NTR30 బ్లాస్టింగ్ అప్‌డేట్‌ ఫ్రెమ్ NTR30 కింగ్ ఆన్ ద వే.

బ్లాస్టింగ్ అప్‌డేట్‌ ఫ్రెమ్ NTR30 కింగ్ ఆన్ ద వే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ‘NTR30’ కోసం ఎంతగా వేచి చూస్తున్నారో.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ట్వీట్ చూస్తుంటే తెలుస్తోంది. ‘NTR30’ అప్‌డేట్ కోసం ఎప్పుడెప్పుడా అని కళ్లకు ఒత్తులేసుకుని మరీ ఎదురుచూస్తున్న అభిమానులకు.. ‘NTR30’ నిర్మాతలు ఓ బ్లాస్టింగ్ అప్‌డేట్ ఇచ్చినట్లుగా.. ఓ ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఈ ‘NTR30’ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న విషయం తెలిసిందే. తాజాగా యువసుధ ఆర్ట్స్ ట్విట్టర్‌ పేజీ.. అంటూ, అందులో
‘‘ ‘NTR30’.. కింగ్ ఆన్ ద వే..చాలా కాలం వెయిట్ చేయించినందుకు సారీ..ఇక టైమ్ వచ్చేసింది..2 రోజులలో బ్లాస్టింగ్ అప్‌డేట్ రాబోతోంది.. రెడీగా ఉండండిఅగ్నిపర్వతం బద్దలయ్యేందుకు సిద్ధం’’ అంటూ రాసి ఉంది. దీంతో, ఇంకేముంది ‘NTR30’ అప్‌డేట్ వస్తుంది అంటూ ఒకటే వార్తలు. నిజంగా ఇది అప్‌డేట్ అనుకుని ఎన్టీఆర్ అభిమానులు ఈ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ.. సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు. అయితే.. సరిగ్గా చూస్తే తప్ప ఇది ఫేక్ అకౌంట్ అని అనిపించనంతగా.. ఈ ట్వీట్ ఉండటం విశేషం. నిజంగా ఇది అప్‌డేట్ అనుకుంటే మాత్రం.. తప్పులో కాలేసినట్టే. ఇది ఫేక్ అకౌంట్.
యువసుధ ఆర్ట్స్ ఒరిజినల్ ట్విట్టర్ అకౌంట్‌లో అక్టోబర్ 5న దసరా శుభాకాంక్షలతో చేసిన ట్వీట్ తప్ప.. ఇంకో ట్వీట్ లేదు. కానీ.. ఈ ఫేక్ అకౌంట్‌లో వరసగా ‘NTR30’కి సంబంధించిన అప్‌డేట్స్ అంటూ.. ఒకటే ట్వీట్స్. సో.. ఇదంతా ఫ్యాన్స్ పని. యంగ్ టైగర్ సినిమా అప్‌డేట్ కోసం వారు ఎంతగా వేచి చూస్తున్నారనేదానికి నిదర్శనమే.. ఈ ఫేక్ ట్విట్టర్. అయితే కొందరు నెటిజన్లు ఇది ఫేక్ అకౌంట్ అని గుర్తించేశారు. గుర్తించడమే కాదు..

కామెంట్స్‌తో.. వారి స్టయిల్‌లో ఫేక్ అకౌంట్‌పై రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం.. ఈ ఫేక్ అకౌంట్‌లో మ్యాటర్ నిజమైతే ఎంత బావుణ్ణు అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. మొత్తంగా మాత్రం ‘NTR30’ ఈ ఫేక్ ట్వీట్‌తో మరోసారి ట్రెండ్ అవుతూ.. అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. మరి ఈ ట్వీట్ చూసిన తర్వాతైనా.. మేకర్స్‌లో కదలిక వస్తుందేమో చూద్దాం.
______________ యాక్షన్ ఎంటర్టైనర్‌తో రానున్న నందమూరి హీరో..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చాలా కాలంగా సాలిడ్ హిట్ కొట్టాడని ప్రయత్నిస్తున్నారు. అప్పుడెప్పుడో అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మంచి హిట్ అందుకోలేకపోయారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం పడలేదు. అయితే రీసెంట్ గా వచ్చిన బింబిసారా సినిమా మాత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ముందు నుంచి ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ.. ఆగస్ట్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఈ సినిమాతో వశిష్ట నూతన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమ్యాడు. మొదటి సినిమాతోనే పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వశిష్ట. ఇందులో భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్.. కేథరిన్ కీలకపాత్రలలో నటించారు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ కెరీర్‏లోనే అత్యంత ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే మరో సినిమాను కూడా పట్టాలెక్కించారు కళ్యాణ్ రామ్.క‌ళ్యాణ్ రామ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ 19వ చిత్రమిది. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తోంది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. అయితే బింబిసార సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా పై నందమూరి అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న “హరిహర వీరమల్లు” టీజర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ నటించిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి. రీ ఎంట్రీ తర్వాత పవన్ నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడం ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు పవన్ ఫ్యాన్. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమా హరిహర వీర మల్లు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా మొగలాయిలా కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమానుంచి రీసెంట్ గా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ సంచనల్ను సృష్టిస్తోంది.ఈ టీజర్ విషయానికొస్తే.. ఫస్ట్ గ్లింప్స్ లో మెడల్ని వంచి, కథల్ని మార్చి.. కొలిక్కితెచ్చే పనెట్టుకొని .. తొడకొట్టాడో.. తెలుగోడు అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోగా.. విలన్స్‏ను వేటాడుతూ పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు పవన్. ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఒక రోజులోనే `పవర్ గ్లాన్స్` అన్ని భాషలలో కోటి (10+ మిలియన్ల) పైగా వ్యూస్ ను సంపాదించుకొని రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఎ.ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాదిలో వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన స్టైల్‌ని పక్కనపెట్టి ‘పుష్ప’ చేయడంతో ఆ దెబ్బతో పాన్ ఇండియా లెవల్‌లో ఐకాన్ స్టార్ అయ్యారు. అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన పుష్ప (Pushpa: The Rise) బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 (Pushpa 2: The Rule)ని అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ పట్టాలెక్కింది లేదు.పుష్ప పార్ట్ 1 సాధించిన విజయంతో పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ కావాలి? సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే మన లెక్కల మాస్టార్ సుకుమార్.. పార్ట్ 1 తీసేటప్పుడే కొంత ఫుటేజ్‌ని పార్ట్‌ 2 కోసం దాచిపెట్టేశారు. ఇక పుష్ప రూల్ చేయబోయే పార్ట్ మాత్రమే మిగిలి ఉండటంతో.. మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు పుష్ప షూటింగ్ ఎప్పుడు మొదలౌతుందన్నదానిపై నిర్మాత నవీన్ ఎర్నేని (Naveen Yerneni) క్లారిటీ ఇచ్చారు.అక్టోబర్ నెలాఖరు నుంచి పుష్ప 2 షూటింగ్ ప్రారంభంకాబోతుందని చెప్పారాయన. అక్టోబర్ 20-30వ మధ్య షూటింగ్‌ ఉండబోతుందని.. మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో షూటింగ్ చేసి.. తరువాత అడవి, ఇతర లొకేషన్లకు వెళతాం అని అన్నారు. దీంతో పుష్ప షూటింగ్ ఎప్పుడన్నదానిపై క్లారిటీ వచ్చేసినట్టే.
సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2లో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్‌గా నటించగా.. శ్రీవల్లిగా రష్మిక మందన్న.. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో కనిపించారు. పార్ట్ 2లో వీరి పాత్రలు భిన్నంగా మారబోతున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh