వేసవిలో విద్యుత్ కొరత ఉండదు: మంత్రి పెద్దిరెడ్డి

andhra pradesh/guntur/apcdpcl cmd

వేసవిలో విద్యుత్ కొరత ఉండదు: మంత్రి పెద్దిరెడ్డి

రానున్న వేసవి కాలం నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్‌ కొరతకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ సంవత్సరం లక్షకు పైగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. మార్చిలోగా మిగిలిన కనెక్షన్లు కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఆయన.

ఈ మేరకు విద్యుత్‌ సరఫరా, పంపిణీ అంశాలపై సచివాలయంలో జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులతో సోమవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం సమీక్ష వివరాలను మంత్రి పెద్దిరెడ్డి మీడియాకు వెల్లడించారు. మార్చి 31 నాటికి 100కు పైగా సబ్‌స్టేషన్లు ప్రారంభిస్తామని తెలిపారు. జగనన్న కాలనీల్లో త్వరితగతిన విద్యుత్‌ కనెక్షన్లు, సరఫరా లైన్లు పూర్తి చేయడానికి సమీక్షలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో బొగ్గు కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. 2- 3 నెలలకు ఓ సారి బొగ్గు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh