Prabhas ప్రశాంత్ నీల్ వార్నింగ్ వర్కౌట్ అవుతుందా??

ప్రశాంత్ నీల్ వార్నింగ్ వర్కౌట్ అవుతుందా??

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియన్ సినిమాల డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూయడంతో ఈ సినిమాకు షూటింగ్ కు బ్రేక్ పడింది. త్వరలోనే ప్రభాస్ ఆ బాధనుంచి బయటపడి షూటింగ్ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రభాస్ తో తాను చేయబోయే న్యూ మూవీ షూట్లో ఓ కొత్త రూల్ ఒకటి పాస్ చేశారు. ఆ రూల్‌ను ఎవరూ అతిక్రమించినా.. షూట్‌ నుంచి.. బయటికి గెంటేస్తా అంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది.

ఇప్పటికే చాలా కారణాలతో సలార్ షూటింగ్ డిలే అవుతుందని ఫీల్ అవుతున్న ప్రశాంత్‌ నీల్‌కు …. సెట్ నుంచి లీకవుతున్న ఫోటోలు.. వీడియోలు తెగ పరేషాన్ చేస్తున్నాయట. సినిమాపై ఉన్న క్యూరియాసిటీని పోయేలా చేస్తున్నాయట. దీంతో ఇటీవల తన టీం పై సీరియస్ అయిన ప్రశాంత్‌ నీల్.. సెట్‌ నుంచి ఎలాంటి ఫోటోలు.. వీడియోలు బయటికి వెళ్లద్దని వారికి వార్నింగ్ కూడా ఇచ్చారట.అయినా.. ప్రభాస్ కు సంబంధించిన ఓ లేటెస్ట్ పిక్ ఒకటి ఇటీవలే నెట్టింట లీకై.. ట్రెండ్ అవడంతో.. ప్రశాంత్ నీల్ తాజాగా ఓ డెసీషన్ తీసుకున్నారట. సినిమా షూట్‌ కు ఎవరూ సెల్ ఫోన్లు తీసుకురావద్దు అంటూ ఆర్డర్ వేశారట. అంతే కాదు షూట్‌కు ముందు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా.. లేవా అని ఒకటి రెండు సార్లు చెక్ చేయాలని తన పర్సనల్ టీంకు ఆర్డర్ వేశారట. త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. దాంతో ప్రశాంత్ టీమ్ అలర్ట్ అయ్యారు. అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఎలాంటి ఫోటో కానీ వీడియో కానీ బయటకు రాకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

https://youtu.be/UaZgkj7e5x4

మనోజ్‌కి ఎన్టీఆర్ చెప్పే ‘బ్రహ్మ’ కథ..

టాలీవుడ్‌ హీరోలు ఎన్టీఆర్, మనోజ్‌లు ఒకే సంవత్సరం, ఒకే రోజు, కొన్ని గంటల వ్యవధిలో పుట్టిన విషయం తెలిసిందే. ఇక ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా.. ఆ తరువాత మంచి స్నేహితులుగా మారారు. కాగా మనోజ్ చేసే అల్లరి పనుల కారణంగా ఎన్టీఆర్ చాలాసార్లు ఇంట్లో ఇబ్బందులు పడేవారట. ఇదిలా ఉంటే తామిద్దరం ఈ భూమ్మీదకు ఎలా వచ్చారన్న విషయంపై తారక్‌, మనోజ్‌కి ఎప్పుడూ ఓ స్టోరీ చెప్పేవారట.అదేంటంటే.. ఓసారి దీర్ఘంగా ఆలోచించిన బ్రహ్మ, రెండు బొమ్మలను తయారుచేశాడట.

అందులో ఒకటి కొంచెం తెల్లగా, మరొకటి కొంచెం నల్లగా, ఒక బొమ్మకు రింగుల జుత్తు, మరో బొమ్మకు సిల్కీ హెయిర్. ఇలా కొన్ని మార్పులతో ఆలోచనా విధానం మాత్రం ఒకేలా ఉండేలా రెండు బొమ్మలను తయారు చేశాడట. ఇక ఆ రెండు బొమ్మలకు ఓ పరీక్ష పెట్టాడట. అందులో ఓ బొమ్మ ఎలాంటి అల్లరి చేయకుండా వినయంగా ఉందట. దీంతో ఆ బ్రహ్మ దేవుడు, ఈ బొమ్మ చాలా పద్ధతిగా ఉంది కాబట్టి.. దాన్నే ముందు భూమ్మీదకి పంపారట. అది ఎన్టీఆర్‌నట. అయితే అది గమనించిన రెండో బొమ్మ.. మా ఇద్దరిని ఒకేసారి తయారు చేసి, వాడిని ఎందుకు ముందుగా భూమ్మీదకు పంపిస్తారని బ్రహ్మను గట్టిగా గిల్లాడట. దాంతో బ్రహ్మ.. నన్ను ఇంత ఇబ్బంది పెట్టిన ఈ బొమ్మ తప్పుకుండా మోహన్ బాబు ఇంట్లో పుట్టాలని అక్కడ పుట్టించారట. ఆ బొమ్మనే మనోజ్‌నట.

ఈ స్టోరీని ఎప్పుడూ మనోజ్‌కి చెప్పే ఎన్టీఆర్‌.. మనోజ్ పుట్టినప్పటి నుంచే తనకు టార్చర్ ప్రారంభమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘వాడు వస్తున్నాడంటే నాకు ప్రకృతి ముందుగానే హెచ్చరిస్తుంది. నేను మనోజ్ కంటే కొన్ని గంటల ముందు పుట్టాను. అయినా నాకు ఎలాంటి గౌరవం ఇవ్వడు. ఏరా, ఏంట్రా అని పిలుస్తూ ఉంటాడు’ అని మనోజ్ గురించి చెప్పుకొచ్చారు ఎన్టీఆర్‌.

రెట్టింపు ఉత్సహంతో అన్ స్టాపబుల్ సీజన్ 2.. విజయవాడ వేదికగా…

నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ద్వారా ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. తన మాటలతో గెస్ట్ లను ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరించారు బాలయ్య. వంద శాతం తెలుగు ఎంటర్టైన్మెంట్‌తో దూసుకుపోతోన్న ఆహా తెలుగు ఈసారి కూడా ఎవరూ చూడని విధంగా బాలయ్యని అభిమానులకి చూపించింది. ఇక అన్ స్టాపబుల్ మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఐఏండిబి లో టాక్ షో అన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అయ్యారు బాలయ్య.

అందు కోసం మరోసారి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో జతకటింది ఆహ.జాంబీ రెడ్డి, మరియు కల్కి లాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ 2011 లో దీనమ్మ జీవితం అనే షార్ట్ ఫిలిం తో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. అలా మొదలుబెట్టిన తన ప్రయాణం దర్శకత్వం అన్ స్టాపబుల్ సీసన్ 1 వరకు సాగింది. నందమూరి బాలకృష్ణను ఎవరూ చూడనంత గొప్పగా చూపించారు. ఇప్పుడు మరోసారి ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ ను చూపించబోతున్నారు ప్రశాంత్ వర్మ. ఆహా ట్రైలర్ ని అక్టోబర్ 4 విజయవాడ లో అభిమానుల ముందు ప్రదర్శించబోతున్నారు.ఇక అన్ స్టాపబుల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను విజయవాడలో భారీగా ప్లాన్ చేస్తున్నారు. విజయవాడలోని అనామోల్ గార్డెన్స్ లో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఈ వేడుకకు బాలయ్య అభిమానులు భారీగా తరలి రానున్నారు. అలాగే అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ గురించి అప్డేట్ కూడా త్వరలోనే రానుంది.

ఇటీవల దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, “సీజన్ 1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణ గారితో మరోసారి తప్పకుండా పనిచేయాలని చాలా గట్టిగా అనుకున్నాను, అందుకే ఈసారి కూడా అవకాశం నాకే వచ్చింది. ఆహ టీం సీజన్ 2 ట్రైలర్ కోసం స్టోరీ రాయాలి అనగానే, నేను వెంటనే ఒప్పుకున్నాను. బాలయ్య గారితోటి పని చేయడమంటేనే ఒక అద్భుతం. ఈ స్టోరీ అందరికి నచ్చే విధంగా తీర్చిదిద్దుతాను. ఒక విధంగా ఇది నా ముద్దుబిడ్డ అని చెప్పొచ్చు. అక్టోబర్ 4 న మీరు చూసే ట్రైలర్ అందరికి నచ్చుతుందుని ఆశిస్తున్నాను” అన్నారు ప్రశాంత్ వర్మ.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh