నాన్నను జాగ్రత్తగా చూసుకోండి – లాలూ కుమార్తె

lalu daughter emotional twitt

గత ఏడాది డిసెంబర్ లో సింగపూర్ లో కిడ్నీ మార్పిడి చేయించుకున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ శనివారం భారత్ కు తిరిగి రానున్నారు. 74 ఏళ్ల లాలూ గత కొంత కాలంగా తీవ్రమైన మూత్రపిండాల సమస్యలతో బాధపడుతుండటంతో వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు. దాంతో 2022 డిసెంబర్ లో సింగపూర్ లో ఓ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయించుకున్నరు లాలూ. తన తండ్రికి కిడ్నీ దానం చేసిన లాలూ కుమార్తె రోహిణి ఆచార్య శనివారం ఆర్జేడీ అధినేత భారత్ కు బయలుదేరుతారని ట్విటర్ లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. దాంతో పాటుగామీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి,  ఈ ముఖ్యమైన విషయం మా నాయకుడు లాలూ గారి ఆరోగ్యానికి సంబంధించినది. ఫిబ్రవరి 11న సింగపూర్ నుంచి ఇండియాకు వస్తున్నారు. కూతురిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. మా నాన్నను ఆరోగ్య వంతుడిగా చేసిన తర్వాత మీ అందరి మధ్యకు పంపుతును, మీరంతా మా నాన్నను జాగ్రత్తగా చూసుకుంటారు’ అని రోహిణి ఆచార్య ట్విటర్ ద్వారా సందేశాన్ని పంపారు.

కాగా గత ఏడాది లాలూ శస్త్రచికిత్స అనంతరం లాలూ కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ట్వీట్ చేస్తూ ‘నా తండ్రి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆయనను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు తరలించారు. దాత అక్క రోహిణి ఆచార్య, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు తన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ ని తండ్రికి ఇచ్చింది. కాగా ఏడాది నవంబర్ లో తేజస్వి యాదవ్ తన సోదరి రోహిణి కిడ్నీ ఉత్తమమైనదని తెలిసింది దాంతో కుటుంబ సభ్యులు కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ ని తండ్రికి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. మా నాన్నకు నా కిడ్నీని దానం చేయాలని డాక్టర్లు భావించారు కానీ నా సోదరి రోహిణి కిడ్నీ ఉత్తమమైనది అని డాక్టర్ లు చెప్పడంతో పాటు రోహిణి కూడా పట్టుబట్టడంతో కుటుంబం మేము ఏకీవబించము, దాంతో శస్త్రచికిత్స కోసం సింగపూర్ ను ఎంచుకున్నట్లు తేజస్వి పాట్నాలో విలేకరులతో అన్నారు. రోహిణి ఆచార్య వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రావు సమరేష్ సింగ్ ను వివాహం చేసుకుని సింగపూర్ లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా లాలూకు శస్త్రచికిత్స అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తేజస్వి యాదవ్తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి: 

Rohini Acharya on Twitter: “आप सबसे एक जरूरी बात कहनी है. यह जरूरी बात हम सबों के नेता आदरणीय लालू जी के स्वास्थ्य को लेकर है. चिकित्सकों ने कहा है कि पापा को इंफेक्शन से बचाना होगा. ज्यादा लोगों से मिलने को लेकर चिकित्सकों ने मना किया है.” / Twitter

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh