అప్పుడే స్వీట్లు పంచిన కియారా దంపతులు

అప్పుడే స్వీట్లు పంచిన కియారా దంపతులు

బాలీవుడ్  ప్రేమ పక్షులు భార్యభర్తలుగా మారిన  కియారా ఆద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా వివాహం తర్వాత గ్రాండ్ లుక్‌తో మరోసారి మీడియా ముందుకొచ్చారు. తమ పెళ్లి  వేడుకలు జైసల్మేర్‌లో జరిగినందుకు ముంబైలోని మీడియా ప్రతినిధులు, సన్నిహితులకు స్వీట్లు పంచిపెట్టారు. కపుల్స్‌గా మారిన ఈ స్టార్ జోడి పెళ్లి తర్వాత రెడ్ కలర్ పంజాబీ డ్రెస్‌లో కియారా అద్వానీ, సిద్దార్ధ్‌ రెడ్ కలర్  కుర్తా, వైట్ కలర్ పైజామా వేసుకున్నాడు.ఇద్దరూ కలిసి రావడంతో  ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో షేర్ చేశారు. అయితే  హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన వీరి వివాహ వేడుకల ఫోటోలతో పాటు ఒకరినొకరు ముద్దుపెట్టుకున్న ఫోటోలు నిన్నటి వరకు ఇన్‌స్టాలో చక్కర్లు కొట్టాయి.తాజాగా రెడ్ కలర్ డ్రెస్సుల్లో వెరీ సింప్లీగా ఉన్న ఈజంటకు  బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.

ఈ స్టార్ జోడి ఫోటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ కంగ్రాట్స్ చెబుతూ బొకే ఎమోజీలు షేర్ చేస్తున్నారు. కొద్ది గంటల క్రితం షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పటికే పది లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. పెళ్లికి ముందు కలిసి నటించిన కియారా అధ్వానీ, సిద్దార్ద్ మల్హోత్రా పెళ్లి తర్వాత కూడా కలిసి నటిస్తారా లేక వేరు వేరు సినిమాలు చేస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లేకపోతే   బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌ కొందరు ఉన్నట్లుగా హౌస్‌ వైఫ్‌గా కియారా ఫిక్సై పోతుందా అని సందేహాలు వ్యక్తం  కూడా చేస్తున్నారు.  రీసెంట్‌గా జైసల్మేేర్‌లో జరిగిన కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా పెళ్లికి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, అతని భార్య మీరా కపూర్, జూహిచావ్లా, కరణ్ జోహార్‌ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ అటెండ్ అయ్యారు.

ఈ సెలబ్రిటీ స్టార్ జోడి మ్యారేజ్‌ అతి తక్కువ మంది బందువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. నూతన దంపతులుగా మారి కియారా అద్వానీ, సిద్దార్ద్ మల్హోత్రకు పెళ్లికి రాని సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.  ముంబై, ఢిల్లీలో రిసెప్షన్ అరేంజ్ చేస్తున్నారు ఈ స్టార్ కపుల్. అయితే  ఈ రిసెప్షన్‌కి ఎవరెవర్ని ఆహ్వానిస్తారు. ఎప్పుడు అరేంజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు. అలాగే

బాలీవుడ్‌లో రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న జంటల్లో చేరిపోయారు కియారా అద్వానీ, సిద్దార్ద్ మల్రోత్రా. వీరు కూడా రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌లా త్వరగానే పిల్లల్ని కంటారా అనే చర్చ కూడా నడుస్తోంది.

షడన్‌గా స్వీట్ బాక్సులు పంచి పెట్టిన నూతన దంపతులు కియారా అద్వానీ, సిద్దార్ధ్ ఫోటోలు, వీడియోలు చూసి కొంత మంది అప్పుడే ఆ గుడ్ న్యూస్ కూడా చెబుతున్నారా ఏంటీ అని సెటైర్లు వేస్తున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh