Ambani అంబానీ అదాని మధ్య నలిగిపోతున్న బిర్లా

Ambani అంబానీ అదాని మధ్య నలిగిపోతున్న బిర్లా

మోదీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అంబానీ అదానీలు చాలా వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. మరికొన్ని కంపెనీలను కొనేస్తున్నారు. ఇవి చూస్తుంటే ఏదో జరుగుతుందని అర్థమౌతుంది. కానీ అదేంటో స్పష్టంగా తెలియదు. వారిద్దరూ స్టార్ట్ చేస్తున్న అనేక వ్యాపారాలు ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు ఇది ఎంత వరకు నిజం.. దానిని నిరూపించేందుకు జరిగుతున్న పరిణామాలు ఎంత వరకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయో ఇవాళ్టి బిగ్ analysis లో చూద్దాం.

మనందరి దృష్టిలో ఉన్నవారంటే.. చిన్నప్పటి నుంచి సాధారణంగా వింటున్న పేర్లు టాటాలు, బిర్లాలు మాత్రమే. అయితే ఇప్పుడు బిర్లాలకు చెందిన అనేక లాభదాయకమైన వ్యాపారాలు ఇప్పుడు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. వీటి వెనుకు అంబానీ, అదానీ ఉన్నారా అన్న అనుమానం రాకమానదు. అయితే ఇది ఉత్తి ఊహేనా లేక దీనిని నిజమని నిరూపించేందుకు ఏమైనా వాస్తవాలు ఉన్నాయా అనే విషయాన్ని ఇప్పుడు గమనిస్తే…

భారత్ దేశంలో ఇప్పటి వరకు టాప్-10 సిమెంట్ తయారీ కంపెనీల్లో మెుదటి స్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్స్ ఉంది. ఇది బిర్లా గ్రూప్ లోని కుమార మంగళం బిర్లా యాజమాన్యంలోని కంపెనీ. అయితే ఇప్పుడు అదానీ గ్రూప్ ఈ రంగంలో కీలక పాత్ర కోసం గత నెలలో అంబుజా సిమెంట్, ఏసీసీ సిమెంట్ కంపెనీలను చేజిక్కించుకుంది. అదానీ కొన్న రెండు కంపెనీలు వరుసగా దేశంలోని టాప్-10 సిమెంట్ తయారీ కంపెనీల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇదే క్రమంలో అదానీ గ్రూప్ జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన జేపీ సిమెంట్‌పై పడింది. దీనిని కొనుగోలు చేసేందుకు దాదాపు రూ.4,992 కోట్లను అదానీ వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో అరంగేట్రంతో టెలికారం రంగంలో పెనుమార్పులు వచ్చాయి. ముఖ్యంగా బిర్లాలకు చెందిన ఐడియా సంస్థ లాభాల్లో నుంచి భారీ నష్టాల ఊబిలోకి జారుకుంది. వేల కోట్ల అప్పుల్లో ఉన్న వొడఫోన్ ఐడియా సంస్థ కొన ఊపిరితో ఉంది. కంపెనీని కాపాడాలంటూ గతంలో కుమార మంగళం బిర్లా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఈ సంవత్సరం తన కంపెనీ అవసరాల కోసం స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. అలా జియో రాకతో టాటా డొకొమో, ఎయిర్ సెల్, యూనినార్, విర్జిన్ మెుబైల్స్, వీడియోకాన్ వంటి టెలికాం కంపెనీలు కనుమరుగయ్యాయి.దేశంలోని అల్యూమినియం వ్యాపారంలో కుమార మంగళం బిర్లాకు చెందిన హిందాల్కొ కంపెనీ ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అదానీ గ్రూప్ ఈ వ్యాపారంలోని అరంగేట్రం చేస్తున్నట్లు అగస్టు మాసంలో ప్రకటించింది.

ఇందుకోసం గ్రూప్ ఒడిశా రాష్ట్రంలో మెగా అల్యూమినియం రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం కంపెనీ ఏకంగా 416.53 బిలియన్ రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నట్లు అదానీ ప్రకటించారు. ఇప్పటికే భారత్ అల్యూమినియం దిగుమతిపై అధికంగా ఆధారపడుతోంది.కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీ వస్త్ర వ్యాపారంలో ఉంది. ప్రముఖ ప్యాంటలూన్స్ Pantaloons బ్రాండ్ సైతం బిర్లాలకు చెందినదే. కంపెనీ గత 24 ఏళ్లుగా ఈ రంగంలో Louis Philippe, Van Heusen, Allen Solly, Peter England వంటి ప్రముఖ బ్రాండ్ల పేరుతో వ్యాపారాలను నిర్వహిస్తోంది.

దీనికి పోటీగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ లైఫ్ స్టేల్ Azorte, Mango, Zara, trends వంటి బ్రాండ్స్ కింద వ్యాపారాన్ని విస్తరిస్తోంది.ఫైనాన్స్ వ్యాపారంలో ఆదిత్య బిర్లా గ్రూప్ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో ఆదిత్య క్యాపిటల్ కంపెనీకి సబ్సిడరీగా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇది కుమార మంగళం బిర్లా కింద ఉన్న ఒక వ్యాపార విభాగం. ఈ రంగంలో అదానీ క్యాపిటల్ పేరుతో అదానీ గ్రూప్, పిరమల్ ఫైనాన్స్ పేరుతో ముఖేష్ అంబానీ అల్లుడు ఆనంద్ పిరమిల్ కుటుంబం వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
ఇలా చెప్పుకుంటూ పోతే బిర్లాలు నిర్వహిస్తున్న చాలా వ్యాపారాలను అంబానీ, అదానీ పరోక్షంగానో లేదా ప్రత్యక్షంగానో టార్గెట్ చేస్తున్నారు.

పైగా కుమార మంగళం బిర్లాకు అధిక లాభాలను అందిస్తున్న అనేక రంగాల్లోకి ఈ ఇద్దరు వ్యాపారవేత్తలు రావటంతో చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి బిర్లాలకు. అయితే ఈ చార్టెడ్ అకౌంటెంట్ గుజరాతీలను ఎలా ఎదుర్కొని తన వ్యాపారాలను ముందుకు తీసుకెళ్తారో చూడాల్సిందే. ప్రస్తుతానికైతే వీరిద్దరి నుంచి బిర్లా గ్రూప్ చాలా పెద్ద వ్యాపార ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది…

 

పోలవరానికి మళ్ళీ తిప్పలే…..

click here

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh