఈ బృందాన్ని ప్రశంసిస్తున్నారు.

ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి షేర్ చేసిన ఈ వీడియోలో ఐదుగురు యువకులు ప్రసిద్ధ ‘ఝూమే జో పఠాన్’ పాటకు డాన్స్ చేస్తూ, షారుఖ్ ఖాన్ మరియు దీపికా పదుకొణె యొక్క హుక్ స్టెప్పుల ఒక రెంజే లో దుమ్ము దులుపుతున్నారు. అయితే ఈ వీడియోను దాదాపు వారం క్రితం షేర్ చేసినప్పటి  ఇన్స్టాగ్రామ్ లో  1 మిలియన్ కు  పైగా వీక్షించారు. ఈ గ్రూప్ ప్రదర్శన నెటిజన్లను, మరి ముఖ్యంగా భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంది, వారు ఈ పోస్ట్ పై  ప్రేమనుచూపుతున్నారు.   ‘మా స్వీట్ కొరియన్ కేపాప్ కు భారత్ నుంచి ఎంతో ప్రేమ’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో యూజర్ “ఓఎంఓ ఒక భారతీయ అభిమానిగా నేను ఇంప్రెస్ అయ్యాను, షాక్ అయ్యాను మరియు సూపర్ హ్యాపీగా ఉన్నాను. వావ్! ఒక భారతీయుడిగా మీ డ్యాన్స్ స్కిల్స్ పట్ల ఎంతో ప్రేమ, మద్దతు లభించడం గర్వంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ఈ ఏడాది జనవరి లోఈ మూవీ విడుదలకు ముందే ఇండోనేషియాకు చెందిన ఓ డాన్స్ గ్రూప్ ఈ పాట మ్యూజిక్ వీడియోను చేసింది. ప్రధాన డ్యాన్సర్లు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలను పోలిన దుస్తులను ధరించారు. డి సాంగ్ సన్నివేశాన్ని సీన్ బై సీన్ గా రీక్రియేట్ చేయడంతో ఇంటర్నెట్ ని ఒక ఊపు ఊపింది.

 

ఇది కూడా చదవండి:

프리미엄 댄스 스튜디오 on Instagram: “씐나~💃🕺 은영 @e._.0120 다현 @xahyyun_l0 재영 @jaeng.e22 소은 @so.j._lee 서율 @yul.s26 🎥 @jangma_2 🇰🇷 @premiumdance_studio”

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh