మెగా కోడలి డెలివరీ ఎక్కడో చెప్పేసిన రామ్ చరణ్

Upasana Konidela Delivery

మెగా కోడలి డెలివరీ ఎక్కడో  చెప్పేసిన  రామ్ చరణ్

మెగా వారి  కోడలు,మెగా పవర్ స్టార్ భార్య  ఉపాసన ఇప్పుడు అభిమానుల్లో సంతోషాన్ని నింపే న్యూస్ ఒకటి లీక్ చేసింది. కొన్ని రోజులు ఉపాసనది సరోగసి అని రూమర్లు రావడం అందరకు తెలిసిందే.  కానీ ఇప్పుడు   ఉపాసనది సహజ గర్భం అని, డెలివరీ కూడా ఇండియాలోనే జరుగుతుందని లీక్ చేసింది ఉపాసన. ఇక ఆ ఆపరేషన్ చేసే డాక్టర్ల వివరాలను కూడా బయటపెట్టేసింది ఉపాసన. ఉపాసన తాజాగా చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ దాదాపు పదేళ్లు ఎదురుచూస్తున్న తరుణం రాబోతోంది. మెగా వారసుడిని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని మెగా ఫ్యామిలితో పాటు, మెగా  ఫ్యాన్స్ అంతా కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్‌ ఉపాసనలు తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారా? అని ఇన్నేళ్లు అభిమానులు అనుకుంటూ ఉండేవారు. ఉపాసన గర్భం దాల్చిందని రామ్ చరణ్‌ తండ్రి కాబోతోన్నాడని చిరంజీవి ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌లో ఆనందాలు అవధులు  లేకుండా వున్నాయి.

అయితే ఉపాసన గర్భం దాల్చిందని చిరంజీవి ప్రకటించిన వెంటనే  అది సరోగసి అని, కృత్రిమ గర్భం అని కామెంట్లు వినిపించాయి. ఆ తరువాత కొన్ని చోట్ల ఉపాసన బేబీ బంప్ పిక్స్ కూడా దర్శనమిచ్చాయి. దీంతో అది సహజ గర్భమే అని అంతా అనుకున్నారు  కానీ ఉపాసన గర్భంలో ఎలాంటి మార్పులు కనిపించకపోవడంతో పదే పదే సోషల్ మీడియాలో సరోగసి మీద చర్చలు జరుగుతూ వచ్చాయి.

ఇప్పుడు ఉపాసన తన డెలివరీ గురించి స్వయంగా ప్రకటించింది. ఇండియాలో డెలివరీ చేయించుకుంటానని అది కూడా అపోలో హాస్పిటల్‌లోనే చేయించుకుంటానని ఉపసాన చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సుమన మనోహర్, రూమా సిన్హాలు ఆపరేషన్ చేస్తారని, మీరు (డా.జెన్నిఫర్ ఆస్టన్) కూడా రావొచ్చుగా అని మరో అంతర్జాతీయ డాక్టర్‌ను ఉపాసన కోరింది. దీంతో ఆ డాక్టర్ సైతం వస్తానని చెప్పుకొచ్చింది.

ఇక రామ్ చరణ్‌కు పుట్టబోయే బిడ్డ మీద మాత్రం మెగా ఫ్యామిలీలో చాలా అంచనాలే ఉన్నాయి. చిరు పెద్ద కూతురు సుష్మిత అయితే  రామ్ చరణ్‌కు కొడుకు పుట్టాలని కోరుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తమ ఇంట్లో ఆడపిల్లలే పుడుతూ వచ్చారని, రామ్ చరణ్‌కు కొడుకు పుడితే బాగుంటుందని  తన మనసులోని కోరికను చెప్పుకొచ్చింది  చిరు పెద్ద కూతురు సుష్మిత.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh