రానా, సురేష్‌బాబుల పై క్రిమినల్ కేసు

civil case on rana and suresh

హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని  ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు,  ఆయన కుమారుడు రానా స్థలం వివాదం మరో మలుపు తిరిగింది.   ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబుపై క్రిమినల్‌ కేసు నమోదు అయ్యింది. వీరికి సంబంధించి ఓ  భూవివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఫిలింనగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మేందుకు తమ వద్ద డబ్బులు తీసుకొని.. రిజిస్ట్రేషన్ చేయడం లేదని ప్రమోద్‌ కుమార్‌ అనే వ్యాపారి ముందుగా పోలీసులను ఆశ్రయించారు.  ఐతే బంజారహిల్స్ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో నాంపల్లి కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. దానిని కాగ్నిజెన్స్‌గా తీసుకున్న కోర్టు. సురేష్ బాబు, రానా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని జనవరి 19న సమన్లు జారీచేసింది. తుదపరి విచారణను విచారణను మే 1కి వాయిదా వేసింది.

ఈ నేపద్యం లో తాజాగా  అదే వివాదం పై  నాంపల్లి కోర్టు  రాణాకు సురేష్ బాబు మిద క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అసలు విషయానికి వస్తే  దగ్గుబాటి సురేష్ బాబుకి ఫిలింన‌గ‌ర్‌లో 2200 గ‌జాల స్థలం ఉంది. ఈ ల్యాండ్‌ని 2014లో హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి అగ్రిమెంట్ ప్రకారం లీజుకు ఇచ్చారట దగ్గుబాటి ఫ్యామిలీ. ప్ర‌తి రెండు సంవత్సరాలకు ఓసారి లీజు అగ్రిమెంట్‌ను రెన్యూవ‌ల్ చేస్తూ వ‌స్తున్నారట. ప్ర‌స్తుతం ఆ స్థ‌లం ఇంకా లీజు అగ్రిమెంటులోనే కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో,ఆ స్థ‌లంలోని 1000 గ‌జాల‌ను హీరో ద‌గ్గుబాటి రానా పేరు మీద రిజిస్ట్రేష‌న్ చేశారు. లీజు కొన‌సాగుతుండ‌గానే అక్క‌డ వ్యాపారం చేసుకుంటున్న వ్య‌క్తిని ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేశారని గతంలోనే సదరు వ్యాపారి ఫిర్యాదు చేశాడు.

వ్యవహారంపై పలు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అవి తేలకముందే. గత ఏడాది ఆ స్థలాన్ని సురేష్ బాబు. తన కుమారుడు  రానాకు రిజిస్ట్రేషన్‌ చేశారు.  ఈ క్రమంలోనే నవంబరు 1న రానా పేరు చెప్పి కొందరు వ్యక్తులు. ఆ స్థలంలోని సెక్యూరిటీ సిబ్బందిని తరిమివేశారు. ఖాళీ చేయాలని ప్రమోద్‌ను బెదిరించారు. అదే రోజున ప్రమోద్‌ బంజారాహిల్స్‌ పోలీసులతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో. నాంపల్లిలోని 3వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. వారు చర్యలు తీసుకోకపోవడంతో నాంపల్లి కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు.  ఈ నేపద్యంలోనే  రానా, సురేష్‌బాబుకు సమన్లు పంపించింది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh