ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు

EPI CM:ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి,  టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో అప్పట్లో కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవారు. ఒక ముసలాయన మీ అందరికి గుర్తు ఉండేఉంటుంది. అప్పట్లో ఈ పథకాలు ఉండేవా? ఈ డీబీటీ పథకాలు ఉండేవా? ఆ రోజు ఉన్నది దోచుకో.. పంచుకో.. తినుకో డీపీటీ అక్కచెల్లెమ్మలు దీనిపై ఆలోచన చేయాలని జగన్ పిలుపు ఇచ్చారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు ఐదేళ్ల పాలనలో డీబీటీ ద్వారా మీ ఖాతాల్లో ఎంత డబ్బు వేశారో గుర్తుకు తెచ్చుకోండి అన్నారు. అదే మీ బిడ్డ ప్రభుత్వం లో మీ ఖాతాల్లోకి ఎంత ఇచ్చామో గుర్తుకు తెచ్చుకోండి. రైతు భరోసా, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, ఇలా ఇన్ని పథకాల ద్వారా నేరుగా మీ ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతున్నాయో లేదో ఆలోచన చేయండి. గత ప్రభుత్వానికి ఇప్పటికే తేడా గమనించండి అని కోరారు. మరీ అదే ఆ ముసలాయన హయాంలో ఒక్క రూపాయి అయినా కూడా మీ ఖాతాల్లోకి వేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను అని జగన్ ప్రశ్నించారు.

నాలుగు ఫేక్‌ ఫోటోలు దిగుతారని కట్టకుండా వదిలేసిన ఆ టిడ్కో ఇళ్ల దగ్గరకు వెళ్లి సెల్ఫీలు దిగుతారు అంటే ఎద్దేవ చేశారు. మీ బిడ్డ హయాంలో పూర్తిగా కట్టి వేగంగా నిర్మిస్తున్నామని. ఆ ఇళ్ల దగ్గరకు వెళ్లి ముసలాయన ఫోటోలో దిగుతారు అయ్యా బాబు సెల్ఫీ చాలెంజ్‌ అంటే నాలుగు ఫేక్‌ ఫోటోలు కాదు ఈ రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రతి మైనారిటీ, ప్రతి పేద ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి తమ ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చెప్పగలిగితే అది మన ప్రభుత్వం వల్లే జరిగిందని అక్కచెల్లెమ్మలు చిరునవ్వుతో ఆశీర్వదించగలిగితే దాన్ని గొప్ప సెల్ఫీ అంటారన్నారు జగన్.

ప్రతి పేదవాడు కూడా వాళ్ల ఇంటి దగ్గర సెల్ఫీ దిగితే దాన్ని గొప్ప సెల్ఫీ అంటారన్నారు. ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా, ఏ గ్రామాన్ని తీసుకున్నా, ఏ జిల్లాను తీసుకున్నా గత ప్రభుత్వంలో ఇంటింటికి జరిగిన మంచి ఎంత? అదే మన ప్రభుత్వంలో జరిగిన మంచి ఎంత? అని పోల్చుకునే సత్తా మీకు ఉందా బాబూ అని చాలెంజ్‌ చేస్తున్నాను అన్నారు. ఈ నిజాలు ప్రజలకు తెలుసు ఈ నిజాలు ఇంటింటా తెలుసు. మనిషి మనిషీకి తెలుసు  కాబట్టే నిజాలు దాచి నిందలు, అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు దుష్ట చతుష్టయం ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని ఇంటికి తెప్పిస్తానని మోసం చేశారనివ.. ఇలాంటిమోసం చేసిన చంద్రబాబును నిలదీస్తూ అడగండి పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మలు ఈ మోసాల బాబును ప్రశ్నించండి అని జగన్ కోరారు.

అలాగే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని పచ్చి మోసం చేశారని సున్నా వడ్డీ పథకాన్ని ఎగ్గొట్టారని ఇలాంటి మోసాలు చేసిన చంద్రబాబును ప్రజలంతా నిలదీయాలి అన్నారు. అడగండి మా ఇంటి వద్దకు వచ్చి మాతో సెల్ఫీ దిగే నైతికత, మా ఇంటికి స్టిక్కర్‌ అంటించే అర్హత ఉందా అని ప్రశ్నించండి అని కోరారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నా కాపు, ఈబీసీ అక్కచెల్లెమ్మలు అందరూ కూడా అడగండి.

మా జగనన్న ప్రభుత్వం ఇచ్చినట్లు వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇంకా అనేక పథకాలు మా జగనన్న ఇచ్చారు. ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు మీ పాలనలో ఎక్కడికి పోయాయని గట్టిగా చంద్రబాబును ప్రశ్నించండి అన్నారు.  పింఛన్‌ తీసుకుంటున్న అవ్వలు, వితంతవు పింఛన్‌ తీసుకుంటున్న నా అక్కచెల్లెమ్మలు, దివ్యాంగ సోదర, సోదరిమణులు గట్టిగా అడగండి.

కానీ ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు హయాంలో ముష్టి వేసినట్లు ,1000 ఇచ్చారు. మా బిడ్డ ముఖ్యమంత్రి కాగానే పింఛన్‌ 2,250 ఇచ్చాడు ఇప్పటికే 2,750 ఇస్తున్నాడు. 3 వేలు కాబోతుందని చంద్రబాబును అడగి సెల్ఫీ చాలెంజ్ చేయండి అన్నారు. అయ్యా చంద్రబాబు ఇంత మంచి చేస్తున్న మా బిడ్డ వైయస్‌ జగన్‌తో కాకుండా మీతో సెల్ఫీ ఎలా దిగుతాం. మీకు ఆ అర్హత ఉందా అని ప్రశ్నించండి అంటూ చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh