AP: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో

AP

AP: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో 9 మంది విద్యార్థుల ఆత్మహత్య

AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 63 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఈ పరీక్షల్లో కష్టపడి చదివి, ఎంతో బాగా రాసిన విద్యార్థులు సైతం ఫెయిల్ అయ్యారు.

ఇలాంటి పలువురు తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.

AP ఇంటర్‌ పరీక్షల్లో పాస్ కాలేదని.. మార్కులు తక్కువ వచ్చాయనే కారణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు, విశాఖ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. అనకాపల్లి, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ప్రాణాలు తీసుకున్నారు. మరో ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. పూర్తి వివరాలు ఇలా..  చిత్తూరు జిల్లాకు పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన అనూష (17) అనే విద్యార్థిని ఇంటర్‌లో ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయింది.

ఇటీవల అనూష కర్ణాటకలోని అమ్మమ్మ ఊరు వెళ్లగా.. ఫలితాలు వచ్చిన విషయాన్ని తల్లి ఫోన్ చేసింది. రెండు రోజుల్లో వచ్చి ఫీజు కడతానని.. ఈసారి తప్పకుండా పాస్ అవుతానని చెప్పింది అనూష. అయితే ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ.. అమ్మమ్మ ఊర్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన బాబు(17) అనే విద్యార్థి ఇంటర్‌ సెంకడ్ ఇయర్ ఎంపీసీలో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్థాపానికి గురై.. పురుగుల మందుతాగి ప్రాణాలు తీసుకున్నాడు.

Also View

Karnataka Visit: రేపు ప్రచారం చేనున్న ప్రధాని మోదీ

అనకాపల్లికి చెందిన కరుబోతు తులసీ కిరణ్‌ (17) ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్‌ (17) అనే విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయనే బాధతో రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. తరుణ్ తల్లిదండ్రులు రాజమండ్రికి వలస వెళ్లి కూలీలుగా పనిచేస్తున్నారు. కొడుకు మరణంతో విషాదంలో ముగినిపోయారు. విశాఖపట్నానికి చెందిన మహిళ తన కూతురు అఖిలశ్రీ (16)ను కూలీ పనులకు వెళ్లి చదివిస్తోంది. ఇంటర్‌లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడింది.

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో 9 మంది విద్యార్థుల ఆత్మహత్య

వైజాగ్ పల్నాటి కాలనీ శ్రీనివాసనగర్‌కు చెందిన బోనెల జగదీష్‌ (18) ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ కావడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జగదీష్ తండ్రి లేదు. తల్లి రామలక్ష్మి కష్టపడి కుమారుడిని చదవిస్తోంది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్‌కు చెందిన మహేష్‌ (17) ఇంటర్ పరీక్షలకు హాజరుకాలేదు. ఈ విషయంపై తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన ప్రాణాలు తీసుకున్నాడు.

అలానే ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామకు చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి షేక్‌ జాన్‌ సైదా(16)కు గణితంలో 1, ఫిజిక్స్‌లో 6, కెమిస్ట్రీలో 7 మార్కులు వచ్చాయని గురువారం ఉదయం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అధికారులు తమ కుమారుడి పరీక్ష పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేదని, తమ బిడ్డ మరణానికి అధికారులే బాధ్యత వహించాలని సైదా తల్లిదండ్రులు ఆరోపించారు. ఇక అదే జిల్లాలోని చిల్లకల్లుకు చెందిన విద్యార్థి రమణ రాఘవ సీనియర్‌ ఇంటర్‌లో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఈయర్, సెకండ్ ఈయర్ కలిపి మూడు సబ్జెక్టులు ఫెయిల్‌ అయ్యాడు. దాంతో మనస్తాపానికి గురైన సదరు విద్యార్థి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసి ప్రాణాలు విడిచాడు.

విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన ఓ విద్యార్థి, రాజాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి ఆత్మహత్యకు యత్నించారు. వీరిద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జీవితమంతా తమ ముందు ఉందని, వైఫల్యాన్ని విజయవంతంగా మార్చుకోవచ్చని, విద్యార్థులు విపరీత చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు, సైకాలజిస్టులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh