ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో వైసీపీ ఎంపీ కుమారుడి అరెస్ట్

ED arrests Raghav Magunta

ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్ మాగుంటను డిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. రాఘవ్ మాగుంటను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్న అతన్ని స్థానిక కోర్టులో హాజరుపరచాలని భావిస్తున్నారు, అక్కడ నుండి ఫెడరల్ దర్యాప్తు సంస్థ అతని కస్టడీని కొరనున్నది. కాగా ఈ కేసులో ఈడీకి ఇది ఏకంగా తొమ్మిదో అరెస్టు కాగా, ఈ వారంలో ఇది మూడో అరెస్టు. పంజాబ్కు చెందిన ఎస్ఏడీ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు గౌతమ్ మల్హోత్రా, చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీ డైరెక్టర్ రాజేశ్ జోషిలను ఇప్పటికే అరెస్టు చేసింది.

ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో భాగంగా మద్యం రిటైలర్లు, హోల్సేల్ వ్యాపారులు, తయారీదారులతో ‘సౌత్ గ్రూప్’ అనే కార్టెల్ను సృష్టించారని, అందులో తండ్రీకొడుకులు భాగస్వాములయ్యారని ఈడీ ఆరోపించింది. గత ఏడాది ఒక పార్లమెంటు సభ్యుడికి సంబంధించిన కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించింది ఈడీ. ఇప్పటి వరకు ఈ కేసులో ఈడీ రెండు చార్జిషీట్లును, ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను దాఖలు చేయగా, మనీలాండరింగ్ కేసు సీబీఐ ఎఫ్ఐఆర్ నుంచి ఉద్భవించింది. సీబీఐ, ఈడీ ఫిర్యాదుల్లో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర ఎక్సైజ్ అధికారులను నిందితులుగా చేర్చారు.

తాజాగా ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది కాగా గత ఏడాది ఆగష్టు చివర్లో ఈ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత సిబిఐ ఈ వ్యవహారంపై దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ కేసు దర్యాప్తు లో  పలువురిని ప్రశ్నించే క్రమంలో హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె పేరు కూడా తెరపైకి రావడంతో కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేస్తున్న గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది ఈడీ. ఈ వ్యవహారంతో  గత వారంలో సిబిఐ దాఖలు చేసిన అభియోగాల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జీషీట్లలో పలువురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది.

ఇది కూడా చదవండి:

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh