The Kerala Story: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘ది కేరళ స్టోరీ’

The Kerala Story:

The Kerala Story: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘ది కేరళ స్టోరీ’ నిర్మాతలు

 

The Kerala Story: వివాదస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’ని  ఎందుకు బ్యాన్‌ చేశారని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే తమిళనాడులో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని నిలదీసింది. వివరణ ఇవ్వాలంటూ ఈ రెండు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై నిషేధం విధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, ద్వేషం లేదా హింసాత్మక సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ఈ సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే శాంతిభద్రతల కారణాలతో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు తమిళనాడులోని థియేటర్ల యజమానులు ప్రకటించారు. ఆదివారం నుంచి ఈ మూవీ షోను నిలిపివేశారు.

కాగా, పశ్చిమ బెంగాల్‌లో ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై నిషేధం, తమిళనాడులో ఈ మూవీని ప్రదర్శించక పోవడంపై సినీ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీని వల్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది. The Kerala Story:

దేశమంతా ఈ సినిమాను ప్రదర్శిస్తుండగా బెంగాల్‌లో నిషేధం విధించడాన్ని కోర్టు ప్రశ్నించింది. ‘దేశంలోని ఇతర ప్రాంతాల కంటే పశ్చిమ బెంగాల్‌ భిన్నం కాదుగా. ఈ సినిమా ప్రదర్శనను ఎందుకు అనుమతించడం లేదు?’ అని నిలదీసింది. ఈ సినిమాను బ్యాన్‌ చేసిన కారణాలను చెప్పాలంటూ బెంగాల్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

‘ది కేరళ స్టోరీ’ వివాదం ఇది.. వివాహానంతరం ఇస్లాం మతంలోకి మారిన తర్వాత ఐసిస్ క్యాంపులకు అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు మహిళలకు ఎదురైన కష్టాలను ‘ది కేరళ స్టోరీ’ వివరిస్తుంది.

]ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించారు. కేరళకు చెందిన 32,000 మంది మహిళలు తప్పిపోయిఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరారని ట్రైలర్‌లో పేర్కొనడంతో సినిమా చుట్టూ పెద్ద వివాదం చెలరేగింది.

Leave a Reply