JR NTR టైమ్ ఎలా చూడాలో చెప్పి 20 డాలర్లు నొక్కేసిన తారక్.

JR NTR టైమ్ ఎలా చూడాలో చెప్పి 20 డాలర్లు నొక్కేసిన తారక్… ఏది ఊరికే చేయకూడదు బయ్యో.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. అందరితో సరదాగా ఉండే తారక్ ఛాన్స్ దొరికితే ఇతరులను ఆట పట్టిస్తూ ఉంటారు.
అలా స్వాతిముత్యం హీరో బెల్లంకొండ గణేష్ ని తన 6 ఏళ్ల వయసు అప్పుడు. ఆటపట్టించిన విషయం రెసెంట్గా ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.. అదేంటంటే ..
తనకి 6 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఆది సినిమా షూటింగ్ జరిగిందంట.అప్పటినుంచి సెలవులు ఉండి షూటింగ్ జరుగుతుంటే షూట్ జరుగుతున్న ప్లేస్ వెళ్లిపోయేవాడంటగణేష్ .సెట్ వాతావరణాన్ని తనుచాలా ఇష్టపడేవారట.అయితే బయటినుంచి షూటింగ్ సెట్ ను చూస్తే ఎవరు ఏం చేస్తున్నారో అర్థం అయ్యేది కాదట.

మానిటర్ దగ్గరికి వెళ్లి చూడగానే ఒక చిన్న షాట్ కోసం 200 మంది పని చేయడం తనకి చాలా ఆసక్తిని పెంచిందని. అందుకే సెట్ లో ఏదో ఒక పని చేయాలని అనుకున్నారట.యాక్టర్ గా ఛాన్స్ రావడంతో యాక్టింగ్ లోకి వచేశానని….తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేసినా ఇండస్ట్రీలోనే ఏదో ఒక విధంగా ఉంటానని గణేష్ చెప్పుకొచ్చారు….అయితే తన చిన్నప్పుడు ఎన్టీఆర్ కి తనకి మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ని ఈ సందర్బంగా షేర్ చేసుకున్నాడు గణేష్ ..

నాకు మొదట వాచ్ లో టైమ్ చూసుకోవడం నేర్పించింది జూనియర్ ఎన్టీఆర్ గారు ..ఆది షూటింగ్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లగా వాచ్ లో టైమ్ ఎలా చూడాలో చెప్పినందుకు గణేష్ దగ్గర నుంచి 10 డాలర్లు, వాళ్ళ అన్నయ్య శీను కి టైమ్ ఎలా చూడాలో నేర్పించి అన్నయ్య దగ్గర 10 డాలర్లు మొత్తం 20 డాలర్లు తారక్ తీసుకున్నారని గణేష్ చెప్పుకొచ్చారు.ఆ సినిమా ఎక్స్ పీరియన్స్ ఫన్ ఎక్స్ పీరియన్స్ అని గణేష్ ..తారక్ తో తన స్వీట్ మెమోరీస్ ని షేర్ చేసుకున్నాడు.

 

నాని దసరా బిజినెస్ 100 కోట్లు.

నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుని అయితే చాలాకాలం అయింది. డిఫరెంట్ సినిమాలు ట్రై చేస్తున్నాడు కానీ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ రికార్డు స్థాయిలో అయితే ప్రాఫిట్స్ అందించడం లేదు. చివరగా నటించినా అంటే సుందరానికి సినిమా చాలా చోట్ల నష్టాలను మిగిల్చింది. అంతకంటే ముందు వచ్చిన శ్యామ్ సింగరాయ్ మాత్రం పరవాలేదు అనిపించే విధంగా పెట్టిన పెట్టుబడిన వెనక్కి తెచ్చింది.

అయితే ఆ రెండు సినిమాల ఫలితాలపై నాని అయితే సంతృప్తిగా లేడు. ఇక ప్రస్తుతం అతని నమ్మకం మొత్తం కూడా దసరా సినిమాపైనే ఉంది. కొత్తదర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ కారణాల వలన మధ్యలో ఆగిపోవచ్చు అని టాక్ కూడా వచ్చింది. అంతేకాకుండా దీన్ని మరొక నిర్మాత ఆధీనంలోకి తీసుకున్నాడు అని కూడా వార్తలొచ్చాయి.
అయితే నిర్మాత చెరుకూరి సుధాకర్ మాత్రం అందులో ఎలాంటి నిజం లేదని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఇటీవల విరాటపర్వం రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ఊహించిన విధంగా డిజాస్టర్స్ అందుకున్నప్పటికీ కూడా ఈ సినిమాను 50 కోట్ల పెట్టుబడి తో తెరపైకి తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి డీల్స్ అయితే సెట్ అయినట్లుగా తెలుస్తోంది.ముఖ్యంగా ఓటీటీ హక్కుల ద్వారానే ఈ సినిమాకు దాదాపు 30 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం.

దసరా సినిమాను పాన్ ఇండియా లెవెల్లో మిగతా భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. అయితే మిగతా భాషలో ఈ సినిమా దాదాపు పది కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఇక శాటిలైట్ పరంగా మరో 20 కోట్లు రావచ్చు అని తెలుస్తోంది.ఇలా మొత్తంగా చూసుకుంటే దసరా సినిమా నాన్ థియేట్రికల్ గానే 60 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు నిర్మాత పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చినట్లే అనిపిస్తోంది. ఇక థియేట్రికల్ గా చూసుకుంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 40 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయవచ్చు అని సమాచారం.అంటే మొత్తంగా దసరా సినిమా 100 కోట్ల బిజినెస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ సినిమా నాని కెరీర్ కు చాలా ముఖ్యం కాబోతోంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

వాల్తేరు వీరన్నతో ‘క్రాక్’ చూపనున్న రవితేజ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న మెగా154 కి వాల్తేరు వీరన్న అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. టైటిల్ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు వైజాగ్ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు రవితేజ కూడా పాల్గొని కీలక సన్నివేశాల చిత్రీకరణ లో పాల్గొన్నాడు.

మెగా 154 సినిమాలో చిరంజీవి పాత్ర దాదాపుగా పూర్తి అయ్యిందట.. చిత్రీకరణ పూర్తి చేసుకున్న రవితేజ ప్రస్తుతం తన సినిమా రెగ్యులర్ షూట్ లో జాయిన్ అయ్యాడు. త్వరలో ధమాకా సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ తాజాగా చిరంజీవి సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
రవితేజ ఇటీవలే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్నాడు. క్రాక్ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే.
మళ్లీ మెగా 154 సినిమాలో కూడా రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్న నేపథ్యంలో తప్పకుండా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.గతంలో రవితేజ విక్రమార్కుడు సినిమాలో కూడా పోలీస్ గా కనిపించాడు.

బాబీ ఈ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్నాడు. చిరంజీవి కూడా చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుని మరీ సినిమాను చేయడం జరిగింది.వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది. చిరంజీవికి జోడీగా ఈసినిమా లో శృతి హాసన్ నటించిన విషయం తెల్సిందే.

గాడ్ ఫాదర్ తో చాలా కాలం సస్పెన్స్ కి నాగ్ తెర దించాడా?

గాడ్ ఫాదర్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు మోహన్ రాజా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారబోతున్నాడు. తమిళ్ లో ఈయన ఇప్పటికే ఫేమస్ దర్శకుడు. కానీ గాడ్ ఫాదర్ చేసే సమయంలో ఆయన్ను కొత్తవాడిగానే చూడటం జరిగింది. చిరంజీవిని అద్భుతంగా చూపించడంలో సక్సెస్ అయిన దర్శకుడు మోహన్ రాజా తెలుగు లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ సినిమా యొక్క స్క్రీన్ ప్లే తో పాటు అన్ని విధాలుగా మోహన్ రాజా వర్క్ నచ్చడంతో నాగార్జున ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నాడట.

గత కొన్ని సంవత్సరాలుగా నాగార్జున మరియు మోహన్ రాజా సినిమా సస్పెన్స్ లో ఉంది. చాలా కాలంగా ఈ సినిమా గురించి మీడియా లో చర్చ జరుగుతోంది. కానీ నాగ్ కి నమ్మకం కుదరక ముందుకు సాగలేదు.గాడ్ ఫాదర్ సినిమా తో మోహన్ రాజా తనను తాను నిరూపించుకున్నాడు. దాంతో నాగార్జున అనుమానం లేకుండా స్క్రిప్ట్ కు ఓకే చెప్పాడట.

ఈ ఏడాది చివర్లోనే మోహన్ రాజా తో సినిమాను చేసేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ సినిమాను తన యొక్క హోం బ్యానర్ లోనే నిర్మించాలని కూడా నిర్ణయించాడట.ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బిజీగా ఉన్న మోహన్ రాజా వచ్చే నెల నుండి నాగ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నారట. ఈ సినిమా నాగార్జునకు వందవ సినిమా అవ్వబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.మోహన్ రాజా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అఖిల్ ను నటింపజేయాలని భావిస్తున్నాడట. అందుకు నాగ్ కూడా ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh