కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ద పెట్టిన మోడి సర్కార్

Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ద పెట్టిన మోడి సర్కార్

కర్ణాటక లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి తారస్థాయిలో ఉంది. ప్రచారాలు, హామీలు, మాటల యుద్ధాలతో అక్కడి వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి వచ్చే నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. అయితే  మే 13న ఫలితాలను వెల్లడిస్తారు. ఈ 224లో కొన్ని నియోజకవర్గాలు హాట్​టాపిక్​గా మారాయి. ఈ సీట్లల్లో మళ్లీ గెలివాలని సిట్టింగ్​ ఎమ్మెల్యేలు భావిస్తుంటే వారి నుంచి కీలకమైన నియజకవర్గాలను లాగేసుకోవాలని ఇంకొందరు ప్రణాళికలు రచిస్తున్నారు.

కేంద్రంలో వరుసగా మూడవ సారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీఅంతకు ముందు సెమీ ఫైనల్ అన్నట్లుగా జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తోంది.

అయితే ఎన్నికలలో జాతీయ నాయకత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు బెంగళూరు లో ల్యాండ్ అవుతున్నారు. గతంతో పోల్చితే బీజేపీ ముఖ్య నాయకులు ఈసారి ఎక్కువగా ప్రచారానికి హాజరు అవుతున్నారు.ముందు ముందు బీజేపీ తమ పార్టీ ముఖ్య నాయకులను మాత్రమే కాకుండా తమ మిత్ర పక్షాల పార్టీ నాయకులను కూడా రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బిజీ బిజీగా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. వరుసగా రెండు దఫాలుగా అధికారంలో ఉండి చేపట్టిన కార్యక్రమాలను గురించి బీజేపీ ప్రచారం చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల కలిగిన ప్రయోజనాల గురించి కూడా బీజేపీ వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైపలు కొత్త పథకాలను తీసుకు రావడంతో పాటు జాతీయ స్థాయిలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు ప్రాజెక్ట్ లను తీసుకు వస్తున్నాం.. తప్పకుండా భవిష్యత్తులో రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేస్తాం అంటూ హామీ ఇస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు హోం మంత్రి అమిత్ షా కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా కర్ణాటకలో ప్రచారం చేయించేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కేంద్రం లో మూడవ సారి అధికారంలోకి రావడానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కీలకం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply