BALAKRISHNA మోక్షజ్ఞ స్టార్ హీరో అయిన అది మాత్రం సాధ్యం కాదా??

BALAKRISHNA మోక్షజ్ఞ స్టార్ హీరో అయిన అది మాత్రం సాధ్యం కాదా??

నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. కానీ అది వాయిదా పడుతూనే ఉంది. ఈ ఏడాది అయినా మోక్షజ్ఞ తొలి చిత్రం ఉంటుందేమోనని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. గత నాలుగేళ్లుగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇదిగో అదిగో అంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మోక్షజ్ఞ తన ఫిజిక్ ఇంకా మార్చుకోలేదు. సినిమాలకు రెడీ అవుతున్నట్లు సంకేతాలు కూడా కనిపించడం లేదు.

దీనితో నందమూరి అభిమానులు నిరాశతో ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. సెలెబ్రిటీల భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ జాతకాలు చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మోక్షజ్ఞ కెరీర్ పై హాట్ కామెంట్స్ చేశారు. మోక్షజ్ఞ సినిమాల్లోకి లేటుగా ఎంట్రీ ఇస్తారని వేణుస్వామి అన్నారు. లేటుగా ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగుతాడని జాతకం చెప్పారు. మోక్షజ్ఞ జాతకం ప్రకారం సినీరంగంలో, కళారంగంలో అతడికి మంచి భవిష్యత్తు ఉంది అని అన్నారు. అభిమానులకు గుర్తుండిపోయే నటుడిగా మోక్షజ్ఞ రాణిస్తాడు. ఇక నందమూరి వారసుడు అంటే రాజకీయాల ప్రస్తావన ఉంటుంది. రాజకీయాల విషయానికి వస్తే మోక్షజ్ఞకి పాలిటిక్స్ సాధ్యం కాదు అంటూ వేణు స్వామి హాట్ కామెంట్స్ చేశారు. మోక్షజ్ఞ అసలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడు.

మోక్షజ్ఞని నిలబెట్టేది సినిమాలు మాత్రమే అని వెనుస్వామి అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నందమూరి అభిమానులు మాత్రం ముందు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తే చాలు అని.. రాజకీయాలు తర్వాత చూసుకోవచ్చు అని అంటున్నారు. తాను చెప్పిన విషయాలు చాలా నిజం అయ్యాయి అంటూ వేణుస్వామి తరచుగా క్లెయిమ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంత విషయంలో తాను చెప్పిన జాతకం నిజం అయింది అని వేణు స్వామి అన్నారు. అలాగే జూ.ఎన్టీఆర్ కి రాజయోగం ఉందని కూడా అన్నారు. మరి వేణుస్వామి చెప్పిన జాతకం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూద్దాo..

అన్ స్టాపబుల్ వేదికగా అల్లుడి పరువు తీసిన మామ… బావ షాక్ .. బాలయ్య రాక్..

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ కూడా మొదలైంది. గతేడాది మొదటి సీజన్ తో బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. గెస్ట్ లతో బాలయ్య హోస్టింగ్ బుల్లితెరపై దుమ్ములేపడంతో ‘అన్ స్టాపబుల్ 2’తో సెకండ్ సీజన్ ను కూడా ప్రారంభించారు. తాజాగా Unstoppable 2కు సంబంధిం మొదటి ఎపిసోడ్ ను విడుదల చేశారు.

రెండో సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ లోకి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు టీడీపీ నేత, బాబు కొడుకు నారా లోకేష్ ను గెస్ట్ లుగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ప్రొమోను తాజాగా రిలీజ్ చేశారు.ప్రొమోలో బాలయ్య తన అల్లుడైన నారా లోకేష్ బండారం బయటపెట్టాడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ సమయంలో లోకేష్ కు సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ బయటికి వచ్చాయి. విపరీతంగా వైరల్ అయ్యాయి. అదే ఫొటోలను చూపిస్తూ బాలయ్య మరోసారి లోకేష్, చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. లోకేష్ కు బాలయ్య కూతురు బ్రహ్మణితో వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే లోకేష్ మాత్రం వేరే అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడుతూ, బీచ్ లో తిరుగుతూ కొన్ని ఫొటోలు అప్పట్లో బయటికి వచ్చాయి.

ఈ ఫొటోలు అసెంబ్లీ వరకు వెళ్లాయని, ఆ ఫొటోల వెనకున్న కథేంటని ‘అన్ స్టాపబుల్’ షోలో క్లారిటీ అడిగారు. దీనిపై లోకేష్ సమాధానం ఏంటనేది ఫుల్ ఎపిసోడ్ లో తెలియనుంది. ఇదే ప్రశ్న చంద్రబాబును అడగ్గా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ‘మామకు లేని సందేహం నాకెందుకు’ అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దీంతో పాటు నందమూరి, నారా కుటుంబ విషయాలపై ఈ ఎపిసోడ్ లో చాలానే విషయాలు చర్చించారు. అలాగే చంద్రబాబు 1995లో తీసుకున్న కీలక నిర్ణయంపైనా నోరువిప్పడంతో ‘అన్ స్టాపబుల్ 2’ మొదటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీగా ఉంటున్నబాలయ్య.. ఓటీటీ వేదికన ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’తో ప్రేక్షకుల్లో మరింత ఎత్తుకు ఎదిగారు. ఆయన అసలైన వ్యక్తిత్వం, హ్యూమరస్, చిలిపితనం అభిమానులు, ఆడియెన్స్ కు ఎంతగానో నచ్చుతోంది. సీజన్ 2 కూడా ప్రారంభం కావడంతో ఖుషీ అవుతున్నారు. మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 14న ‘ఆహా’లో ప్రసారం కానుంది.

‘అఖండ’ కి ఫిలిం ఫేర్ ఎలా మిస్సైంది?

కంటెంట్..మ్యూజిక్ సహా అన్ని విభాగాల్లోనూ సక్సెస్ అయిన అఖండకు ఫిలింఫేర్ అవార్డులు దక్కడం ఖాయమని నెట్టింట పెద్ద ఎత్తున చర్చ సాగింది. కానీ అనూహ్యంగా ఫిలిం ఫేర్ అఖండకి ఊహించని షాక్ ఇచ్చింది. ఏ ఒక్క విభాగంలోనూ అఖండని అవార్డుకు ఎంపిక చేయకపోవడంపై అభిమానులు సహా విశ్లేషకుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.ప్రతిగా ఇదే వేదికపై పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయి సక్సె స్ అయిన పుష్ప ది రైజ్కి అవార్డు రావడంతో మంట మరింత చెలరేగుతోంది. ఇప్పుడీ రెండు సినిమాలకు ముడి పెట్టి నెట్టింట కొత్త రకం ప్రచారానికి తెర తీసారు. పుష్ప ..అఖండ కన్నా గొప్ప సినిమానా? బాలయ్య…బన్నీ పోటీకి దిగితే బాలయ్యదే అప్పర్ హ్యాండ్ అవుతుంది.

కంటెంట్ పరంగానూ రెండు సినిమాల మధ్య చాలా వ్యత్సాసం ఉంది. ‘అఖండ’ లో బాలయ్య అఘోర పాత్ర పోషించి హిందు మతతత్వ గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం చేసారు. బన్నీ అడవి సంపదను ఎలా దోపికి గురి చేయాలో చెప్పాడు? మరి ఈ ఇద్దరిలో అవార్డు ఎవరికి ఇవ్వాలి. మంచి చెప్పినవాళ్లకి..చెడు చెప్పినవాళ్లకా? అంటూ బాలయ్య అభిమానులు ప్రశ్నిస్తున్నారు.అలాగని బన్నీని వ్యక్తిగతంగా టార్గెట చేయలేదు. ఫిలిం ఫేర్ నిర్వహించేది హిదీ సంస్థలు. కాబట్టి పుష్పకి పాన్ ఇండియా కేటగిరిలో పెద్ద సక్సెస్ అయిన నేపథ్యంలో అవార్డు ఇచ్చి ఉండొచ్చు. కానీ అదే సమయంలో అఖండని హిందీ లో డబ్ చేసి వదిలితే సునామీ సృష్టించేది.

బోయపాటి తీసుకున్న అఘోర పాత్ర గురించి హిందీలోనూ చర్చకు దారి తీసింది.ఇలా ఫిలిం ఫేర్ లెక్కించాల్సిన అంశాలు అఖండలోనూ చాలా ఉన్నాయి. కానీ నిర్వాహకులకు అది ఎక్కడా కనిపించలేదు. కనీసం కన్సిడర్ కూడా చేయలేదని అభిమానులు మండిపడుతున్నారు. అటు రాష్ర్ట ప్రభుత్వాలు కొంత కాలంగా నంది అవార్డులను కూడా నిర్వహించలేదు. రెండు రాష్ర్టాల్లోనూ అదే పరిస్థితి. నిర్వహణపై అదిగో ఇదిగో అని చెబుతున్నారు తప్ప అవార్డులిచ్చి పరిశ్రమని ప్రోత్సహించింది లేదు. ఇటీవలే ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh