ఎంబీబీఎస్‌ సీటు రాదెమోనని ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య

inter student suicide: ఎంబీబీఎస్‌ సీటు రాదెమోనని ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య

తెలంగాణలో మ‌రో ఇంట‌ర్మీడియట్ విద్యార్థి మృతి . తనకు ఎంబీబీఎస్‌ సీటు రాదెమోనని అనిపిస్తుంది’అని సూసైడ్‌ నోట్‌ రాసిన ఓ ఇంటర్‌ విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం పీక్లాతండాజీపీ శివారు బోడగుట్టతండాలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం..తండాకు చెందిన గుగులోతు లచ్చు, జ్యోతి దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులున్నారు.

పెద్దకుమారుడు కృష్ణ(19) ఏటూరునాగారంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ కాలేజీలో ఇంటరీ్మడియట్‌(బైపీసీ) చదివి, ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. ఎంబీబీఎస్‌ సీటు సాధించాలనే లక్ష్యం ఉన్న కృష్ణ, ఇంట్లో గోడలపై ఎంబీబీఎస్‌ నా డ్రిమ్‌ అంటూ రాసుకున్నాడు. ఈ మేరకు నీట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఈక్రమంలో తల్లి పంటచేను వద్దకు వెళ్లగా, తండ్రి కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి అమ్మేందుకు వెళ్లాడు. తమ్ముడు ప్రభాకర్‌ పదవ తరగతి పరీక్ష రాసేందుకు కల్వల మోడల్‌ స్కూల్‌కి వెళ్లాడు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న కృష్ణ, తనకు ఎంబీబీఎస్‌ తన డ్రీమ్ నెరవేరదేని మసస్తాపం చెందాడు సీటు రాదెమోనని మనస్తాపం చెంది, తన డ్రీమ్ నెరవేరదేని మసస్తాపం చెందాడు. ఇక తాను బ్రతికుండి లాభం లేదని నిర్ణయానికి వచ్చాడు ఐయామ్‌ సారీ మమ్మి, డాడీ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తాత ఇంట్లోకి వచ్చి చూడగా ఉరివేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని, కొడుకు మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా విద్యార్థులను మానసికంగా పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్న భావన వ్యక్తం అవుతుంది. ఏదేమైనా విద్యార్థులు పరీక్ష రాయలేదనో, అమ్మ తిట్టిందనో, పరీక్ష తప్పుతామనో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడడం మంచిది కాదని చెబుతున్నారు మానసిక నిపుణులు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకుంటే ఇబ్బందులు రావని, ఒకవేళ వచ్చినా వాటిని సమర్ధంగా ఎదుర్కోగలుగుతారని చెప్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh