CBSE Result : 2023 CBSE క్లాస్ 12 ఫలితాలు విడుదల

CBSE Result :

CBSE Result : 2023 CBSE క్లాస్ 12 ఫలితాలు విడుదల

 

CBSE Result :సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలు విడుదలయ్యాయి. క్లాస్​ 12 బోర్డు పరీక్షల ఫలితాలను  శుక్రవారం ప్రకటించింది సీబీఎస్​ఈ (సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్జ్యుకేషన్​). మొత్తం మీద 87.33శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్పష్టం చేసింది. కొవిడ్​ ముందు దశ (2019- 83.40శాతం)తో పోల్చుకుంటే..

ఈ సారి మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించింది. అభ్యర్థులు తమ ఫలితాలను results.cbse.nic.in, cbseresults.nic.in వెబ్​సైట్స్​లో చెక్​ చేసుకోవచ్చు.

డిజీలాకర్​, ఉమంగ్​ యాప్​ల ద్వారా కూడా రిజల్ట్స్​ను పొందవచ్చు.

ఈ ఏడాది 87.33శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు.

గతంలో కంటే ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది సీబీఎస్‌సీ 12వ తరగతి పరీక్షలకు మొత్తం 16.60 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కోవిడ్ మహమ్మారి జోరుగా ఉన్న సమయంలో 2019లో 83.40% ఉత్తీర్ణత శాతం కంటే ఈ సారి 87.33% ఎక్కువ ఉత్తీర్ణత నమోదైంది.

అయితే గతేడాది 92.71% కంటే తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

అయితే కాంపిటీషన్​ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈసారి కీలక చర్యలు చేపట్టింది సీబీఎస్​ఈ. ఇందులో భాగంగా.. ఫస్డ్​, సెకెండ్​CBSE Result : , థర్డ్​ డివిజన్​లు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అయితే.. టాపర్స్​కు మెరిట్​ సర్టిఫికేట్​ను ఇవ్వనున్నట్టు పేర్కొంది.

కేరళలోని తిరువనంతపురంలో అత్యధికంగా 99.91శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఉత్తర్​ ప్రదేశ్​లోని ప్రయాగ్​ రాజ్​లో కనిష్ఠంగా 78.05శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఇంకా సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15- మార్చ్​ 21 మధ్యలో ఈ పరీక్షలు జరిగాయి. ఇక క్లాస్​ 12 పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్​ 5 వరకు నిర్వహించింది సీబీఎస్​ఈ. జనవరి 2 నుంచి 14 మధ్యలో ఈ రెండు క్లాస్​లకు ప్రాక్టికల్​ పరీక్షలు సైతం జరిగాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh