NTR 30 పై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా అంటున్న హీరోయిన్

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత వెంటనే మరొక సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా కొరటాల శివ ఒక పవర్ఫుల్ పాన్ ఇండియా కథను కూడా రెడీ చేసుకున్నాడు. కానీ కొరటాల శివ ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకోవడంతో మళ్ళీ ఒక్కసారిగా వారి ఆలోచన విధానం మారిపోయింది.
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏమాత్రం రిస్కు తీసుకోకూడదు అని శివకు ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు.పూర్తిస్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతనే షూటింగ్ మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఇక అందుకు తగ్గట్టుగానే కొరటాల శివ కథలో చాలా వరకు మార్పులు కూడా చేసినట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపించింది. అసలైతే ఈ ప్రాజెక్టు జూలై నెలలోనే మొదలు కావాలి కానీ వివిధ రకాల చర్చల అనంతరం ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ దాదాపు సెలెక్ట్ అయింది అని చాలాసార్లు ఒక టాక్ అయితే వినిపించింది.మొదట ఆలియా భట్ అని ఆ తర్వాత శ్రద్ధా కపూర్ అని ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే అలియా భట్ మొదట ఓకే చెప్పినప్పటికీ మళ్లీ ఆమె వెనుకడుగు వేసింది.
ఇక రష్మిక మందన్న ఫిక్స్ అయినట్లు ఒక టాక్ అయితే గట్టిగా విడిపించింది. ఇక రీసెంట్గా ముంబైలో రష్మిక తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడిగినప్పుడు రష్మిక అప్పుడే మీకు ఎలా తెలిసింది అని ఇంకా అఫీషియల్ గా కూడా చెప్పలేదు అని అన్నారు.కానీ నిజంగానే ఆ ప్రాజెక్టు చేయడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నాను అని కూడా ఆమె ఒక హింట్ అయితే ఇచ్చేసింది. ఇక రష్మిక మందన్న దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతుంది. ఇక రష్మిక నటించిన గుడ్ బై అనే సినిమా హిందీలో శుక్రవారం విడుదల అయింది.అమితాబచ్చన్ అందులో మరొక ముఖ్యమైన పాత్రలో నటించారు.

బాహుబలి 3 వస్తోంది …మాహిష్మతి ఉపిరిపీల్చుకో..

బాహుబలి మూవీ తో తెలుగు సినీ పరిశ్రమ తల ఎత్తుకుని నిలబడింది. అప్పటివరకు టాలీవుడ్ అంటే ఎవరికి తెలియదు కానీ బాహుబలితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా టాలీవుడ్ వైపు చూసింది. టాలీవుడ్ లో ఇంత గొప్ప డైరెక్టర్స్ ఉన్నారా అని ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురైంది. ఇంకా ఈ మూవీలో నటించిన ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా పేరుపొందింది బాహుబలి.
డైరెక్టర్ రాజమౌళి బాహుబలి తో చరిత్ర సృష్టించాడు. కమర్షియల్ ,యాక్షన్ సీన్లతో రాజమౌళి సినిమాను ఓ రేంజ్ కు తీసుకొచ్చాడు.అలాగే మర్యాద రామన్న,ఈగ లాంటి సినిమాలను తీసి తను ఎలాంటి సినిమాలనైనా తీయగలనని నిరూపించుకున్నాడు జక్కన. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ రాజమౌళి చిత్రీకరించిన బాహుబలి ది బిగినింగ్ ఈ జూలై 10వ తేదీతో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పట్లోనే ఈ సినిమా 1000 కోట్లను కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది. ఈ దెబ్బతో డైరెక్టర్ రాజమౌళి మరియు హీరో ప్రభాస్ ప్రపంచం మొత్తానికి పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన బాహుబలి 2 తో వీరి క్రేజ్ ఇంకా పెరిగిపోయింది.బాహుబలి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రతి సన్నివేశం అందరికీ గుర్తుండిపోయేలా చిత్రీకరించాడు రాజమౌళి.
ఈ సినిమాను ఇప్పటికీ ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. అయితే దీనిలో భాగంగా బాహుబలి 3 ఉండబోతుందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే బాహుబలి చిత్రం బృందం మాత్రం ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.కాని కచ్చితంగా బాహుబలి 3 తీసే అవకాశాలు ఉన్నాయని జక్కన్న పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.ఇక బాహుబలి 3 త్వరలోనే పట్టాలెక్కనుంది అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీంతో బాహుబలి 3 వస్తే బాగుండు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

డ్యామేజ్ కంట్రోల్ పనిలో ఆదిపురుష్ టీం…

‘ఆదిపురుష్’ టీజర్‌పై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్, సినిమాలోని పాత్రలపై వచ్చిన వ్యతిరేకత, వీఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు.. వీటన్నింటికీ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క మాటతో సమాధానం చెప్పారు. ఈ సినిమాకు వాడిన టెక్నాలజీని ఇప్పటి వరకు ఇండియాలో ఎవ్వరూ వాడలేదని.. ఫస్ట్ టైమ్ ‘ఆదిపురుష్’కు వాడుతున్నామని ప్రభాస్ స్పష్టం చేశారు. ఈ సినిమా బిగ్ స్క్రీన్ కోసం చేస్తున్నామని చెప్పారు. కొన్ని వారాల్లో బ్యాంగ్ ఆన్ కంటెంట్‌తో మళ్లీ వస్తామని ప్రకటించారు.‘ఆదిపురుష్’ టీజర్‌పై వచ్చిన విమర్శలతో ప్రేక్షకులకు, మీడియాకు స్పష్టతతో కూడిన వివరణ ఇచ్చేందుకు ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ పర్యటనలు చేస్తున్నారు. దసరా రోజు ఢిల్లీ వెళ్లిన వీరిద్దరూ.. గురువారం హైదరాబాద్‌లో అడుగుపెట్టారు.
గచ్చిబౌలిలోని AMB సినిమాస్‌లో పాత్రికేయులకు ‘ఆదిపురుష్’ 3డీ టీజర్‌ను ప్రదర్శించారు. 3డీలో టీజర్ చూసిన జర్నలిస్టులు కరతాళ ధ్వనులతో చిత్ర యూనిట్‌ను అభినందించారు. బిగ్ స్క్రీన్‌లో 3డీలో చూసిన తరవాత వారి అభిప్రాయం మారిపోయింది. రేపు ప్రేక్షకులు కూడా ఇలాగే తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారని చిత్ర యూనిట్ నమ్ముతోంది.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘నేను ఫస్ట్ టైమ్ 3డీలో చూసినప్పుడు చిన్నపిల్లాడిని అయిపోయాను. నాకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. నన్ను నేను తొలిసారి 3డీలో చూసుకోవడం, విజువల్స్, జంతువులు మొహం మీదికి రావడం నాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది.
రేపు ఫ్యాన్స్ కోసం 60 థియేటర్లలో 3డీ టీజర్ వేస్తున్నాం. ఎందుకంటే వాళ్లే మాకు సపోర్ట్. వాళ్లు ఫస్ట్ చూడాలి. వాళ్లు ఏం ఫీలవుతున్నారు అనేది తెలుసుకోవాలి. మీ అందరికీ నచ్చిందని అనుకున్నాం. ఈ టెక్నాలజీ ఇండియాలో ఫస్ట్ టైమ్. ఇలాంటిది ఎప్పుడూ చేయలేదు. ఇది బిగ్ స్క్రీన్ కోసం చేసిన సినిమా. ముఖ్యంగా 3డీ చూడాలి. కాబట్టి అందరూ థియేటర్‌లోనే చూడండి. త్వరలోనే, కొన్ని వారాల్లో ఇంకో బ్యాంగ్ ఆన్ కంటెంట్‌తో మళ్లీ వస్తాం’’ అని చెప్పారు.‘ఆదిపురుష్’ సినిమాను మోషన్ క్యాప్చర్ సహాయంతో ‘కట్టింగ్ ఎడ్జ్’ అనే టెక్నాలజీ వాడి చేస్తున్నారు. ఈ టెక్నాలజీని హాలీవుడ్ యాక్షన్ మూవీస్‌లో వాడతారట. టి-సిరీస్ సంస్థ తొలిసారి ఇండియాకు తీసుకువచ్చింది. మరి, చిత్ర యూనిట్ చెబుతున్నట్టు రేపు బిగ్ స్క్రీన్ మీద ‘ఆదిపురుష్’ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుందో లేదో చూడాలి..

‘అన్‌స్టాపబుల్‌’ సీజన్ 2 – బాలయ్య ఎంత డిమాండ్ చేశారంటే?

ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మొదటి నుంచి సరికొత్త షోలతో ఆడియన్స్ ను అలరిస్తోంది. అన్నిటికంటే ‘అన్ స్టాపబుల్’ షో పెద్ద హిట్ అయింది. తొలిసారి బాలయ్య హోస్ట్ చేసిన షో కావడంతో దీనిపై విపరీతమైన బజ్ వచ్చింది. బాలయ్య లాంటి అగ్ర హీరో మిగిలిన స్టార్స్ ను ఇంటర్వ్యూ చేయడంతో ఈ షోకి భారీ పాపులారిటీ వచ్చింది. ఈ ఒక్క షో చూడడానికే సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఒక్కో సెలబ్రిటీని బాలయ్య హ్యాండిల్ చేసిన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన పంచ్ లు, జోక్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది.
ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంలో రెండో సీజన్‌కు బాలకృష్ణ, ఆహా ఓటీటీ నిర్వాహకులు రెడీ అయ్యారు. రీసెంట్ గానే దీనికి సంబంధించిన టీజర్ ని వదిలారు. ఇదిలా ఉండగా.. ఈ షోకి బాలయ్య ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. మొదటి సీజన్ కి బాలయ్య కేవలం రెండున్నర కోట్లు మాత్రమే తీసుకున్నారని టాక్. అప్పటికి ఆ షో ఇంపాక్ట్ బాలయ్యకు తెలియదు.
అందుకే ఆయన తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే బాలయ్య హోస్ట్ చేయడం వలనే ‘ఆహా’కి సబ్ స్క్రిప్షన్లు 15 లక్షల వరకు పెరిగాయని అంచనా. ఇప్పుడు సీజన్ 2 కోసం బాలయ్య కాస్త భారీ రెమ్యునరేషన్ కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది ఫైనల్ కాలేదు కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. బాలయ్య రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.మరి బాలయ్య అడిగినంత ఇస్తారా..? లేక బేరం సాగిస్తారా..? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎలా లేదన్నా.. బాలయ్యకు ఐదారు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి కూడా సబ్ స్క్రిప్షన్లు బాగా పెరుగుతాయని ఆహా ఆశిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆహా క్రేజ్ కాస్త తగ్గింది. సబ్ స్క్రిప్షన్లు కూడా బాగా తగ్గాయట. ‘అన్‌స్టాపబుల్‌’ సీజన్ 2తో మళ్లీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh