గంజాయికి అడ్డాగా ఆంధ్రప్రదేశ్: జనసేనాని
గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులకు గంజాయికి అడ్డాగా మారిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో అంధురాలైన యువతి దారుణ హత్యకు గురైన ఘటనపై స్పందించిన జనసేనాని రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా ? అని ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నివాసానికి సమీపంలో యువతి హత్యకు గురైన ఘటన కలచివేసిందన్న ఆయన.కనీసం కంటి చూపునకు నోచుకోని యువతిని వేధింపులకు గురి చేసి కిరాతకంగా నరికి చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.అత్యాచారానికి హత్య పాల్పడిన వ్యక్తి గంజాయి మత్తులో నేరానికి ఒడిగట్టాడని. గతంలోను పోలీసులు, మహిళలపై దాడులకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారని అన్నారు. ఈ హత్య ఘటనను శాంతిభద్రతల వైఫల్యంగా చూడాలని పవన్ వ్యాఖ్యానించారు.
సీఎం ఇంటి పరిసరాల్లో పటిష్టమైన పోలీసు పహారా, నిఘా వ్యవస్థలు పనిచేస్తాయని. అయినా తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులు, గంజాయికి అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు జనసేనాని. లోపం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఏడాదిన్నర క్రితం ఆ ప్రాంతంలోనే ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుల్లో ఒకర్ని ఇప్పటికీ పట్టుకోలేకపోయారంటే వైఫల్యం ఎవరిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాస పరిసరాల్లో పరిస్థితులనే సమీక్షించకుండా మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా. పేటలో ఉన్నా ఒకటే అని ఎద్దేవా చేశారు. పోలీసు శాఖకు అవార్డులు వచ్చాయి. దిశా చట్టం చేశామని చెప్పుకోవడమే తప్ప రాష్ట్రంలో ఆడబిడ్డలకు మాత్రం రక్షణ లేకుండాపోయిందని విమర్శించారు. అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి అంటే తల్లి పెంపకంలోనే లోపం ఉందని. ఏదో దొంగతనానికి వచ్చి రేప్ చేశారు అంటూ వ్యాఖ్యానించే మంత్రులు ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆడపడుచులపై అఘాయిత్యాలు సాగుతున్నా మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. పదవులు ఇచ్చినవారిని మెప్పించేందుకు రాజకీయపరమైన ప్రకటనలు, నోటీసులు ఇస్తే మహిళలకు రక్షణ, భరోసా దక్కదనే విషయం గుర్తించాలనిఅన్నారు. గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ను మార్చేశారని జనసేనాని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: