మరో ట్విస్ట్ ఇచ్చిన అమరావతి రైతులు

 amaravathi r5 zone: మరో ట్విస్ట్ ఇచ్చిన అమరావతి రైతులు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన వేళ ఆర్‌-5 జోన్ వ్యవహారంపై అమరావతి రైతులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను ఈనెల 14న విచారణ చేపట్టనున్నట్టు ధర్మాసనం చెప్పింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానిక చెందిన పేదలకైనా రాజధానిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ఆర్‌-5 జోన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేశారు. సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా సుప్రీం కోర్టు సీజే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలాల ద్విసభ్య ధర్మాసనం దగ్గర ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాలని రైతుల తరఫున లాయర్ కోరారు.

ఏపీ హైకోర్టు లో ఆర్-5 జోన్‌ పై కేసు నడుస్తోందని అక్కడ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించామని లాయర్ ధర్మాసనానికి వివరించారు. వచ్చే సోమవారం రోజే విచారణ జరపాలని లాయర్ కోరారు. సోమవారం విచారణ చేయాల్సిన కేసుల జాబితా ఇప్పటికే సిద్ధమైందని, 14న విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.

ఏపీ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. మంగళగిరి మండలంలోని నిడమర్రు,కృష్ణాయపాలెం, కురగల్లు అలాగే తుళ్లూరు మండలంలోని ఐనవోలు, మందడం పరిధిలో 900 ఎకరాలను ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. 2022 అక్టోబరులోనే ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌‌పై విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తమ అభిప్రాయాలను తీసుకోలేదని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశించడంతో రాజధాని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించగా రైతులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మళ్లీ ఇప్పుడు గెజిట్ ఇచ్చారు.

అమరావతి రైతులు ఈ గెజిట్‌పై హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్‌‌, ఇతర అధికారుల్ని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఇతర జిల్లాలు, ప్రాంతాల్లో పేదలందరికి ఇళ్లు పథకం పేరుతో.. రాజధాని కోసం సమీకరించిన భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో హైకోర్టు ఈ జీవోను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు.

అలాగే ఈ ఉత్తర్వులు జోనల్ రెగ్యులేషన్‌కు విరుద్ధమని.. పరిధిని కుదించడమేనన్నారు. రాజకీయ అజెండాలో భాగంగా ఇలా రాజధాని ప్రాంతానికి చెందనివారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారన్నారు. అంతేకాదు స్థానిక ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలను సీఆర్డీఏ పట్టించుకోలేదన్నారు. ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.

రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం న్యాయసమ్మతం కాదని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఈ క్రమంలో మధ్యంతర ఉత్తర్వులపై ఈనెల 19న విచారణ చేపడుతామని ఏపీ హైకోర్టు పేర్కొంది. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సీఆర్డీఏ వైఖరిపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీకి వెళ్లే కరకట్ట పక్కన సీఆర్డిఏకు వ్యతిరేకంగా రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ పొలాలపై తమకే హక్కు లేకుండా చేస్తున్న సీఆర్డీఏ సంస్థ వైఖరిని ఖండిస్తున్నామని ఉండవల్లి రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ తీరును వ్యతిరేకిస్తూ ఉండవల్లి రైతులు ఆందోళనకు కూడా చేశారు. రహదారి విస్తీర్ణం పేరుతో పరిహారంతో సంబంధం లేకుండా మీ పొలాలని మేము తీసుకున్నాం అని సీఆర్డీఏ అధికారులు రైతులకి నోటీసులు ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh